హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri Kothagudem: దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి.. బిఆర్ఎస్ అధిష్టానానికి పొంగులేటి సవాల్

Bhadradri Kothagudem: దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి.. బిఆర్ఎస్ అధిష్టానానికి పొంగులేటి సవాల్

X
ponguleti

ponguleti

రాజకీయాలలో ఏనిమిషం ఏమిజరుగుతుందో ఎవరికి తెలియదని, రానున్న రోజుల్లో ఈ వేధింపులకు పాల్పడే అధికారులు ప్రజాప్రతినిధులపై చక్ర వడ్డీతో సహా బదులు తీర్చుకుంటానని పొంగులేటి ఘాటుగా స్పందించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Khammam, India

రిపోర్టర్ : క్రాంతి

లొకేషన్ : ఖమ్మం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత కొద్దిరోజులుగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బిఆర్ఎస్ పార్టీ వర్సెస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిగా సాగుతున్న పంచాయతీలో రోజుకి ఊహించిన ట్విస్ట్ వెలబడుతుంది. తాజాగా దమ్ముంటే తనను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని బిఆర్ఎస్ అధిష్టానానికి ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. ఈ ప్రకటన ఒక్కసారిగా జిల్లాలో రాజకీయ వేడిని అమాంతం పెంచేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలోనినెమలిపేటలో జరిగిన పొంగులేటి అభిమానుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పొంగులేటి మాట్లాడుతూ.. టిఆర్ఎస్ అధిష్టానం కిందిస్థాయి నేతలను తన పక్కనే తిరిగేవాళ్లను కాకుండా నేరుగా దమ్ముంటే తననే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సవాల్ విసిరారు.

అధికారం ఎవడబ్బ సొత్తు కాదని.. అధికారాన్ని చూసి కొంతమంది నేతలు విరవిగుతున్నారని ఇది సరికాదని ప్రజాస్వామ్యంలో ప్రజలే అధిష్టానమని అన్నారు. పార్టీలో చేరిక సమయంలో తనకు ఎన్నో హామీలు ఇచ్చిన నేతలు తదనంతరం తనను పూర్తిగా విస్మరించారని తన సేవలను మాత్రం రాష్ట్రస్థాయిలో వినియోగించుకున్నారని ధ్వజమెత్తారు. తన అభిమానులను, మద్దతిస్తున్నవారిని కొంతమంది అధికారులు ప్రజాప్రతినిధులు వేధింపులకు గురి చేస్తున్నారని సమాచారం తన వద్ద ఉందని, ఇది సరికాదని అన్నారు. రాజకీయాలలో ఏనిమిషం ఏమిజరుగుతుందో ఎవరికి తెలియదని, రానున్న రోజుల్లో ఈ వేధింపులకు పాల్పడే అధికారులు ప్రజాప్రతినిధులపై చక్ర వడ్డీతో సహా బదులు తీర్చుకుంటానని పొంగులేటి ఘాటుగా స్పందించారు. ప్రజా సంక్షేమ పథకాల అమలులో టిఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అంటే టక్కున గుర్తుకొచ్చేది నందమూరి తారక రామారావు, వైయస్ రాజశేఖర్ రెడ్డిలే అని, మిగిలిన వారెవరు ప్రజా సంక్షేమం కోసం పాటు పడలేదన్నారు.అభివృద్ధి కోసం, కేసీఆర్ నునమ్మి వైసీపీలో గెలిచిన తాము అప్పటి టీఆర్ఎస్ లోచేరామని, కానీ తొమ్మిదేళ్లుగా అనేక అవమానాలకు గురయ్యామన్నారు. ఉపఎన్నికలు వచ్చిన ప్రతీ సారి ఓటర్లను ఆకర్షించేలా కొత్త పథకాలు ప్రకటించడం, ఆ తరువాత వదిలేయటం బీఆర్ఎస్ నేతలకు పరిపాటిగా మారిందని, తమను నమ్ముకున్నవారికి ఏ మేలు చేయలేకపోవటంతోనే ఆవేదనతోనే పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తనకు రూ.వందల కోట్లు కాంట్రాక్టులు ఇచ్చామని కొందరు బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారని, ఈ విషయంలో పెద్ద నాయకుడు చర్చకొస్తే తానూ సిద్ధంగా ఉన్నానన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పడినా నాటి నుంచి రూ.లక్షలకోట్ల కాంట్రాక్టులు దొడ్డిదారిన ఎవరిచ్చారో.. అదే దొడ్డిదారిలో ఎన్ని కోట్లు కమీషన్లురూపంలో దండుకున్నారో త్వరలోనే గుట్టు విప్పుతానన్నారు.

First published:

Tags: Khammam, Local News

ఉత్తమ కథలు