అతడి తియ్యని మాటలకు ఆ అమ్మాయి ఆకర్షితురాలైంది. చూడటానికి స్టైల్‌గా ఉండటంతో అతనితో ప్రేమలో పడింది.పెళ్లి(wedding)చేసుకుంటానని చెప్పడంతో సర్వం సమర్పించుకుంది. తీరా పెళ్లికి ముందే గర్భవతి (Pregnant)అని తెలియడంతో ..ఆ తప్పును సరిదిద్దుకునేందుకు ప్రియుడి మాటలు విని తల్లిదండ్రులకు చెప్పకుండా ఆసుపత్రి (Hospital)కి వెళ్లింది. ఇదంతా జరిగిన తర్వాత చివరకు ఆ అమ్మాయే లేకుండా పోయింది. ఎవరూ ఊహించని దారుణం భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem)జిల్లాలో చోటుచేసుకుంది.
ప్రేమించినందుకు ..
అమ్మాయి, అబ్బాయిల మధ్య ఆకర్షణ ఎంత ప్రమాదానికి దారి తీస్తుందో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఓ సంఘటన సాక్ష్యంగా నిలిచింది. ములకపల్లి మండలం వీకే రామవరం గ్రామానికి చెందిన యువతిని పుసుగుడెంకు చెందిన భూక్యానందు అనే యువకుడు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయిని తన వెంట తిప్పుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను శారీరకంగా లోబర్చుకున్నాడు. పరిచమైన కొద్దిరోజుల్లోనే అనేక సార్లు శారరీకంగా యువకుడు నందు, యువతి కలవడంతో యువతి గర్భం దాల్చింది.
తప్పును సరిదిద్దుకునేలోపే ..
యువతి పెళ్లి కాకుండానే ఐదు నెలల గర్భవతి కావడంతో ప్రియుడు భూక్యా నందు నిజాన్ని బయటకు రానివ్వకుండా చూడాలని ప్రయత్నించాడు. అందులో భాగంగానే ఆమెకు అబార్షన్ చేయించి చేతులు కడుక్కుందామని యువతిని మరో మహిళను వెంటబెట్టుకొని భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. అబార్షన్ చేయమని చెప్పకుండా భార్యగా డాక్టర్లను నమ్మించి ఆమెకు తీవ్ర రక్తస్రావం అవుతుందని చెప్పి అడ్మిట్ చేశాడు. యువతికి డాక్టర్లు ట్రీట్‌మెంట్ చేస్తున్న సమయంలో ఫిట్స్ రావడంతో పరిస్ధితి విషమంగా మారింది. యువతిని ఆసుపత్రికి తీసుకొచ్చిన ప్రియుడు నందుతో పాటు అతని వెంట వచ్చిన మరో మహిళ అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు.
ప్రాణాలు పోగొట్టుకున్నయువతి..
ట్రీట్‌మెంట్ చేస్తుండగానే యువతి కండీషన్ సీరియస్‌గా మారడంతో చనిపోయింది. ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు విషయాన్ని ఆమెను తీసుకొచ్చిన వాళ్లకు చెబుదామని ప్రయత్నించే లోపే పారిపోవడంతో పోలీసులకు సమాచారం చేరవేశారు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు మృతురాలి వివరాలు తెలుసుకొని ఆమె తల్లిదండ్రులకు సమాచారం తెలియపరిచారు. కాలేజీకి వెళ్తున్న తమ కూతురు ఓ మాయగాడి మాటలు నమ్మి ప్రాణాలు పోగొట్టుకోవడంతో యువతి తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు డాక్టర్లను ఎలా చనిపోయిందని ఆరా తీయడంతో ఆమె గర్భవతి అని అబార్షన్ చేయించడానికి భార్యగా పరిచయం చేసి ఆసుపత్రిలో చేర్పించాడని చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. కేసు నమోదు చేసుకొని యువకుడ్ని, అతనితో పాటు వచ్చిన మహిళను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.