Telangana:గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు మరోసారి అవమానం ఎదురైంది. భద్రాచలం టూర్‌కి వెళ్లిన సమయంలో జిల్లా ఉన్నతాధికారులు ప్రోటోకాల్ పాటించకుండా అందరూ లీవ్‌లు పెట్టడంపై చర్చనడుస్తోంది. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం గవర్నర్‌ని ఇలా అవమానిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
(G.Srinivasreddy,News18,Khammam)
తెలంగాణ(Telangana)రాష్ట్ర గవర్నర్ (Governor)తమిళసై సౌందరరాజన్(Tamilisai soundararajan)కు మరోసారి అవమానం జరిగింది. ఈసారి భద్రాద్రి సీతారాముల సాక్షిగా..శ్రీరామపట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన సమయలో మేడమ్ పట్ల అధికారులు ప్రోటోకాల్ protocolపాటించలేదు. సాక్షాత్తు రాష్ట్ర ప్రథమ పౌరురాలి హోదాలో భద్రాచలం పర్యటనకు వెళ్తే స్వాగతం పలికి సెక్యురిటీ ఇతర ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిన జిల్లా కలెక్టర్(Collector), ఎస్పీS(SP),ఇద్దరూ డుమ్మా కొట్టారు. ఉన్నతాధికారులు హాజరవ్వాల్సిన గవర్నర్ ప్రోగ్రామ్(Program)కి తమ కింది స్థాయి ఉద్యోగులను పంపి చేతులు దులుపుకున్నారు. రాష్ట్ర ప్రథమపౌరురాలి హోదాలో ఆమె హెలికాప్టర్లో రావాల్సి ఉండగా..భద్రాద్రి జిల్లా పర్యటనకు ట్రైన్ (Train)లో వచ్చారు. ఆదివారం సికింద్రాబాద్(Secunderabad)లో గవర్నర్ దంపతులు కొత్తగూడెం (Kottagudem)లోని భద్రాచలం రోడ్డు స్టేషన్లో దిగారు. భద్రాచలంలో అడుగుపెట్టింది మొదలు మేడమ్ గవర్నర్‌కి అవమానాలు ఒకదాని తర్వాత మరొకటి ఎదురవుతూనే ఉన్నాయి. గవర్నర్‌ని రిసీవ్ చేసుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి(Anudeep Durishetti), ఎస్పీ సునీల్‌దత్(Sunil Dutt),ఐటీడీఏ పీవో గౌతమ్ (Gautam)రావాల్సి ఉండగా ఒక్కరూ కూడా రాకపోవడం చూస్తుంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ మొండివైఖరిలో భాగమేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు భద్రాద్రి రామాలయలంలోని పలు శాఖల హెచ్ఓడీలు కూడా గవర్నర్ పర్యటనకు హాజరు కాకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
గవర్నర్ టూర్లో నో ప్రోటోకాల్..
భద్రాచలంలో రాములవారి పట్టాభిషేక మహోత్సవంతో పాటు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో గవర్నర్ రెండ్రోజుల పాటు పర్యటిస్తారు. సోమ, మంగళ వారాల్లో ఆమె పలు సామాజిక కార్యక్రమాలతో పాటు పూసుకుంట ఆదివాసీ గ్రామంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జిల్లా ఉన్నతాధికారులను గవర్నర్‌కు ప్రొటోకాల్ ఇవ్వకుండా వారిని సెలవుపై పంపించినట్లు సమాచారం అందుతోంది. తనకు తెలంగాణ సర్కార్ ప్రొటోకాల్ పాటించడం లేదంటూ మేడమ్ ఢిల్లీ పెద్దలు, జాతీయ మీడియా ఎదుట తన ఆవేదన వెళ్లగక్కిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ని అడుగడుగునా ఇలా అవమానపరచడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఇంతలా అవమానిస్తారా ..
కొన్నేళ్లుగా శ్రీరామ పట్టాభిషేకానికి గవర్నర్ ముఖ్య అతిధిగా హాజరుకావడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో గవర్నర్ టూర్ నేపధ్యంలో ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేస్తూ వస్తోంది. కాని ఈసారి అలా జరగకపోవడంతో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు భద్రాద్రిలోనే కాదు ఇటీవలే గవర్నర్ యాదాద్రి వెళ్లినప్పుడు కూడా ఆలయ ఈవో గీతారెడ్డి గవర్నర్‌కి గౌరవ స్వాగతం పలికేందుకు హాజరుకాలేదనే విషయం అందరికి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వంతో కేంద్రానికి విభేదాలు కొనసాగుతున్న వేళ ఆ అసంతృప్తిని రాష్ట్ర గవర్నర్‌పై చూపించడం ఎంత వరకు సమంజసం అని రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. తాను తెలంగాణలో రైలు, రోడ్డు మార్గం ద్వారానే ప్రయాణించగలనని అందరూ అర్థం చేసుకోవాలని తమిళిసై చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ప్రభుత్వ వైఖరిని అంతే ధీటుగా కొట్టిపారేస్తున్నట్లు అర్ధం చేసుకోవచ్చు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.