Dasari Kranthi Kumar, News18.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ పరిధిలోని సత్యనారాయణపురం సమీప అడవుల్లో హజరత్ నాగుల్ మీరా 20వ ఉరుసు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగిన ఈ ఉత్సవంలో మొదటిరోజు సందీల్ కార్యక్రమం నిర్వహించగా, రెండవ రోజు హజరత్ ఖాసీం దర్గా నుంచి సత్యనారాయణపురం వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో వివిధ రూపాలలో కళాకారులు అలరించారు. ప్రత్యేకంగా డప్పు వాయిద్యాలు, గిరిజన కొమ్ము నృత్యాలు, ప్రత్యేకంగా కేరళ నుంచి వచ్చిన పలువురు కళాకారుల కళా ప్రదర్శన ఉత్సవాల్లో ఆకర్షణగా నిలిచాయి.
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఉర్సు ఉత్సవాలకు ఢిల్లీ , ఒరిస్సా, మహారాష్ట్ర , మధ్యప్రదేశ్ , కేరళ, చత్తిస్గడ్, తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఇల్లందులో జరిగే ఉసురు ఉత్సవం ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. నాగులు మీరా ఘనంగా ఉర్సు ఉత్సవం కుల, మతాలకతీతంగా అత్యంత వైభవంగా హిందూ, ముస్లింలు కలిసి ఈ ప్రాంతంలో నిర్వహిస్తుంటారు. హిందూ ముస్లింల ఐక్యతను చాటి చెబుతున్న నాగుల్ మీరా ఉరుసు ఉత్సవం గత 20 సంవత్సరాలుగా జరుగుతుండడం మరో విశేషం.
రెండు రోజులపాటు జరుగిన ఉర్సు ఉత్సవాలలో సందల్, ఊరేగింపు కార్యక్రమాలు ముఖ్యమైనవి. కళారూపాల ప్రదర్శన, వాయిద్యాలతో సాగినఊరేగింపు ఆద్యంతం భక్తి పారవశ్యంతో సాగింది. గిరిజన కొమ్ము నృత్యాలు, కేరళ వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఉత్సవాల్లో నాగుల్ మీరాకు మొక్కలు చెల్లిస్తుండగా.. ఈ ఉత్సవాల నిర్వహణ పూజారిగాహిందువు వ్యవహరించడం కోసమెరుపు. ఇది ఇలా ఉండగాఉర్సు ఉత్సవాల ప్రారంభ సూచికగా పట్టణంలోని హజరత్ ఖాసీం దుల్షా దర్గా షరీఫ్ లో ఖాసీం దుల్హాకు పూలమాల వేసి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దర్గా నుంచి చాదర్‌ను భక్తులు నాగుల్‌మీరా దర్గాకు ప్రత్యేక వాహనంలో భారీ జులూస్ తో తరలించారు.
సుమారు ఏడు కిలోమీటర్లకు పైగా ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి సత్యనారాయణపురం అటవీ ప్రాంతంలోని హజరత్ నాగుల్మారా మౌలాచాన్ దర్గాకు చేరుకున్నారు. అక్కడ చాదర్ తో పాటు జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మెజిస్ట్రేట్ ముకేశ్‌లను ఒంటెలపై ఊరేగితూ దర్గా ప్రాంగణంలోకి చేరుకున్నారు. హజరత్ నాగుల్ మీరా చాన్ కు గంధం (చాదర్)ను సమర్పించి అత్యంత భక్తి శ్రద్ధలతో ధూప దీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
Big News: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్..ఓ వైపు నోటీసులు..మరోవైపు రిమాండ్ పొడిగింపు
అంతే కాకుండా జిల్లాలకు చెందిన వేలాది మంది అయ్యప్పలు, హిందువులు, ముస్లింలు, మర్పీలు పాల్గొంటారు. ఒంటెలు, గుర్రాలతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే పలు మతాల సాధువులు, మల్లాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. దర్గా ప్రాంగణంలో అరుదైన పెంపుడు జంతువులు, పూల మొక్కలు ప్రత్యేక ఆక ర్షణగా నిలుస్తున్నాయి. దేశ విదేశాల నుంచి సేకరించిన పూల మొక్కలు, ఆస్ట్రియా, టర్కీ తదితర దేశాల నుంచి తెచ్చిన అరుదైన పక్షులు, కోళ్ళు, పావురాలు, కుందేళ్ళు, బాతులు, ఈము పక్షులు, కూరగాయల తోటలు, పూల తోటలు, పండ్ల తోటలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Telangana