Home /News /telangana /

BHADRADRI KOTHAGUDEM TELANGANA GOVERNMENT ISSUES NOTIFICATION FOR GUEST FACULTY IN EKALAVYA MODEL RESIDENTIAL SCHOOLS IN MEHABOOBABAD DISTRICT FULL DETAILS HERE PRN MMV BRV

TS Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.., ఈ జిల్లాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

తెలంగాణలో ఇటీవల వరుస ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. ప్రభుత్వం భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తుండటంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత ఉద్యోగాలతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగాలను కూడా ప్రభుత్వం భర్తీ చేస్తోంది. ఈ క్రమంలో నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India
    M.Venu, News 18, Mulugu

    తెలంగాణలో ఇటీవల వరుస ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. ప్రభుత్వం భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తుండటంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత ఉద్యోగాలతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగాలను కూడా ప్రభుత్వం భర్తీ చేస్తోంది. ఈ క్రమంలో నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ (Telangana) వ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్సీ (Ekalavya Model Residential School) విద్యాలయాల్లో భారీగా గెస్ట్ ఫ్యాకల్టీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అతిధి అధ్యాపకుల కోసంనోటిఫికేషన్ రావడంసాధారణమే అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఏకలవ్య మోడల్ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా ఉద్యోగం దొరకడం కూడా ఒక అదృష్టమే. కానీ ఒకేసారి 50 అతిధి అధ్యాపకుల ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు భూపాలపల్లి మహబూబాబాద్ రీజినల్ కోఆర్డినేటర్ ఏవీ రాజ్యలక్ష్మి వివరించారు.

    మహబూబాబాద్ జిల్లా (Mhaboobabad District) లోని తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్సి పాఠశాల మరియు కళాశాలలో ( బాల బాలికల) గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాల కోసం ప్రకటన వెలువడింది. సబ్జెక్టుల వారీగా వివరాలను అధికారులు ప్రకటించారు.

    ఇది చదవండి: కటాక్షపూర్ చెరువు కష్టాలు...ఇప్పటికైనా కటాక్షపురం చెరువుకు కటాక్షం దొరికేనా


    ఖాళీల వివరాలు: టీజీటీ తెలుగు - 06, టీజీటీ హిందీ - 05, టీజీటీ ఇంగ్లీష్ - 07, టీజీటీ మ్యాథమెటిక్స్ - 05, టీజీటీ ఫిజికల్ సైన్స్ -04, కామర్స్ 1, ఎకనామిక్స్ 1, పిజిటి ఐటి - 05, మ్యూజిక్ టీచర్ 02, ఆర్ట్ టీచర్ 02, పిఈటి 02, స్టూడెంట్స్ కౌన్సిలర్ 05,హాస్టల్ వార్డెన్ 05 ఖాళీలు ఉన్నాయి.

    ఇది చదవండి: ఐడియా అదిరింది గురు: బుల్లెట్ బండిపై బార్బెక్యూ సెటప్ 


    అర్హతలు: సంబంధిత సబ్జెక్టులలో 50 శాతం ఉత్తీర్ణత, బీఈడీ మరియు సిటెట్ పేపర్ టు / స్టేట్ సెట్ ఉత్తీర్ణత అయి ఉండాలి. పిజిటి ఐటీ పోస్ట్‌కి కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత అయి ఉండాలి. స్టూడెంట్ కౌన్సిలర్ పోస్ట్‌కి సైకాలజీలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. హాస్టల్ వార్డెన్ పోస్ట్‌కి గ్రాడ్యుయేషన్‌తో పాటు ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి. ఈ అర్హతలు ఉన్న ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యా అర్హతలకు సంబంధించి జిరాక్స్ పత్రాలు మరియు దరఖాస్తును రీజనల్ కోఆర్డినేటర్ ఆఫీస్, మహబూబాబాద్, పేరుపైన సమర్పించాలి.

    చివరి తేదీ: అభ్యర్థులు ఈ దరఖాస్తులను 11/08/2022 నుంచి 22/08/2022 వరకు సమర్పించాలి.

    ఈ ఉద్యోగాల భర్తీలో రిటైర్డ్ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసి రిటైర్ అయిన వారు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: JOBS, Local News, Telangana

    తదుపరి వార్తలు