హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri: భద్రాద్రి రామయ్య భక్తులకు కొండంత దైర్యం ఇచ్చిన కనకదుర్గమ్మ..!

Bhadradri: భద్రాద్రి రామయ్య భక్తులకు కొండంత దైర్యం ఇచ్చిన కనకదుర్గమ్మ..!

భద్రాద్రి

భద్రాద్రి భక్తులకు కొంగుబంగారంగా కనకదుర్గమ్మ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో కేశవాపురం - జగన్నాధపురం గ్రామాల మధ్యన జాతీయ రహదారి 221 పక్కనే ఉంటుంది శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం. భద్రాద్రి రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు అనేక మంది ఈ దుర్గమ్మనూ దర్శించుకుంటారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Bhadrachalam, India

  Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem) పాల్వంచ మండలంలో కేశవాపురం - జగన్నాధపురం గ్రామాల మధ్యన జాతీయ రహదారి 221 పక్కనే ఉంటుంది శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం. భద్రాద్రి రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు అనేక మంది ఈ దుర్గమ్మనూ దర్శించుకుంటారు. కానీ ఈ గుడి ప్రత్యేకత ఏంటో చాలామందికి తెలియదు. శ్రీ పెద్దమ్మ తల్లి గుడిగా విరాజిల్లుతున్న ఈ దేవస్థానం మొదటి నుంచి ఎన్నో అద్భుతాలకు నిలయం. సూమారు 8 దశాబ్దాల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పూర్తిగా దట్టమైన అడవి ఉండేది. నేటి పారిశ్రామిక ప్రాంతాలైన కొత్తగూడెం, ఇల్లందులు, పాల్వంచ తాలూకా పరిధిలో భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అప్పట్లో జిల్లాలో చెప్పుకోదగ్గ ప్రాంతాలు. రాష్ట్ర నలుమూలల నుంచి భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి దైవ దర్శనానికి వచ్చే భక్తులకు నిత్యం మూడు బస్సులు మాత్రమే అందుబాటులో ఉండేవి.

  ఈ నేపథ్యంలో ప్రజలు ఎక్కువమంది భద్రాద్రి రామయ్య దర్శించుకునేందుకు కాలినడకన, ఎడ్లబండ్ల ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని గుమ్మూరు కాలనీకి చేరుకుని అక్కడ నుంచి పడవల ద్వారా రామయ్య దర్శనానికి వెళ్లేవారు. ఈ నేపథ్యంలో పాల్వంచ మండలంలోని నాగారం కాలనీ వద్ద గల కిన్నెరసాని నది ఒడ్డున సైతం బస చేసేవారు. ఈ క్రమంలో పూర్వం ఈప్రాంతంలో పెద్ద పులుల సంచారం ఎక్కువగా ఉండేది.

  ఇది చదవండి: బస్ స్టాప్ ఉంది కానీ రోడ్డు.., 60 ఏళ్లుగా రోడ్డు లేక ఏజెన్సీ గ్రామస్థుల అవస్థలు

  కిన్నెరసాని నదిలో దాహం తీర్చుకొని ప్రస్తుతం దేవస్థానం నిర్మించబడి ఉన్న ప్రాంతంలో చింత చెట్ల కింద పులులు సేతుదీరుతూ ఉండేవని, ఇటుగా వచ్చిన వారు అనేకసార్లు ఈ పెద్ద పులులను చూసి భయబ్రాంతులకు గురయ్యారని స్థానికులు చెప్తున్నారు. ఈ క్రమంలో పెద్ద పులుల భయం నుంచి భక్తులకు రక్షణగా ఆ ప్రాంతంలో ఉన్న చింత చెట్ల తొర్రలో కనకదుర్గమ్మ ప్రతిమను ప్రతిష్టించగా పులుల భయం పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. అప్పటినుంచి ఈ మార్గం గుండా ప్రయాణించే భక్తులు చెట్టు నీడనున్న కనకదుర్గమ్మను పూజిస్తూ పెద్దమ్మగా పిలుస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

  ఇది చదవండి: రైతులను నిలువునా ముంచుతున్న కాలువ గండ్లు.., ప్రభుత్వ వైఫల్యమా? అధికారుల తప్పిదమా?

  ఈ ఆలయానికి కూతవీడు దూరంలో కిన్నెరసాని నది ఉండడం భద్రాద్రి రామయ్య దర్శనానికి విచ్చేసే భక్తులు ముందుగా అమ్మవారిని దర్శించుకుని ఈ నది ఒడ్డునే వంటావార్పు చేసుకుని కాసేపు సేద తీరి తమ ప్రయాణాన్ని సాగించడం కాలక్రమమైన అలవాటయింది. ఈ నేపథ్యంలో ఇదే ప్రాంతంలో సంచరించే కొమరయ్య అనే ఓ సాధువు అమ్మవారి ప్రతిమ ఉన్న ప్రాంతంలో పందిరి వేసి సమీప గ్రామాల్లోకి వెళ్లి నూనె తదితర పూజాది వస్తువులు తీసుకువచ్చి అమ్మవారికి దీపారాధన చేసేవాడు. ఆయనకు తెలిసిన సాంప్రదాయ పద్ధతుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించేవాడు. ఇలా కొనసాగుతున్న తరుణంలో కాలక్రమమైన ఈ దారి గుండా రవాణా సౌకర్యం మెరుగుపడడంతో ఈ ప్రాంతం మీదగా వెళ్లే లారీ డ్రైవర్లు, ఇతర ప్రయాణికులు సైతం పెద్దమ్మతల్లి ఆలయం వద్ద ఆగి అమ్మవారికి మొక్కుకోవడం అలవాటుగా మారింది.

  ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతుండడంతో భక్తుల మనోభీష్టానికి అనుగుణంగా 1972 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించారు. నాటి నుంచి నేటి వరకు అత్యంత ఘనంగా శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తుండగా 2004 సంవత్సరం తర్వాత ఈ ఉత్సవాల నిర్వహణ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇదిలా ఉండగా పెద్దమ్మ తల్లి చిత్రపటం ఏర్పాటుచేసిన చింత చెట్టు 1985లో నేల కూలింది. ఈ నేపథ్యంలో 1987లో ఆ ప్రాంతంలో ఆలయం నిర్మించారు. అనంతరం 2004లో ఈ ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్ళింది. ప్రస్తుతం రూ. 3 కోట్లకు పైగా వార్షిక ఆదాయంతో గడిచిన 53 ఏళ్లుగా అఖండ దీపారాధన జరుగుతుండడం విశేషం. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా ఇక్కడే పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు నిర్వహించుకోవడం పరిపాటిగా మారింది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Bhadradri kothagudem, Local News, Telangana

  ఉత్తమ కథలు