హోమ్ /వార్తలు /తెలంగాణ /

TS News: నాలుగు రాష్ట్రాలను కలిపే రైల్వేలైన్.., పూర్తైతే దశ తిరిగినట్లే..!

TS News: నాలుగు రాష్ట్రాలను కలిపే రైల్వేలైన్.., పూర్తైతే దశ తిరిగినట్లే..!

భద్రాచలం-మల్కన్‌గిరి రైల్వే లైన్‌పై ఆశలు

భద్రాచలం-మల్కన్‌గిరి రైల్వే లైన్‌పై ఆశలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) భద్రాచలం (Bhadrachalam) పట్టణం అభివృద్ధి పై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఒడిస్సా (Odisha) లోని మల్కాన్ ‌గిరి నుంచి తెలంగాణ (Telangana) లోని భద్రాచలం వరకు 173.41 కిలో మీటర్ల రైల్వే లైన్ నిర్మాణం కోసం రైల్వే శాఖ (Railway Department) సర్వే ప్రారంభించింది

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Bhadrachalam, India

  Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) భద్రాచలం (Bhadrachalam) పట్టణం అభివృద్ధి పై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఒడిస్సా (Odisha) లోని మల్కాన్ ‌గిరి నుంచి తెలంగాణ (Telangana) లోని భద్రాచలం వరకు 173.41 కిలో మీటర్ల రైల్వే లైన్ నిర్మాణం కోసం రైల్వే శాఖ (Railway Department) సర్వే ప్రారంభించింది. దీంతో భద్రాచలం పట్టణ వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 22న ఒడిశాలోని కోరాపుట్‌లో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ (Railway Minister Ashwini Vaishnav) ఈ నూతన రైల్వే లైన్ ప్రకటించారు. ఈనేపధ్యంలో భద్రాచలానికి 48 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం అయిన కూనవరం మండలం జగ్గారం వద్ద ఇటీవలే రైల్వే శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు ఇక్కడ సాయిల్ టెస్ట్ ప్రారంభించారు.

  ఈ సాయిల్ టెస్ట్ పరీక్షల కోసం మహారాష్ట్ర , ఒడిస్సా, ఢిల్లీ నుంచి పలు ప్రత్యేక బృందాలు సుమారు 50 అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ చేసి మట్టి శాంపిల్స్ సేకరించి టెస్టింగ్ కోసం పంపుతున్నారు. మల్కన్‌గిరి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పాండురంగాపురం వరకు రైల్వే లైన్ నిర్మించనున్నారు.

  ఇది చదవండి: శబరీ స్మృతి యాత్రకు ప్రచారం కరువు.. సాంప్రదాయం పాటించని అధికారులు

  ఈ నూతన రైల్వే లైన్ తెలంగాణలో సుమారు 12.8 కిలోమీటర్లు ఉండనుంది. ఇది సికింద్రాబాద్ నుంచి మణుగూరుకు వెళ్లే రైల్వే లైన్‌కు పాండురంగాపురం వద్ద కలుస్తుంది. ఈ నూతన ట్రాక్ నిర్మాణంలో మొత్తం 12 స్టేషన్లో, వివిధ వాగులు, నదులపై 48 భారీ వంతెనలు 167 చిన్న చిన్న వంతెనలు వెరసి మొత్తం 215 వంతెనలు నిర్మించాల్సి ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ లైన్ వెళ్లే మార్గంలో నేల స్వభావాన్ని పరిశీలించేందుకు రైల్వే శాఖ ఆధ్వర్యంలో సాయిల్ టెస్ట్ చేపట్టారు. భద్రాచలం - మల్కన్ గిరి రైల్వే లైన్ ఏర్పాటుతో భద్రాచలం ఏజెన్సీతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాలు పర్యటకంగా అభివృద్ధి చెందనున్నాయి. అంతేకాక తెలంగాణలో లభించే ఖనిజ రవాణాకు ఈ లైన్ ఉపయోగపడుతుంది.

  భద్రాచలానికి 12 కిలోమీటర్ల దూరంలో పాండురంగాపురం, 40 కిలోమీటర్ల దూరంలో భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం రైల్వే స్టేషన్)లు ఉన్నాయి. దక్షిణ నియోజకవర్గంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి 50 లక్షల మందికి పైగా భక్తులు దైవ దర్శనం నిమిత్తం వస్తుంటారు. భద్రాచలానికి నేరుగా రైలు మార్గం ఉంటే ఉత్తరాది నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తుల రాక పెరుగుతుంది. ఈ నేపథ్యంలో భద్రాచలం మరింత పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే భద్రాచలం వద్ద గోదావరి నదిపై ప్రస్తుతం ఉన్న వంతెనకు పక్కనే మరో భారీ వంతెనను నిర్మిస్తున్నారు. ఇప్పుడు రైల్వే లైన్ కోసం మరో భారీ వంతెనను నిర్మించేందుకు రైల్వే శాఖ అధికారులు సర్వే చేస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Bhadrachalam, India Railways, Local News, Telangana

  ఉత్తమ కథలు