హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri: రామయ్యకు పట్టాభిషేకం చూడటతరమా.. భక్తులకు కనులవిందాయే..!

Bhadradri: రామయ్యకు పట్టాభిషేకం చూడటతరమా.. భక్తులకు కనులవిందాయే..!

భద్రాద్రిలో

భద్రాద్రిలో ముసిగిన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

దక్షిణ అయోధ్య విరాజిల్లుతున్న భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం (Bhadrachalam Temple) లో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా ముగిశాయి. ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వివిధ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Bhadrachalam, India

  Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

  దక్షిణ అయోధ్య విరాజిల్లుతున్న భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం (Bhadrachalam Temple) లో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా ముగిశాయి. ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వివిధ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజున దసరా పర్వదినం నాడు అమ్మవారు నిజరూప మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు ఆదిలక్ష్మి, సంతాన లక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, వీరలక్ష్మి, నిజరూప లక్ష్మి అలంకరణలలో భక్తులకు దర్శనభాగ్యాన్ని కల్పించారు. ఇదిలా ఉండగా శరన్నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజున విజయదశమి వేడుకలను దేవస్థానం అధికారులు అత్యంత ఘనంగా నిర్వహించారు.

  విజయదశమి వేడుకల్లో భాగంగా భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామ మహా పట్టాభిషేకం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయంత్రం పట్టణంలోని దసరా మండపం వద్ద ఆయుధ పూజ, శమీ పూజ, శ్రీరామ లీల ఒంటి కార్యక్రమాలను అధికారులు, దేవస్థాన అర్చక బృందం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటిగా భద్రాచలం దేవస్థానం నుంచి స్వామివారి ఉత్సవ మూర్తులను, స్వామివారి ఆయుధాలను ఊరేగింపుగా మేళ తాళాలు మంగళ వాయిద్యాలు నడుమ వేదమంత్రోచ్ఛరణలతో భద్రాద్రి పట్టణంలోని దసరా మండపానికి తీసుకువచ్చి దసరా మండపంలో స్వామివారిని ఆసీనులు చేసి శమీ వృక్షం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

  ఇది చదవండి: భద్రాద్రి రామయ్య భక్తులకు కొండంత దైర్యం ఇచ్చిన కనకదుర్గమ్మ..!

  దేవస్థాన అర్చక స్వామి ఒక్కో దిక్కుకు ఒక్కొక్క బాణాన్ని వదలను ద్వారా సకల దుష్టశక్తులు నశించడమే కాకుండా దేశం సుఖసంతోషాలతో భోగభాగ్యాలతో విరాజిల్లుతుందని తెలియజేశారు. రావణ దహన కార్యక్రమం కూడా వైభవంగా నిర్వహించారు. అనంతరం పది తలల రాక్షసుడు రావణాసురుడుపై ఆలయ ఈఓ శివాజీ బాణాన్ని సంధించి రావణుణ్ణి వధించి శ్రీరామలీల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టపాసులు కాలుస్తూ ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం భక్తులు ఆసక్తిగా తిలకించారు.

  అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు భక్తులకు అందచేశారు. అనంతరం స్వామి వారికి తిరువీధి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రాచలం ఏఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అంతేకాక రావణ దహన కార్యక్రమం నేపథ్యంలో అగ్నిమాపక శాఖ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టారు.

  First published:

  Tags: Bhadrachalam, Local News, Telangana

  ఉత్తమ కథలు