హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: అయ్యయ్యో రైతన్నకు ఎంత కష్టం.. దినసరి కూలీలుగా మారున్న అన్నదాతలు

Telangana: అయ్యయ్యో రైతన్నకు ఎంత కష్టం.. దినసరి కూలీలుగా మారున్న అన్నదాతలు

భద్రాచలంలో

భద్రాచలంలో కూలీలుగా మారుతున్న రైతులు

TS News: వారంతా రైతులు. ఉన్న కొద్ది పాటి వ్యవసాయ భూమిలోనే పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయం తప్ప మరో పని తెలియని ఆ రైతులు నేడు కూలీలుగా మారారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Bhadrachalam, India

  Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudemవారంతా రైతులు. ఉన్న కొద్ది పాటి వ్యవసాయ భూమిలోనే పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయం తప్ప మరో పని తెలియని ఆ రైతులు నేడు...కూలీలుగా మారారు. నాగలి చేతబట్టిన చేతులతో పలుగు-పారా చేతబట్టి కూలీ పని చేస్తున్నారు. వారికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి పరివాహక ప్రాంతంలోని గ్రామాల్లో ఇటీవల వచ్చిన గోదావరి వరదలు గిరిజన ప్రాంత ప్రజల ఉపాధిని దెబ్బతీశాయి. సుమారు 40 రోజుల పాటు వరద ప్రభావం ఉండడంతో వ్యవసాయ సీజన్ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో వ్యవసాయ పనుల్లేక కూలీలు వలసబాట పట్టారు. సన్న, చిన్నకారు రైతులైతే భద్రాచలంలో భవన నిర్మాణ పనుల్లో కూలీలుగా పనిచేస్తున్నారు.
  ఎకరం, రెండెకరాల పొలం ఉన్న రైతులు కూలీ పనులు చేస్తున్నారు. రైతులు వేసిన పత్తి, వరి పంటలు పూర్తిగా వరద నీటిలో మునగడంతో తిరిగి వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేక, పెట్టుబడులు పెట్టలేక, కుటుంబాలు గడవడం కోసం కూలీలుగా మారుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని పలు మండలాల్లో ఈ పరిస్థితి ఇలానే ఉంది.

  ఇది చదవండి: ప్రయోగాల ద్వారా పాఠాలు.. ఇటువంటి మాస్టారు ఉంటే ప్రతి విద్యార్థి భవిష్యత్తు బంగారమే


  పని దొరికితేనే పూట గడిచేది
  పత్తి, వరి సాగు చేసే సీజన్లో పొలాల్లోకి వచ్చిన వరదతో రైతులు, రైతు కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులంతా అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టారు. అంతా సవ్యంగా సాగితే నెల రోజుల్లో పత్తి చేతికొచ్చేది. ఇంతలోనే గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా ముంపు మరింత పెరిగి రోజుల తరబడి పొలాలు నీళ్లలోనే ఉండిపోయాయి. వరద తెచ్చిన బురద కారణంగా ఇప్పట్లో పంటలు వేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో భద్రాద్రి, గోదావరి పరిసర ప్రాంతాల్లో రైతులు క్రాప్ హాలిడే (Crop Holiday) ప్రకటించారు. ఇక కుటుంబ పోషణ కోసం ఉన్న ఊళ్లోనే ఉపాధి పనులు చేసుకుందామనుకుంటే పనులు దొరకని పరిస్థితి నెలకొంది.


  ఇది చదవండి: మీ పిల్లలను ఈ పార్కుకి తీసుకెళ్లారంటే కేరింతలే కేరింతలు: ఆహ్లాదం పంచుతున్న డీర్ పార్క్


  ఈ నేపథ్యంలో రైతులు, వ్యవసాయ కూలీలు పనుల కోసం భద్రాచలం పట్టణానికి వెళ్తున్నారు. ప్రతిరోజు ఉదయం అన్నం చేత పట్టుకుని సూపర్ బజార్ సెంటర్లో అడ్డాపైకి వస్తున్నారు. పనులు ఇచ్చే వారి కోసం ఎదురుచూస్తున్నారు. ఏ పని చేయడానికైనా సిద్ధమని బ్రతిమిలాడుకుంటున్నారు. ముఖ్యంగా భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక తదితర గోదావరి పరివాహక మండలాల్లోని వేల మంది రైతులు, రైతు కూలీలు ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. విలీన ఆంధ్రాలోని ముంపు మండలాల నుంచి కూడా భారీ సంఖ్యలో అడ్డాపై కూలీ కోసం వస్తున్నారు. పనులు దొరక్క పూట గడిచేది ఎలాగో తెలియక బిక్కుబిక్కుమంటూ తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Bhadradri kothagudem, Farmers, Local News, Telangana

  ఉత్తమ కథలు