హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri: వీళ్లతో కలిసి మీరు కూడా ఇదే ఆట ఆడుతారా?: 40 గ్రామాల యువకులు ఒకే చోట చేరి ఆడే ఆట

Bhadradri: వీళ్లతో కలిసి మీరు కూడా ఇదే ఆట ఆడుతారా?: 40 గ్రామాల యువకులు ఒకే చోట చేరి ఆడే ఆట

వాలీబాల్​

వాలీబాల్​

వారంతా కూలీ నాలీ చేసుకొని బతికే సామాన్య యువకులు. కాయ కష్టం చేసుకుని బతికే సగటు జీవులు. పొద్దంతా పనిచేసుకొని...వచ్చిన దానితో సంతృప్తి పడే అల్ప జీవులు. ఇదంతా నాణేనికి ఒకవైపు. మరోవైపు వాళ్లంతా క్రీడాకారులు.

 • News18 Telugu
 • Last Updated :
 • Khammam, India

  (D. Kranthi Kumar, News18, Bhadradri Kothagudem)

  వారంతా కూలీ నాలీ చేసుకొని బతికే సామాన్య యువకులు (Youngsters). కాయ కష్టం చేసుకుని బతికే సగటు జీవులు. పొద్దంతా పనిచేసుకొని.. వచ్చిన దానితో సంతృప్తి పడే అల్ప జీవులు. ఇదంతా నాణేనికి ఒకవైపు. మరోవైపు వాళ్లంతా క్రీడాకారులు. సాయంత్రం అయిందంటే నచ్చిన ఆట (Game) ఆడుతూ రోజంతా చేసిన కష్టాన్ని మర్చిపోయి ఆటలోనే ఆనందాన్ని వెతుక్కునే యువకులు. మన దేశంలో ఎక్కువ మంది ఆడే క్రీడల్లో వాలీబాల్ (volleyball) ఒకటి. రాష్ట్రంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో వాలీబాల్‌ కున్న క్రేజ్ ఇంతా అంతా కాదు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే క్రికెట్ కంటే వాలీబాల్‌కే యువత అధిక ప్రాధాన్యమిస్తారు. వాలీబాల్‌ ఆడడం వలన శరీర దారుఢ్యం (Body endurance) పెరగడంతో పాటు రోజంతా ఉత్సాహభరితంగా ఉంటుంది. 12 మంది క్రీడాకారులు ఉంటే సరిపోతుంది.

  భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా దమ్మపేట మండలంలోని సుమారు 40 గిరిజన గ్రామాలకు చెందిన యువకులు సాయంత్రం అయ్యేసరికి వారి వారి ఊళ్ళల్లోని వాలీబాల్ కోర్టుల వద్దకు చేరుకుంటారు. గిరిజన మండలాలలో ముఖ్యంగా దమ్మపేట, అశ్వరావుపేటలోని గిరిజన గ్రామాల్లో యువకులంతా ప్రతిరోజు సాయంత్రం ఒకే చోట చేరి వాలీబాల్ ఆడుతుండడం విశేషం.

  వాలీబాల్ పై తమకున్న మక్కువతో చీకటి పడే వరకు సరదాగా కాలక్షేపం చేయడం వాళ్లకి నిత్య కృత్యం‌. గడిచిన 10, 12 ఏళ్లుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని సుమారు 40కి పైగా గిరిజన గ్రామాలకు చెందిన యువకులు సాయంత్రం వేళల్లో వాలీబాల్ ఆడుకునే దృశ్యాలు కనిపిస్తుంటాయి.

  Nagarkurnool: ఈయన రిపేర్ చేయని ఆయిల్ ఇంజిన్ లేదు: 1945 నుంచి మెకానిక్‌గా చేస్తున్న 94 ఏళ్ల వృద్ధుడు 

  కాలక్షేపం కోసం వాలీబాల్ ఆడడంమొదలుపెట్టిన ఆ యువకులు, కాలక్రమేణా మంచి ప్రావీణ్యం సంపాదించుకుని జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడాకారులుగా గుర్తింపు సంపాదించారు. అంతేకాక ఊరు యువకులంతా ఒకరిని చూసి మరొకరు వారి బాటే పట్టారు. వాలీబాల్ ఆటే వారికి ఆరో ప్రాణమైంది. ఒక్క రోజు ఆట ఆడకపోయినా ఏదో వెలితిగా ఉంటుందని యువకులు అంటున్నారు. గ్రామంలోని కొందరు పెద్దలు సైతం యువకులను ప్రోత్సహిస్తున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Bhadradri kothagudem, Games, Local News

  ఉత్తమ కథలు