హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri: కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్ము చెదల పాలు.., వృద్ధ దంపతులకు తీరని కష్టం

Bhadradri: కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్ము చెదల పాలు.., వృద్ధ దంపతులకు తీరని కష్టం

భద్రాద్రిలో

భద్రాద్రిలో డబ్బును తినేసిన చెదలు

కూలి పనులకు వెళ్లి ఎంతో కష్టపడి...వచ్చిన దాంతో సంతోషంగా జీవిస్తున్నారు. ఇంటి అవసరాలకు పోగా భవిష్యత్తుకు భరోసాగా ఉండేందుకు కొంత సోము దాచుకుంటూ ఉన్నదాంట్లో సంతోషంగా జీవిస్తున్న వారింట్లో చెదపుట్టలు వారి భవిష్యత్తును అంధకారం చేశాయి

 • News18 Telugu
 • Last Updated :
 • Bhadrachalam, India

  Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

  ఆ దంపతులది ఓ సామాన్య పేద కుటుంబం. సంతానం లేకపోవడంతో ఇద్దరే ఒకరికి ఒకరు తోడుగా అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. కూలి పనులకు వెళ్లి ఎంతో కష్టపడి.. వచ్చిన దాంతో సంతోషంగా జీవిస్తున్నారు. ఇంటి అవసరాలకు పోగా భవిష్యత్తుకు భరోసాగా ఉండేందుకు కొంత సోము దాచుకుంటూ ఉన్నదాంట్లో సంతోషంగా జీవిస్తున్న వారింట్లో చెదపుట్టలు వారి భవిష్యత్తును అంధకారం చేశాయి. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothaudem District) ఇల్లందు మండలం సంజయ్ నగర్ గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మయ్య, లక్ష్మి అనే వృద్ధ దంపతులు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి సంతానం లేకపోవడంతో ఇద్దరే ఒకరికొకరు తోడునీడగా నిలుస్తూ అన్యోన్యంగా జీవిస్తున్నారు.

  కూలి పనులకు వెళ్లి ఎంతో కష్టపడి వచ్చిన సొమ్మును పైసా పైసా కూడబెడుతూ భవిష్యత్తులో ఏదైనా కష్టం వస్తే భరోసాగా ఉండేందుకు డబ్బులు దాస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ డబ్బులు దాచే సూట్ కేస్ చెక్క సెల్ఫ్‌లో పెట్టడమే వాళ్ళు చేసే పెద్ద తప్పయింది. లక్ష్మయ్య, లక్ష్మి నివసిస్తున్న ఇల్లు పాత రేకుల ఇల్లు కాగా, గత కొంతకాలంగా కురిసిన భారీ వర్షాలకు తోడు ఇంటి దూలాలకు చెదలు పట్టాయి. డబ్బు దాచిన సూట్ కేస్ పైకి చెదలు చేరింది.

  ఇది చదవండి: రైతు బజార్లో కూరగాయలు అమ్ముతున్న విద్యార్థులు.., ఎందుకో తెలుసా..?

  అయితే చెదలు చేరిన విషయాన్నీ వారు గమనించలేదు. ఇటీవలే పలు అవసరాల కోసం డబ్బులు దాచిన సూట్ కేసును తెరిచి చూడగా ఆ వృద్ధ దంపతులకు గుండె ఆగినంత పనైంది. వారు దాచుకున్న లక్షన్నర రూపాయలు డబ్బంతా చెదల పాలవడంతో ఆ దంపతులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

  ఇది చదవండి: రైతుల భలే తెలివి.., పంటచేలోకి అడవి పందులు, పక్షులు రాకుండా ఏం చేశారో చూడండి

  అయితే ఇలా పాడైయిపోయిన నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చంటూ ఇరుగుపొరుగు వారు చెప్పిన సలహాతో చెదలు పట్టిన నోట్లను పట్టుకొని మండల వ్యాప్తంగా ఉన్న బ్యాంకుల చుట్టూ తిరిగాడు లక్ష్మయ్య. డబ్బు మార్పిడి వీలు కాదని, ఇంత మొత్తంలో మార్పిడి సాధ్యపడదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో పాటు హైదరాబాద్ వెళ్లాలని సూచించారు.

  దాచుకున్న డబ్బులన్నీ చెదలపాలవడంతో ఆఖరికి హైదరాబాద్ వెళ్లడానికి కూడా చార్జీలు లేవని దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైసా పైసా కూడబెట్టిన డబ్బు వృద్ధాప్యంలో పనికొస్తాయని తమకు భరోసాగా ఉంటాయని అనుకుంటే ఇలా చెదలుపెట్టడంపై లక్ష్మయ్య బోరున విలపిస్తున్నాడు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తమను ఆదుకోవాలని ఈ వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Bhadradri kothagudem, Local News, Telangana

  ఉత్తమ కథలు