హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : భద్రాద్రిని భయపెడుతున్న గోదావరి .. 80 అడుగులు చేరినా ఎదుర్కొనేందుకు రంగం సిద్ధం

Telangana : భద్రాద్రిని భయపెడుతున్న గోదావరి .. 80 అడుగులు చేరినా ఎదుర్కొనేందుకు రంగం సిద్ధం

GODAVARI

GODAVARI

Telangana: గోదావరి నది వరద ప్రవాహం ప్రజలతో పాటు అధికారులకు దడ పుట్టిస్తోంది. ఏ క్షణాన వరద రూపంలో ఉప్పెనలా భద్రాచలంపై విరుచుకుపడుతుందోనన్న హెచ్చరికలతో ప్రభుత్వం అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలతో పాటు ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్‌ని అందుబాటులో ఉంచుతోంది.

ఇంకా చదవండి ...

భద్రాచలంBhadrachalam దగ్గర గోదారమ్మ మహోగ్రరూపం దాల్చుతోంది. గంట గంటకు వరద ప్రవాహం పెరగడంతో పాటు నీటి మట్టం ప్రమాదకరస్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే భద్రాచలానికి రాకపోకలు నిలిపివేయడం, టెంపుల్‌ టౌన్‌లో 144సెక్షన్ (144Section)విధించారు అధికారులు. అయితే గోదావరి నీటమట్టం సుమారు 80అడుగులకు చేరుకున్నప్పటికి సిస్ట్యూవేషన్‌ని కంట్రోల్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్‌(KCR) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌(Someshkumar)ను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్‌ భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా కలెక్టర్‌ మంత్రి, పువ్వాడ అజయ్‌(Puvvada Ajay)తో పాటు ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో చేపడుతున్న సహాయక, పునరావాస చర్యల గురించి ఆరా తీశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.

Telangana : గూగుల్ మ్యాప్ చూస్తూ గప్పాలు కొట్టుడు కాదు కేసీఆర్ వరద బాధితులను ఆదుకో: YS షర్మిలగుండెల్లో గుబులు పుట్టిస్తున్న గోదారి..

వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకొని భద్రాచలానికి ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ, సింగరేణి, రెస్క్యూ టీమ్‌లను తరలించారు. ప్రభుత్వం ఎమర్జెన్సీ సేవల కోసం కేటాయించిన సహాయక బృందాలను భద్రాచలం, కొత్తగూడెం పట్టణాల్లో ఉంచితే సహాయక చర్యలను సమర్ధవంతంగా, సకాలంలో చేపట్టే అవకాశమున్నట్లుగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సీఎం దృష్టికి తీసుకెళ్లారు.దుమ్ముగూడెం వద్ద వరద ప్రవాహం తీవ్ర స్ధాయిలో ఉన్నప్పటికీ, ఏక్కడ ఎలాంటి ఇబ్బంది కలగలేదని, జిల్లా యంత్రాంగం అప్రమత్తం ఉందని, ఇప్పటికే 11 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, వారందరికీ ఆహారం, త్రాగునీరు, ఇతర వసతులు కల్పించామని తెలియజేశారు. భద్రాచలం వద్ద ప్రవాహం 70 అడుగుల మార్క్‌ను చేరినప్పటికి, ప్రస్తుతం ఎగువ నుంచి గోదావరికి 23.70లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నదన్నారు.అయితే గోదావరి నదిలో వరద నీరు 80అడుగులకు చేరినప్పటికి పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సీఎస్‌ సోమేష్‌కుమార్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు.


(Bhadrachalam Godavari)ప్రమాదకరస్ధాయికి నీటిమట్టం..

శుక్రవారం సాయంత్రం భద్రాచలం దగ్గర గోదావరి నది నీటి మట్టం 71అడుగులకు చేరుకుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. గోదావరి నదిలో వరద ప్రమాదకరస్థాయిలోకి చేరడంతో అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వరదలు, గోదావరి నీటి ఎంత పెరిగినప్పటికి ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తనష్టం జరగకుండా చూసేందుకు జిల్లా కలెక్టర్ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీటితో పాటే వరద బాధితుల కోసం ఏర్పాటు చేసే పునరావాస కేంద్రాల్లో కూడా మౌలిక వసతులు, ఆహారం, తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. శుక్రవారం రాత్రిలోగా భద్రాచలానికి ఒక ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ ఐటీసీ భద్రాచలం వద్ద ఉంటుందని సీఎస్‌ టెలీకాన్ఫరెన్స్‌లో తెలిపారు.

Telangana : తెలంగాణను వదలని వరుణుడు .. రాష్ట్రంలో మరో మూడ్రోజుల పాటు దబిడి దిబిడేరంగంలోకి దిగిన సహాయక బృందాలు..

వరద సహాయక చర్యలలో జిల్లా యంత్రాంగానికి తోడ్పాటుగా మరో నలుగురు సీనియర్ ఆర్డీవోలను నియమించారు. ఇవాళ రాత్రికి 4ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు బోట్లు, బస్సులు, ట్రక్కులు కూడా భద్రాచలానికి తరలిస్తున్నారు అధికారులు. వరద సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు, పర్యవేక్షించేందుకు పోలీసు ఉన్నతాధికారులకు కూడా బాధ్యతలు అప్పగించారు డీజీపీ మహేందర్‌రెడ్డి. భద్రాచలంలోనే కాదు ములుగు జిల్లాలోని రామన్నగూడెంలో కూడా వరద ఉధృతి స్థిరంగా ఉన్నప్పటికి ..అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

First published:

Tags: Bhadrachalam, CM KCR, Godavari river, Telangana

ఉత్తమ కథలు