హోమ్ /వార్తలు /తెలంగాణ /

Godavari river: గోదావరికి పెరిగిపోతున్న వరద ఉధృతి.. శాంతించాలంటూ మంత్రి పూజలు

Godavari river: గోదావరికి పెరిగిపోతున్న వరద ఉధృతి.. శాంతించాలంటూ మంత్రి పూజలు

గోదావరి

గోదావరి

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రూపం దాల్చింది. దీంతో రాములవారి పాదాల చెంత 70 అడుగుల ఎత్తులో ప్రవహహిస్తున్నది. ఈ నేపథ్యంలో భద్రాచలంలో గోదావరి వరద తగ్గాలని మంత్రి గారు పూజలు చేశారు.

వందేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా గోదావరి (Godavari) జూలై నెలలోనే ఉగ్రరూపం దాల్చింది. సాధారణంగా సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలో వచ్చే వరదలు ఈసారి జూలైలోనే (July) రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సీజన్ మొదట్లోనే గోదావరి నదికి భారీఎత్తున వరదలు వస్తున్నాయి. ఇలా గోదారికి వరదలు రావడం 100ఏళ్ళ చరిత్రలో ఇదే మొదటి సారి అని అంటున్నారు ఇరిగేషన్ అధికారులు. ఐతే ఎగువ నుండి వచ్చే భారీ వరదలను తట్టుకోవడానికి అధికారులు ముందస్తుగానే సిద్దం అయ్యారు. మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల ధాటికి అన్ని నదులు పొంగిపొర్లుతున్నాయి. దీనికితోడు తెలంగాణలోని కడెంవాగు, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, తాలిపేరు, కిన్నెరసాని, పెద్దవాగు లాంటి స్థానిక ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నది పైన నిర్మించిన అన్ని ప్రాజెక్టుల నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరడంతో, దాదాపు పదిహేను లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదలుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి 53 అడుగుల ప్రమాద స్థాయికి చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

భద్రాచలంలో..

ఎగువ నుంచి భారీ వరద (Floods) వస్తుండటంతో భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి ఉగ్రూపం దాల్చింది. దీంతో రాములవారి పాదాల చెంత 70 అడుగుల ఎత్తులో ప్రవహహిస్తున్నది. ఈ నేపథ్యంలో భద్రాచలంలో గోదావరి వరద తగ్గాలని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ (Telangana Minister Puvvada Ajay Kumar) ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగ్రగోదావరి శాంతించాలని నది స్నానఘట్టాల వద్ద వేదపండితులు, అర్చకులు, ఆలయ అధికారులతో కలిసి గోదారమ్మకు హారతులు ఇచ్చారు.

పునరావాస కేంద్రానికి వెళ్ళాలని..

అంతకముందు భద్రాచలంలోని సారపాక BPL పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలోని వరద ముంపు బాధితులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలిసి ధైర్యం కల్పించారు. అనంతరం బూర్గంపహాడ్ లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఎర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. ఆనంతరం బూర్గంపహాడ్ గ్రామంలో క్రమంగా వరద నీరు చేరడంతో నిర్వాసితులకు తక్షణమే ఖాళీ చేయాలని మంత్రి కోరారు. పునరావాస కేంద్రానికి వెళ్ళాలని, అక్కడ అన్ని వసతులు కల్పించమని పేర్కొన్నారు. తెలిసీ ప్రమాదాన్ని కొనితెచ్చుకోవొద్దు అని కోరారు. మీకు ఎలాంటి ఇబ్బంది లేదని రెండు రోజులు ఓపిక గా ఉండాలని సూచించారు. మంచి ఆహారం, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యాలు ఉన్నాయని వివరించారు. అక్కడే ఎర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కలెక్టర్​ పర్యవేక్షణ..

భద్రాచలంలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలుకు మేడిగడ్డ, సమ్మక్క సాగర్ వరద నీటి ఉధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో వచ్చే రెండు రోజుల్లో గోదావరి డిశ్చార్జి 21 లీ క్యూసెక్కులు, 64 అడుగులు దాటే అవకాశం ఉందని కలెక్టర్ అన్నారు. ప్రజలను ఫ్లడ్ క్యాంప్ లో చేర్చాలని ఆదేశించారు. గోదావరి మట్టం కోసం సిద్ధం కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, పినపాక, మణుగూరు, బూర్గంపాడు, భద్రాచలంలోని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను  తరలించి, సహాయ శిబిరాలన్నీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. దుమ్ముగూడెంలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని సిద్ధంగా ఉంచాలి, దేశీ పడవలను, ఈతగాళ్లను, బృందాలను వెంటనే అప్రమత్తం చేయాలని కలెక్టర్ అన్నారు.

First published:

Tags: Bhadrachalam, Godavari river, Puvvada Ajay Kumar

ఉత్తమ కథలు