హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : వెన్నెల వాటర్‌ ఫాల్స్ .. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఉండే ఎంజాయ్‌మెంట్‌ వేరే లెవెల్లో ఉంటుందంతే

Telangana : వెన్నెల వాటర్‌ ఫాల్స్ .. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఉండే ఎంజాయ్‌మెంట్‌ వేరే లెవెల్లో ఉంటుందంతే

Vennela Waterfalls

Vennela Waterfalls

Waterfall: మనసును తట్టిలేపే ఉవ్వెత్తున ఎగిసపడేలా చేసే ఈ జలపాతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీలోని మణుగూరులో ఉంది. వర్షాకాలం కావడంతో ప్రస్తుతం ప్రకృతి ప్రేమికులతో ఈ జలపాతం దగ్గర సందడి వాతావరణం నెలకొంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Manugur, India

  G.SrinivasReddy,News18,Khammam)
  ఎంతో మనోహరం. ఆహ్లాదకరం. చల్లని వాతావరణం. పర్యాటకుల్ని కనువిందు చేసే ప్రకృతి అందం. మనసును తట్టిలేపే ఉవ్వెత్తున ఎగిసపడేలా చేసే ఈ జలపాతం (waterfall). ఇంతటి అద్భుతమైన లొకేషన్ ఎక్కడో యూరప్‌(Europe), స్విట్జర్లాండ్‌ (Switzerland) లోనో ఉంటుంది. లేదంటే సినిమాల్లో ఉన్నాయనుకుంటాం. నిజానికి ఇంతటి బ్యూటిఫుల్ లొకేషన్ తెలంగాణలో అది కూడా మన మధ్యనే ఉంది. చుట్టూ ఉండే కొండా, కోనల్లోనే ఒక హోరులా జలపాతం జారిపోతూ ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem)జిల్లా ఏజెన్సీలోని మణుగూరు(Manuguru)లో ఉన్న ఈ జలపాతం ఇప్పుడు ప్రకృతి ప్రేమికుల్ని తెగ ఆకర్షిస్తోంది.


  Telangana : అంకాపూర్‌ దేశీ చికెన్‌ కర్రీ టేస్టే వేరే .. ఒక్కసారి తింటే వదిలిపెట్టరంతే


  కట్టిపడేస్తున్న జలపాతం..

  చూడగానే మనసును ఆహ్లాదపరిచే జలపాతాన్ని ఎక్కడికో వెళ్లి చూడాల్సిన అవసరం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు వెళ్తే సరిపోతుంది. మణుగూరు మండలం, ఆంజనేయస్వామి ఆలయం ఎదురుగా రధం గుట్టపై ఈ జలపాతం వస్తుంది. ప్రకృతి సోయగాలను చాటిచెప్పే ఈ అందాల జలపాతం చూడడానికి ఎంతో మనోహరంగా ఉంది. వర్షాకాలంలో ఇది మరింత ఉధృతంగా జారిపోతూ ఉంటుంది. ఈ జలపాతాన్ని చూడడానికి ఎంతో మంది పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు ఈ ప్రదేశానికి వస్తున్నారు.


  కొండల్లో ..కోనల్లో ..

  ఎంతో బిజీగా ఉండే నేటి సమాజంలో జీవితాన్ని పరుగుల బండిలా లాక్కెళ్లడం తప్ప ప్రకృతిలోని అందాలను చూసే తీరిక లేకుండాపోయింది. అందుకే వర్షాకాలం వస్తే చాలు ఈ జలపాతం పర్యాటకులతో సందడిగా మారిపోతుంది. ముఖ్యంగా సెలవు రోజుల్లో అన్ని మర్చిపోయి చిన్నాపెద్దా తేడాలేకుండా ఈ జలపాతం వద్ద సేద తీరుతు మానసిక ఉల్లాసం పొందుతుంటారు. ఎక్కడో నయాగరా జలపాతాన్ని టీవీలో సినిమాల్లో చూసి ఆనందించే ప్రకృతి ప్రేమికులు ఈ వాటర్‌ ఫాల్స్‌ని చూసి మంత్రముగ్ధులు అవ్వుతున్నారు. అంతే కాదు ఇది ఎక్కడో దూరంగా కొండా కొనల నడుమలేదు, మణుగూరు పట్టణానికి పక్కనే ఉన్న రథం గుట్టపై జలువారే జలపాతం ఇది.


  Basara IIIT : ఒక్క స్టూడెంట్ మరణంతో రణరంగంగా మారిన బాసర ట్రిపుల్ ఐటీ  పర్యాటకుల మనవి ..

  నగరానికి అత్యంత దగ్గరగా ఉండటంతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తోంది. మణుగూరు ప్రధాన రహదారి నుండి అరకిలోమీటర్ దూరంలో ఉండే ఈ జలపాతాన్ని చేరుకునేందుకు సరైన రహదారి లేక పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ జలపాతాన్నీ పర్యాటక కేంద్రంగా మార్చాలని కోరుతున్నారు. వాటర్‌ఫాల్స్‌కి వెళ్లేందుకు సరైన రహదారిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని పర్యాటకులు కోరుతున్నారు. ఈ జలపాతాన్నీ పర్యాటక కేంద్రంగా మారిస్తే జిల్లాలో ఉన్న పర్యాటక కేంద్రాల్లో ఒక్కటిగా నిలుస్తుందంటున్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Bhadradri kothagudem, Telangana News

  ఉత్తమ కథలు