Home /News /telangana /

BHADRADRI KOTHAGUDEM TRS MLAS WHO HAVE MORPHED NATIONAL FLAG ON THE OCCASION OF PINGALI VENKAIAH JAYANTI SNR MDK

Telangana : జాతీయ జెండా మార్ఫింగ్ చేసి టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రచారం..మండిపడుతున్న దేశభక్తులు

(NATIONAL FLAG)

(NATIONAL FLAG)

Telangana : తెలంగాణలోని కొందరు ప్రజాప్రతినిధులు జాతీయపతాకాన్ని కూడా అవమానించే స్థాయికి దిగజారిపోయారు. జాతీయ జెండా రూపకర్త జయంతి రోజునే జాతీయ జెండా రంగు మార్చి అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India
తెలంగాణ(Telangana)లోని కొందరు ప్రజాప్రతినిధులు జాతీయపతాకాన్ని (National Flag)కూడా అవమానించే స్థాయికి దిగజారిపోయారు. ప్రజలకు మంచి చేస్తామని భారత రాజ్యాంగంపైన ప్రమాణం చేసిన నేతలు.. ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే పదవులు దక్కగానే జాతీయ భావం, జాతీయపతాకం, దేశభక్తిని సైతం విస్మరిస్తున్నారు. దేశలోని ప్రతి పౌరుడు గర్వంగా తలెత్తుకొని నమస్కరించే త్రివర్ణ పతాకం రంగునే మార్చేశారు తెలంగాణలోని అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యే(TRS MLA)లు.

Hyderabad : హైదరాబాద్‌లోని చార్మినార్, గోల్కొండ ఇకపై ఫ్రీగా చూడొచ్చు ..ఎప్పటి వరకు అంటే..?



ఇంత అత్యుత్సాహం తగదు..
సోషల్ మీడియాలో సొంత ప్రచారం కోసం కొందరు నేతలు, వారి అనుచరులు చేస్తున్న చేష్టలతో ప్రజాప్రతినిధులపైన ప్రజలకు అసహ్యం కలిగేలా చేస్తున్నాయి. జాతీయ జెండా రూపకర్త, స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకొని ఆందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. 75ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో మువ్వన్నెల పతాకం రంగు మార్చిన సందర్భాలు లేవు. కాని ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ జాతీయ జెండాలోని తెలుగు రంగు స్థానంలో తన పార్టీ గుర్తు అయినటువంటి గులారీ రంగుతో డిజైన్ చేయించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం దుమారం రేపుతోంది. ఈచర్యను దేశపౌరులు, దేశభక్తులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు.



జాతీయ జెండా రంగే మార్చేస్తారా..
దేశ వ్యాప్తంగా పది రోజుల పాటు స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు నిర్వహించుకోవాలని సాక్షాత్తు సీఎం కేసీఆర్ ప్రకటిస్తే .. రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం జాతీయ జెండాలో రంగులు మార్చి..తమ స్వామిభక్తిని చాటుకుంటున్నారు. ఇక్కడ ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ పోస్ట్ చేసిన ఫోటోని మార్ఫింగ్ చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మరో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అనుచరులు. పినపాకఎమ్మెల్యే రేగా కాంతారావు అభిమానులు కూడా ఇదే అత్యుత్సాహం చూపించారు. ఎమ్మెల్యే ఫోటోతో జాతీయ జెండాలోని తెలుగు రంగును గులాబీ రంగుగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా గ్రూప్‌లలో షేర్ చేశారు.

Telangana : పురుగుల మందు తాగి సర్పంచ్ భర్త సూసైడ్ .. కారణం అదేనంట



సొంత ప్రచారం, స్వామిభక్తి...
అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు ఈ విధంగా ప్రవర్తించడంపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. సమాజంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తులు..ఇలాంటి వాటిని ప్రోత్సహించడం సరికాదని ప్రతి దేశభక్తుడు విమర్శిస్తున్నాడు. ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని..స్వాతంత్ర సమరయోధులు, జాతీయ పతాకాన్ని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టే వాళ్లపై కఠఇన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: National flag, Telangana News, TRS leaders

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు