హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri Kothagudem: భద్రాచలానికి ప్రియాంక గాంధీ.. ఎందుకు వస్తున్నారంటే?

Bhadradri Kothagudem: భద్రాచలానికి ప్రియాంక గాంధీ.. ఎందుకు వస్తున్నారంటే?

భద్రాచలానికి రాక

భద్రాచలానికి రాక

Telangana: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలకు కేంద్రంగా మారుతుంది. ప్రాంతీయ పార్టీల నుంచి మొదలు జాతీయ పార్టీల వరకు వరుసగా భద్రాచలం వైపు క్యూ కడుతున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : క్రాంతి

లొకేషన్ : భద్రాద్రి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలకు కేంద్రంగా మారుతుంది. ప్రాంతీయ పార్టీల నుంచి మొదలు జాతీయ పార్టీల వరకు వరుసగా భద్రాచలం వైపు క్యూ కడుతున్నాయి. వరుసగా వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు తరచూ భద్రాచలంలో ఏదో ఒక హడావుడి చేస్తూనే ఉన్నారు. ఈ నేపద్యంలో కాంగ్రెస్ పార్టీ సైతం భద్రాచల కేంద్రంగా ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.

ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో చేపట్టిన హార్నే హాథ్ జోడో అభియాన్ యాత్రలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన పాదయాత్రకు భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీకారం చుట్టబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచే బీఆర్ఎస్, బీజేపీలపై ఎన్నికల యుద్ధభేరీ మోగించబోతోంది.

ఈ సందర్భంగా నిర్వహించబోయే ప్రారంభసభకు ఏఐసీసీ నేత సోనియాగాంధీతో పాటు ప్రియాంకగాంధీకి ఆహ్వానం పంపారు. వారిద్దరిలో ప్రియాంక గాంధీ ఈ సభకు హాజరవుతున్నట్టు తెలుస్తోంది. సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటుసీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కేంద్రమాజీ మంత్రి రేణుకాచౌదరి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యతోపాటు రాష్ట్ర నలుమూలల నుంచి కాంగ్రెస్ నేతలు సభకు హాజరుకానున్నారు.

లక్షమందితో భారీ బహిరంగసభ నిర్వహించి పార్టీనాయకులు, కార్యకర్తలను రాబోయే ఎన్నికలకు సన్నద్ధం చేయబోతున్నారు. వాస్తవానికి ఈనెల 26 నుంచే కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ పిలుపుమేరకు హాత్సేహాత్ జోడో అభియాన్ పాదయాత్రలు, దేశవ్యాప్తంగా బ్లాకులు, మండలాలలో ప్రారంభించాలని ఏఐసీసీ ఆదేశించింది.

అయితే లోక్ సభ, అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 6 నుంచి ఈ యాత్రలు చేపట్టబోతున్నారు. ఇదిలా ఉండదా భద్రాచలంలోని యాత్ర ప్రారంభించడానికి కారణాలు ఇలా ఉన్నాయని తెలుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కు బలమైన జిల్లాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గుర్తింపు ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ , సీపీఐ పొత్తు ద్వారా జిల్లాలో అరుస్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది.

టీడీపీ రెండుస్థానాలు, ఒక్కస్థానంలో కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆరుగురిలో నలుగురు ఆ తర్వాత టీఆర్ఎస్ లోచేరగా టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు మరో స్వతంత్ర ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ లో చేరారు. దీంతో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిచెందింది.

ఈ నేపథ్యంలో మళ్లీ జిల్లాలో కాంగ్రెస్కు పూర్వవైభవం తెచ్చేందుకు, రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ లోచైతన్యం నింపేందుకే భద్రాద్రి నుంచే ఏఐసీసీ పిలుపునిచ్చిన హాత్సాహాల్ జోడో అభియాన్ యాత్రను ప్రారంభించనున్నారు. భద్రాద్రి డీసీసీ అధ్యక్షుడు పొదెం‌ వీరయ్య భద్రాచలం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రానికి ఈశాన్య ప్రాంతంగా రాబోయే ఎన్నికల ప్రచారానికి బేరీమోగిస్తే అది విజయసూచికంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

వాస్తవానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భద్రాచలంనుంచి పాదయాత్ర చేయాలని రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అయితే పీసీసీలోని సీనియర్ నాయకులు దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. రేవంత్ ఒక్కరే పాదయాత్ర చేస్తే ఎలా అని, తాము కూడా పాదయాత్రలో ఉంటామని పట్టుబడడంతో రేవంత్ రెడ్డి పాదయాత్ర కాకుండా ఏఐసీసీ చేపట్టిన హాత్సే హాత్ జోడో అభియాన్' ద్వారా రాష్ట్ర నేతలంతా తమ ప్రాంతాల్లో 30 నుంచి 35 నియోజకవర్గాల్లో బాధ్యత తీసుకుని ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాలని సూచించింది.

దీంతో కాంగ్రెస్ సీనియర్లంతా ఆయా జిల్లాల్లో జరిగే పాదయాత్రలో పాల్గొనబోతున్నారు. ఫిబ్రవరి 6న భద్రాచలం నుంచి మోగించబోతున్న ఎన్నికల భేరీ, ప్రచార శంఖారావాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతోంది. దీంతో జిల్లాలో కూడా కాంగ్రెస్ నాయకుల్లో మళ్లీ జోష్ పెరుగుతుందని నేతలు ఆశిస్తున్నారు.

First published:

Tags: Bhadradri kothagudem, Local News, Telangana

ఉత్తమ కథలు