Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
అటవీ సంరక్షణలో బీట్ ఆఫీసర్లదే కీలకపాత్ర. క్షేత్రస్థాయిలో వన్యప్రాణుల సంరక్షణ నుంచి మొదలు కలప, అటవీ ఉత్పత్తుల అక్రమ రవాణా వరకు అటవీ సంపదను కంటికి రెప్పలా కాపాడుతుండడంలో బీట్ ఆఫీసర్లే ప్రముఖ పాత్ర పోషిస్తారు. ఈ నేపథ్యంలో శిక్షణలో తెలుసుకున్న సాంకేతికత వైజ్ఞానిక అంశాలను ప్రత్యక్షంగా చూసి అవగాహన చేసుకునేందుకు మరింత సమర్థవంతంగా విధులను నిర్వహించేందుకు శిక్షణ పొందుతున్న కాబోయే బీట్ ఆఫీసర్లు ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana), ఛత్తీస్ గఢ్ (Chattisgarh) సరిహద్దు ప్రాంతాల్లోని అడవుల్లో పర్యటించారు. హైదరాబాద్ కేంద్రంగా శిక్షణ తీసుకుంటున్న సుమారు 40 మంది బీట్ ఆఫీసర్ల బృందం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) భద్రాచలం (Bhadrachalam) ఏజెన్సీ ప్రాంతంలో స్టడీ టూర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా న్యూస్ 18 సదరు అధికారులను పలకరించగా పలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నట్లు వారు తెలిపారు. అడవుల రక్షణ బాధ్యత బీట్ అధికారులపైనే ఎక్కువగా ఉంటుంది. అడవుల పెంపుదల, రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో అడవుల పెంపకం కోసం హరితహారం పథకాన్ని చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. హరితహారం విజయవంతం చేసే బాధ్యత కూడా అటవి శాఖపైనే ఉంటుంది. అటవీరక్షణ, అడవుల పెంపుదల, స్మగ్లింగ్ నిరోధించడం, వేట నియంత్రణ తదితర 15 అంశాలలో శిక్షణ నూతన ఫారెస్ట్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇస్తారు. అంతేకాకుండా వెపన్ ట్రైనింగ్, అటవీ భూములను సర్వే చేయడంలాంటి ప్రత్యేక శిక్షణ కూడా ఆరునెలల కాలంలో పూర్తి చేస్తారు.
సువిశాల అటవీ విస్తీర్ణ ప్రాంతం కలిగి అటు ఆంధ్ర ఇటు చతిస్గఢ్ తో సరిహద్దు ప్రాంతాన్ని పంచుకుంటున్న తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలోని అడవులు సంరక్షణ తదితర విషయాలపై అధ్యయనం చేసేందుకు హైదరాబాదుకు చెందిన నూతన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు భద్రాచలం అడవుల్లో పర్యటించారు.
ఈ సందర్భంగాఅటవీ ప్రాంతంలోని జంతువుల ఆవాస ప్రాంతాలు, గడ్డిక్షేత్రాలు, సాసర్‌పిట్లు తదితర వాటిని పరిశీలించిన అనంతరం ఉన్నతాధికారులు శిక్షణ తీసుకుంటున్న వారికి అవగాహన కల్పించారు. అడవుల సంరక్షణలో తీసుకోవాల్సిన చర్యలను సైతం క్షేత్రస్థాయిలో వివరించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన చేపట్టబోయే వివిధరకాల పనులను ప్రభుత్వం అడవుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను క్షుణ్ణంగా వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana