హోమ్ /వార్తలు /తెలంగాణ /

అనాధ పిల్లలకు అమ్మ.. అనాధ శవాలకు కాటికాపరి.. ఓ మహిళ అంతులేని కథ

అనాధ పిల్లలకు అమ్మ.. అనాధ శవాలకు కాటికాపరి.. ఓ మహిళ అంతులేని కథ

X
భద్రాచలంలో

భద్రాచలంలో కాటికాపరిగా మహిళ

దిక్కుమొక్కు లేని అనాధ శవాలకు ఆమే దిక్కు. కరోనా కాలంలోనే కాకుండా అంతకుముందు ఆ తర్వాత వందలాది అనాధ శవాలకు బాధ్యతాయుతంగా అంత్యక్రియలు చేపట్టింది. ఆ మహిళ పేరు ముత్యాల అరుణ.

  • News18 Telugu
  • Last Updated :
  • Bhadrachalam, India

Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

దిక్కుమొక్కు లేని అనాధ శవాలకు ఆమే దిక్కు. కరోనా కాలంలోనే కాకుండా అంతకుముందు ఆ తర్వాత వందలాది అనాధ శవాలకు బాధ్యతాయుతంగా అంత్యక్రియలు చేపట్టింది. ఆ మహిళ పేరు ముత్యాల అరుణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) భద్రాచలం (Bhadrachalam) పట్టణంలోని వైకుంఠ ఘాట్ లో కాటికాపరిగా విధులు నిర్వహిస్తుంది. గత ఐదేళ్లుగా ఈమె ఈ వృత్తిలో కొనసాగుతుంది. తన భర్త శ్రీనివాసరావు కాటికాపరిగా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందగా.. భర్త చేసిన వృత్తినిభార్య కొనసాగిస్తూ అరకోరా వసతుల మధ్య భద్రాచలంలో చనిపోయిన వారికీ అంత్యక్రియలు నిర్వహిస్తుంది.

స్మశానం అంటే మగవాళ్ళు సైతం భయపడే పరిస్థితి. కానీ మహిళా కాటికాపరిగా విధులు నిర్వహిస్తున్న ముత్యాల అరుణ తాను బతకడమే కాకుండా తనతో పాటు మరో 15 మందికిబాగోగులు చూసుకుంటూ అమ్మగా ఆదరిస్తుంది. నేను బతకాలి.. నాతో ఉన్న వాళ్లనూ బతికించాలి.. నా పేదరికమే నా గుండె ధైర్యం.. బతికున్నోళ్లకంటే చనిపోయిన వాళ్లే మంచోళ్లు.. శ్వాస ఉన్నంత వరకే ఏ బంధుత్వమైనా.. ఊపిరి పోతే అంతే.. శ్మశానం చాలా నేర్పింది.. భర్త ఉన్నప్పుడు శవాలకు దహన సంస్కారాలు, అంత్యక్రియలు చేసేటప్పుడు చూసే దాన్ని. అప్పుడప్పుడు ఆయన తాగి పడుకుంటే ఒక్కదాన్నే ఆ కార్యక్రమాల్ని పూర్తి చేసేదాన్ని. దాంతో భయం లేకుండా పోయింది. కొంత కాలం కిందట ఆయన చనిపోయాడు. ఏం చేయాల్నో తెలియని స్థితిలో అదే వృత్తిని నమ్ముకున్నా.

ఇది చదవండి: పెళ్లైన 15 రోజులకే భార్య, అత్త మర్డర్.. అడ్డొచ్చిన మామని..

భర్త చనిపోయాక 16 రోజులు తిరగక ముందే మా ఆర్థిక పరిస్థితి బాగోలేక శవాలకు దహనం చేయడం మొదలు పెట్టాను. అప్పుడు ఎంతో మంది నన్ను చీదరించుకున్నారు. కానీ ఒక్కదాన్నయితే ఖాళీ కడుపుతో పడుకునే దాన్ని. నాతో పాటు నా పిల్లలు.. నేను పెంచుకుంటున్న వాళ్లు కూడా ఉన్నారు కదా.. అందుకే దహన సంస్కారాలు చేసుకుంటూ వచ్చేదాన్ని.. ఎవరు ఏమన్నా శ్మశానమే నాకు అన్నీ అంటూ న్యూస్ 18తో ముచ్చటించింది.

ప్రస్తుతం కాటికాపరిగా ఉన్నందుకు పంచాయతీ నుంచి రూ.7,500 జీతం వస్తుంది. ఏమాత్రం సరిపోదు. కాల్చేందుకు కట్టెలు, డీజిల్ , కిరోసిన్ కే పోతాయి. ఇక శవాన్ని దహనం చేస్తే వెయ్యి, పదిహేను వందలు ఇస్తారు. కొంతమంది అయితే రూ.500 చేతులో పెడతారు, ఇంకొందరైతే డబ్బులు ఇచ్చేందుకు వాళ్లలో వాళ్లే గొడవ పెట్టకుంటారు. ఇలాంటి ఘటనలు చూస్తే బాధేస్తుంది. అలాంటోళ్ల దగ్గర డబ్బులు తీసుకోకుండానే శవాలకు దహనం చేస్తాను. వచ్చిన మొత్తంతో నాతో పాటే మరో పదిహేను మంది బాగోగులు నేనే చూడాలి. ఈ డబ్బులు ఏమాత్రం సరిపోవడం లేదు. ప్రభుత్వం ఎలాగైనా ఆదుకుంటే బాగుంటుందని బరువెక్కిన హృదయంతో బాధను పంచుకుంది.

First published:

Tags: Bhadrachalam, Local News, Telangana

ఉత్తమ కథలు