హోమ్ /వార్తలు /తెలంగాణ /

పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్..పట్టుకున్న పోలీసులు..ఎక్కడంటే?

పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్..పట్టుకున్న పోలీసులు..ఎక్కడంటే?

X
Cannabis

Cannabis

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చింతూరు నుంచి మహారాష్ట్ర ఉస్మానాబాద్ కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు మహారాష్ట్ర వాసులను బూర్గంపాడు పోలీసులు పట్టుకున్నారు. బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు వెల్లడించిన వివరాల ప్రకారం..బూర్గంపాడు ఎస్ఐ సంతోష్ సిబ్బందితో కలిసి బుధవారం ఉదయం మోరంపల్లి బంజర వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో ఐషర్ మినీ వ్యాన్ ను ఆపిన ఆగకుండా వేగంగా వెళ్లిపోయింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kothagudem, India

రిపోర్టర్ : క్రాంతి

లొకేషన్ : భద్రాద్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చింతూరు నుంచి మహారాష్ట్ర ఉస్మానాబాద్ కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు మహారాష్ట్ర వాసులను బూర్గంపాడు పోలీసులు పట్టుకున్నారు. బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు వెల్లడించిన వివరాల ప్రకారం..బూర్గంపాడు ఎస్ఐ సంతోష్ సిబ్బందితో కలిసి బుధవారం ఉదయం మోరంపల్లి బంజర వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో ఐషర్ మినీ వ్యాన్ ను ఆపిన ఆగకుండా వేగంగా వెళ్లిపోయింది. దీంతో పోలీసులు వెంబడించి అంజనాపురం సమీపంలోని సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ వద్ద పట్టుకున్నారు. వాహనాన్ని బూర్గం పాడు పోలీస్ స్టేషన్ కు తరలించి తనిఖీ చేయగా అందులో 125 ప్యాకెట్లలో 2.64 క్వింటాళ్ల గంజాయి దొరికింది. దీని విలువ సుమారు రూ.53 లక్షలు ఉంటుందని అంచనా.

బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి 5 రోజులు సెలవులు.. మధ్యలో ఒక్కరోజే ఛాన్స్..

వ్యాన్ డ్రైవర్ మహదేవ్ మోహన్ గోడ్కే, క్లీనర్ కిషన్ కాళిదాస్ పవార్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. మంగళవారం వీరితో పాటు సూత్రధారులు పప్పు మామా, సత్యజిత్ కూడా కారు, మినీ వ్యాన్ లో చింతూరు వెళ్లారు. అక్కడ మినీ వ్యాన్ లో గంజాయి ప్యాకెట్లు పెట్టుకుని మహారాష్ట్రకు బయలుదేరారు. పప్పు మామా, సత్యజిత్ కారులో వెళ్లిపోగా లారీ డ్రైవర్, క్లీనర్లు మినీ వ్యాన్ లో వస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వ్యాన్ యజమాని అభిరాం పవార్ పై కూడా కేసు నమోదు చేశామని, కారులో పరారైన పప్పు మామా, సత్యజిత్ల కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. డ్రైవర్, క్లీనర్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్వంచ సీఐ నాగరాజు, ఎస్ఐలు సంతోష్, రమ ణారెడ్డి, ఏసుబు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

ఇన్‌కం ట్యాక్స్‌ రేట్లు సవరించే యోచనలో ప్రభుత్వం..? లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇదే..

ఇదిలా ఉండగా భవిష్యత్తు తరాలకు బాటలు వేయాల్సిన యువత చెడు వ్యసనాలకు లోనవుతోంది. మత్తు సామ్రాజ్యం గ్రామీణ ప్రాంతాలకూ వ్యాపించడంతో అంతులేని అనర్ధాలకు కారణమవుతోంది. ఏజన్సీ ప్రాంతంలో అరుదుగా లభించే గంజాయి అందుబాటులోకి రావడంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలలో చిచ్చురేపుతోంది. జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం వ్యాపారంతో పాటుగా గంజాయి కూడా అందుబాటులో ఉండడంతో యువత దారితప్పుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అధికారుల ఉదాశీనత కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ గంజాయి యథేేచ్ఛగా లభిస్తోంది.

ప్రధానంగా యువతను లక్ష్యంగా చేసుకుని ఈ అక్రమ గంజాయి దందా సాగిస్తున్నట్లు వినికిడి. ఇప్పటికైనా గంజాయి మత్తునుంచి యువతను కాపాడేందుకు సంబంధిత అధికారులు శ్రద్ద వహించి పెడదోవ పడుతున్న యవతను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

First published:

Tags: Bhadradri kothagudem, Crime, Local News, Telangana, Telangana crime news