హోమ్ /వార్తలు /తెలంగాణ /

School games: అవును.. మునుపటి రోజులు వచ్చేశాయి: పాఠశాల విద్యార్థుల్లో నూతనోత్తేజం

School games: అవును.. మునుపటి రోజులు వచ్చేశాయి: పాఠశాల విద్యార్థుల్లో నూతనోత్తేజం

ములుగులో

ములుగులో ఆటల పోటీలు

కరోనా (Corona) వంటి కారణాలతో పాఠశాల స్థాయి క్రీడలు నిర్వహించలేదు. పాఠశాలలు తిరిగి తెరుచుకున్నా కొన్ని అనివార్య కారణాల వలన క్రీడల పోటీలు (Sports competition) నిర్వహణకు నోచుకోలేదు. విద్యార్థులకు చదువుతో పాటు ఆటలపోటీలు ఉంటేనే వారిలో చురుకుదనం పెరుగుతుంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Khammam, India

  (D Kranthi Kumar, News18, Bhadradri Kothagudem)

  ఎట్టకేలకు పాఠశాల క్రీడలకు (School Games) పట్టిన గ్రహణం వీడింది. గడచిన మూడు సంవత్సరాలుగా కరోనా (Corona) వంటి కారణాలతో పాఠశాల స్థాయి క్రీడలు నిర్వహించలేదు. పాఠశాలలు తిరిగి తెరుచుకున్నా కొన్ని అనివార్య కారణాల వలన క్రీడల పోటీలు (Sports competition) నిర్వహణకు నోచుకోలేదు. విద్యార్థులకు చదువుతో పాటు ఆటలపోటీలు ఉంటేనే వారిలో చురుకుదనం పెరుగుతుంది. అయితే గత మూడేళ్లుగా ఆటల పోటీలు లేకపోవడంతో విద్యార్థులు (Students) తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈక్రమంలోనే పాఠశాల డివిజన్ స్థాయిలో ఆటలపోటీలు తిరిగి ప్రారంభమవడం విద్యార్థుల్లో సంతోషం నింపింది.

  భద్రాచలం (Bhadrachalam) ఏజెన్సీ వ్యాప్తంగా ఉన్న గిరిజన పాఠశాలల్లో (Tribal schools) ఎంతో మంది విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని వారి ప్రతిభను కనబరిచిన సందర్భాలు ఉన్నాయి. భద్రాచలం ఏజెన్సీ అంటేనే క్రీడలకు పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు. అలాంటిది 2019 తర్వాత గ్రామీణ స్థాయిలో క్రీడా పోటీలు జరిగిన సందర్భాలు లేవు. పలు రకాల కారణాలతో ప్రభుత్వం కూడా క్రీడా పోటీలు నిర్వహించలేదు. కానీ ఈ ఏడాది తిరిగి భద్రాద్రి ఏజెన్సీలో క్రీడా సంబరాలు మొదలయ్యాయి. భద్రాచలం ఏజెన్సీ వ్యాప్తంగా 8 మండలాలకు చెందిన పాఠశాల విద్యార్థులకు క్రీడా పోటీలను అధికారులు లాంచనంగా ప్రారంభించారు.

  రెండు రోజుల పాటు జరిగిన పాఠశాలల క్రీడా పోటీలు (School sports competitions) శనివారంతో ముగిసాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని జూనియర్ కాలేజీ క్రీడామైదానం భద్రాచలం డివిజన్ స్థాయి క్రీడా పోటీలకు వేదికగా నిలిచింది. భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా ఉన్న గిరిజన పాఠశాలలకు చెందిన బాల, బాలికల వారిలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ డివిజన్ స్థాయి క్రీడా పోటీలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

  Mulugu: మారుమూల ఏజెన్సీ నుంచి అంతర్జాతీయ స్థాయి కోచ్​.. ఈయన ఘనతలకు ఔరా అనాల్సిందే..

  భద్రాచలం డివిజన్లోని చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, కరకగూడెం, పినపాక, మణుగూరు, అశ్వాపురం మండలాలకు చెందిన బాల, బాలికలు ఈ క్రీడా పోటీల్లో పాల్గొని వారి నైపుణ్యాలను ప్రదర్శించారు. అండర్ 14, 17 విభాగాలకు జరిగిన ఈ పోటీలలో వివిధ పాఠశాలల నుంచి మొత్తం 760 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో 380 మంది బాలురు, 380 మంది బాలికలు ఉన్నారు. కోకో, కబడ్డీ, వాలీబాల్, చెస్, అథ్లెటిక్స్ విభాగాలలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో మొత్తం 220 మంది విద్యార్థులు బహుమతులు గెలుచుకొని జిల్లా స్థాయిలో జరగబోయే క్రీడా పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నారు. 2019 అనంతరం జరిగిన ఈ క్రీడా పోటీల్లో గిరిజన బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. భద్రాచలం ఐటీడీఏ అధికారుల చొరవతో భద్రాచలం కేంద్రంగా ఈ క్రీడా పోటీలు నిర్వహించారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Bhadrachalam, Bhadrari kothagudem, Local News, School Games

  ఉత్తమ కథలు