తెలంగాణ (Telangana) రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ (Puvvada Ajay)కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు నోటీసు జారీ చేసింది. మమత మెడికల్ కాలేజీ ఛైర్మన్ హోదాలో పువ్వాడ అజయ్‌కి కోర్టు ఈ నోటీసులు ఇచ్చింది. ఖమ్మం (Khammam)లో పువ్వాడ అజయ్‌కి మెడికల్ కాలేజీ ఉంది. ఐతే ఆ కాలేజీలో చదివే విద్యార్థుల నుంచి అధిక వసూలు చేసినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. పీజీ వైద్య కోర్సులకు 2016 జీవో ప్రకారం పాత ఫీజు తీసుకోవాలని వైద్య కళాశాలలకు గతేడాది హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కానీ మమత మెడికల్ కాలేజీ యాజమాన్యం మాత్రం.. పీజీ వైద్య కోర్సులకు 2017జీవో ప్రకారం పెంచిన ఫీజులు వసూలు చేసింది. యాజమాన్యానికి వ్యతిరేకంగా కొందరు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై విచారించిన తెలంగాణ హైకోర్టు.. కాలేజీ వసూలు చేసిన అధిక ఫీజు విద్యార్థులకు వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.
కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినప్పటికీ.. విద్యార్థులకు డబ్బులను చెల్లించలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమకు రావాల్సిన ఫీజు తిరిగి ఇవ్వడం లేదని మమత మెడికల్ కాలేజీపై కోర్టు ధిక్కరణ కింద మరో పిటిషన్ దాఖలైంది. దీనిపై వివరణ ఇవ్వాలని పువ్వాడ అజయ్‌కి నోటీసులు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. తదుపరి విచారణను ఏప్రిల్ 17కి వాయిదా వేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Khammam, Local News, Telangana