హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri Kothagudem: మిత్రుడికి ఘన నివాళి.. గత 15 ఏళ్ళుగా మిత్రుడి పేరుతో క్రికెట్ టోర్నమెంట్

Bhadradri Kothagudem: మిత్రుడికి ఘన నివాళి.. గత 15 ఏళ్ళుగా మిత్రుడి పేరుతో క్రికెట్ టోర్నమెంట్

X
స్నేహితుడి

స్నేహితుడి పేరు మీద క్రికెట్ టోర్నమెంట్

Telangana: సంక్రాంతి పండగొచ్చిందంటే చాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల ప్రజలకు క్రికెట్ సంబరాలు మొదలవుతాయి. దేశవళి క్రికెట్ ఏమాత్రం తీసుకొని రైతులు అత్యంత అద్భుతంగా 15 ఏళ్లుగా మండల కేంద్రంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు పలువురు యువకులు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : క్రాంతి

లొకేషన్ : భద్రాద్రి

సంక్రాంతి పండగొచ్చిందంటే చాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల ప్రజలకు క్రికెట్ సంబరాలు మొదలవుతాయి. దేశవాళి క్రికెట్ కు ఏమాత్రం తీసిపోని విధంగా అత్యంత అద్భుతంగా 15 ఏళ్లుగా మండల కేంద్రంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు పలువురు యువకులు. ఉద్యోగ, వ్యాపారాల రిత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన మిత్రులందరు సంక్రాంతి పండుగకు సొంత ఊరు చేరుకొని రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తన మిత్రుడి జ్ఞాపకాలను వారం పాటు నెమరు వేసుకుంటూ అతని పేరుపై రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ విమర్శకులచే ప్రశంసలను అందుకుంటున్నారు యూసుఫ్ మెమోరియల్ క్రికెట్ కప్ నిర్వాహకులు.‌

బూర్గంపాడుకు చెందిన యూసుఫ్ క్రికెట్ ను ప్రాణంగా భావించేవాడు. అతనితో పాటు అతని మిత్రులు క్రికెట్ ఆడుతూ సరదాగా గడిపేవారు. ఈ తరుణంలో రోడ్డు ప్రమాదంలో యూసుఫ్ దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటనలో తీవ్రంగా కలత చెందిన అతని మిత్ర బృందం తమ చిన్ననాటి మిత్రుని మర్చి పోకుండా కలకాలం గుర్తుండిపోయేలా ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు.

అందరు కలిసి చర్చించుకొని అమితంగా ఇష్టపడే క్రికెట్ ఆట కలకాలం తన మిత్రునికి గుర్తుండేలా అతని పేరుతో ప్రతియేటా క్రికెట్ పోటీలు క్రమం తప్పకుండా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బూర్గంపాడులో గత 15 సంవత్సరాలుగా యూసుఫ్ కప్ క్రికెట్ టోర్నీని తప్పకుండా నిర్వహిస్తున్నారు.

తొలుత మండల స్థాయిగా క్రికెట్ పోటీ నిర్వహించిన ఈ మిత్రబృందం అనంతరం జిల్లా, రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను సైతం బూర్గంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించడం గమనార్హం. ఈ మేరకు 15వ యూసఫ్ కప్ క్రికెట్ టోర్నీని గురువారం నుంచి నిర్వహించేందుకు ఆర్గనైజింగ్ కమిటీ అన్ని ఏర్పాట్లను చేసింది. ఈ నేపథ్యంలో గత 15 సంవత్సరాలుగా బూర్గంపాడులో నిర్విరామంగా కొనసాగుతున్న ఈ టోర్నమెంటు స్థానిక దాతల సహకారంతో క్రికెట్ టోర్నమెంట్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. కాగా మొదటి విన్నర్ క్యాష్ ప్రైజు రూ.30 వేలను ఐటీసీ గుర్తింపు కార్మిక సంఘం టి.ఎన్టియుసి అధ్యక్షులు కనక మేడల హరిప్రసాద్ అందజేయనున్నారు. అదేవిధంగా రన్నర్ క్యాష్ ప్రైజ్ రూ.15 వేలు తేజస్విని ఆయిల్ ఫిల్లింగ్ నిర్వాహకులు బొల్లి రామారావు అందజేయ నున్నారు. అదేవిధంగా విన్నర్, రన్నర్ ట్రోఫీలను హైదరాబాదుకు చెందిన డేగల రాజు యాదవ్ అందజేయనున్నారు.

ప్రతి మ్యాచ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ను ఎస్కే సల్మాన్, నల్లమోతు అనిల్ చౌదరి, మిత్ర బృందం అందజేయనున్నారు. అదేవిధంగా తదితర ప్రోత్సాహక బహుమతులను అందజేయనుంది. ఈ యూసుఫ్ కఫ్ క్రికెట్ టోర్నమెంట్ కు ఆర్గనైజింగ్ కమిటీగా అతని మిత్ర బృందం 15 ఏళ్లుగా నిర్విరామంగా నిర్వహిస్తున్నారు.

గౌరవ సలహాదారులుగా ఎండి సోహెల్పాషా, గోనెల సర్వేశ్వరరావు, గోనెల నాని, భజన సతీష్, బొల్లు రవి కుమార్ లు, ఆర్గనైజింగ్ కమిటీ నిర్వాహకులుగా భజన ప్రసాద్, అబ్దుల్ సలీం, కన్నెబోయిన సారధి, మందా ప్రసాద్, బబ్బు రాయుడులు వ్యవహరిస్తున్నారు. నేటి యువత చెడు వ్యసనాలకు బానిసలై జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్న తరుణంలో చనిపోయిన తన మిత్రుడి పేరున ఇంత గొప్ప క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న యూసుఫ్ మెమోరియల్ నిర్వాహకులు నేటి తరం యువతకు ఆదర్శప్రాయం అని చెప్పవచ్చు.

First published:

Tags: Bhadradri kothagudem, Local News, Telangana

ఉత్తమ కథలు