హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadrachalam: విలువిద్యలో రాణిస్తున్న కిన్నెరసాని ఆశ్రమ పాఠశాల విద్యార్థులు

Bhadrachalam: విలువిద్యలో రాణిస్తున్న కిన్నెరసాని ఆశ్రమ పాఠశాల విద్యార్థులు

X
విలువిద్యలో

విలువిద్యలో రాణిస్తున్న పాల్వంచ గిరిజన విద్యార్థులు

Bhadrachalam: పూర్వకాలంలో రామాయణ, భారత, భాగవతం లాంటి ఇతిహాస గ్రంథాల మొదలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో విలువిద్య కంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశమే విలువిద్యకు పుట్టిల్లు.

  • News18 Telugu
  • Last Updated :
  • Bhadrachalam | Khammam | Telangana

Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

పూర్వకాలంలో రామాయణ, భారత, భాగవతం లాంటి ఇతిహాస గ్రంథాల మొదలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో విలువిద్య కంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశమే విలువిద్యకు పుట్టిల్లు. ఇంతటి గొప్ప విద్యను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ఆశ్రమ పాఠశాలలో అభ్యసిస్తున్న పలువురు గిరిజన విద్యార్థులు ఇటు చదువులోనూ అటు విలువిద్యలోనూ రాణిస్తూ ఆధునిక ప్రపంచంలో మార్కుల వేటలో ర్యాంకులతో పోటీపడుతున్న కార్పొరేట్ విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ఆశ్రమ పాఠశాల విలువిద్యకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. పాఠశాల పి.డి అన్నం వెంకటేశ్వర్లు, విలువిద్యలో జాతీయ క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రసన్నకుమార్ నేతృత్వంలో పలువురు గిరిజన విద్యార్థులు విలువిద్యలో మెలకువలు నేర్చుకుంటూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తున్నారు.

60శాతానికి పైగా విద్యార్థులు వివిధ పోటీల్లో ప్రతిభ

కిన్నెరసాని ఆశ్రమ పాఠశాలలో ప్రతి ఏడాది ఐదో తరగతిలో చేరుతున్న విద్యార్థులను ఏడాది పాటు ఫిజికల్ ఫిట్నెస్ లో శిక్షణ ఇచ్చి అనంతరం మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను వారి ఇంట్రెస్ట్ కి అనుగుణంగా విలువిద్య మొదలు పలు రకాల క్రీడల్లో తర్ఫీదిస్తున్నారు. ఈ ఆశ్రమ పాఠశాల కేంద్రంగా చదువుకుంటున్న విద్యార్థుల్లో 60 శాతానికి పైగా విద్యార్థులు క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులుగా గుర్తింపు తెచ్చుకోవడం ఇక్కడ విశేషం.

ఇది చదవండి: అవయవదానం చేసి... మానవత్వం చాటుకుంటున్న ఆ గ్రామస్తులు

మెరుగైన వసతులు కల్పిస్తే మరింత రాణింపు

గొప్ప చరిత్ర కలిగిన ఈ పాఠశాలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు మాత్రం అంతంత మాత్రమే అందుతున్నాయని చెప్పొచ్చు. ఇంకా మెరుగైన వసతి సౌకర్యాలు కల్పిస్తే కిన్నెరసాని ఆశ్రమ పాఠశాల కేంద్రంగా గొప్ప క్రీడాకారులు దేశానికి అందించే అవకాశం లేకపోలేదు. కావున ఉన్నతాధికారులు కిన్నెరసాని ఆశ్రమ పాఠశాలపై దృష్టి సాధించి మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

First published:

Tags: Bhadradri kothagudem, Local News, Telangana

ఉత్తమ కథలు