హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri: కిడ్నాప్ అయిన గిరిజన విద్యార్థిని కేసులో సంచలన ట్విస్ట్.. అసలేం జరిగింది..?

Bhadradri: కిడ్నాప్ అయిన గిరిజన విద్యార్థిని కేసులో సంచలన ట్విస్ట్.. అసలేం జరిగింది..?

భద్రాద్రి బాలిక మిస్సింగ్ కేసులో ట్విస్ట్

భద్రాద్రి బాలిక మిస్సింగ్ కేసులో ట్విస్ట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) బూర్గంపాడు మండలంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల నుంచి అదృశ్యమైన గిరిజన విద్యార్థిని కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. అదృశ్యమైన బాలికను ఆ మరుసటి రోజే గుర్తించిన పోలీసులు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంకు సంబంధించి ఆదివారం బాలిక చెప్పిన విషయాలు సంచలనం కలిగిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Bhadrachalam, India

Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) బూర్గంపాడు మండలంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల నుంచి అదృశ్యమైన గిరిజన విద్యార్థిని కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. అదృశ్యమైన బాలికను ఆ మరుసటి రోజే గుర్తించిన పోలీసులు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంకు సంబంధించి ఆదివారం బాలిక చెప్పిన విషయాలు సంచలనం కలిగిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే బూర్గంపాడు మండలంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల నుంచి అదృశ్యమైన విద్యార్థిని కోసం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జి వినీత్ ఆదేశాల మేరకు పాల్వంచ డిఎస్పి సత్యనారాయణ ఆధ్వర్యంలో 30కి పైగా పోలీస్ టిమ్ లు జిల్లాను జల్లెడపట్టాయి. ఈ నేపథ్యంలో అదృశ్యమైన మరుసటి రోజున పాఠశాలలోని పైఅంతస్తులో బల్లల కింద మూలన పడుకున్న బాలికను తోటి విద్యార్థులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకుని మూలన పడుకుని ఉన్న బాలికను బయటకు తీసి తల్లిదండ్రులకు అప్పగించారు. అదృశ్యమైన బాలిక పాఠశాలలోనే ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కాగా, ఆదివారం బాలిక చెప్పిన వివరాలు ప్రకారం "నన్ను కిడ్నాప్ చేశారు. నలుగురు వ్యక్తులు రాత్రి వేళలో హాస్టల్ నుంచి బయటకు తీసుకెళ్లారు. ఓ షాపు దగ్గర నాకు బిస్కెట్ ప్యాకెట్ కొనిపెట్టారు. ఆ తరువాత చేతులకు, కాళ్లకు , మూతికి గుడ్డలు కట్టి ఓ పెద్ద సంచిలో కుక్కారు. మరుసటి రోజు తెల్లవారుజామున నన్ను హాస్టల్ వద్దకు తీసుకువచ్చారు. హాస్టల్ ప్రహారీ పైనుంచి ఇద్దరు వ్యక్తులు బయట ఉండి మరో ఇద్దరు గోడ దూకి లోపలకు వెళ్లారు. నన్ను బయట ఉన్న వ్యక్తులు లోపలికి వచ్చారు. గోడదూకి వచ్చిన ఇద్దరు వ్యక్తులు నన్ను హాస్టల్లోనిపై అంతస్తుకు తీసుకువచ్చి బల్లల కింద ఓ మూలకు నెట్టారు. ఆ తరువాత చేతులకు, కాళ్లకు , మూతికి ఉన్న కట్లు విప్పారు. నేను భయంతో అక్కడే కదల కుండా పడుకున్నాను" అంటూ విద్యార్థిని తెలిపింది. అయితే బాలిక అదృశ్యం ఆ తరువాత జరిగిన పరిణామాలపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఇది చదవండి: కలలు కన్నాడు వాటిని సాకారం చేసుకుంటున్నాడు.. నేటి తరానికి ఆదర్శంగా పెద్దపల్లి యువకుడు

ఈ క్రమంలోనే ఆదివారం బాలికతో పాటుగా ఆమె తల్లిదండ్రులు, పీడీఎసీయూ, న్యూడెమోక్రసీ నాయకులు బూర్గంపాడు మండలం కేంద్రంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి బాలిక అదృశ్యం ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో హాస్టల్ వంట మనిషి , సిబ్బంది పాత్రపై కూడా వారు తీవ్ర ఆరోపణలు చేశారు.

విద్యార్థిని అదృశ్యమైన ఘటనలో వారు కీలకంగా వ్యవహరించారని పీడీఎస్యూ , ఎన్డీ నాయకులు ఆరోపించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న దారుణాలపై ఐటీడీఏ అధికారులు కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని , లేకుంటే మానవ హక్కుల కమిషన్ కి వెళ్తామని హెచ్చరించారు.

ఇది చదవండి: రాజన్న భక్తులకు శుభవార్త.. ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల ప్రత్యేక పూజలు

మరోవైపు విద్యార్థిని అదృశ్యం ఘటనలో హాస్టల్ వార్డెన్‌పై సస్పెన్షన్ వేటుపడింది. హాస్టల్ వార్డెన్ సునీతను సస్పెండ్ చేస్తూ ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రూ ఉత్తర్వులు జారీ చేశారు. హిందీ ఉపాధ్యాయిని పద్మావతిని వెల్ఫేర్ అధికారిణిగా నియమిస్తూ తక్షణ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయిని సామ్రాజ్యంకు సైతం షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. మరోవైపు బాలిక అదృశ్యం ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

First published:

Tags: Bhadradri kothagudem, Local News, Telangana

ఉత్తమ కథలు