హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri: శబరీ స్మృతి యాత్రకు ప్రచారం కరువు.. సాంప్రదాయం పాటించని అధికారులు

Bhadradri: శబరీ స్మృతి యాత్రకు ప్రచారం కరువు.. సాంప్రదాయం పాటించని అధికారులు

భద్రాద్రిలో శబరి యాత్రను పట్టించుకోని అధికారులు

భద్రాద్రిలో శబరి యాత్రను పట్టించుకోని అధికారులు

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (Bhadrachalam Seetha Ramachandra Swamy Temple) లో అక్టోబర్ 9న శబరి స్మృతి యాత్రను సాంప్రదాయపద్ధంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Bhadrachalam, India

  Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

  భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (Bhadrachalam Seetha Ramachandra Swamy Temple) లో అక్టోబర్ 9న శబరి స్మృతి యాత్రను సాంప్రదాయపద్ధంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గిరిజన మహిళ అయిన శబరికి రామాయణ మహాకావ్యంలో చిన్న పాత్ర. మానవ రూపంలో తిరుగుతున్న శ్రీరాముడిని దర్శించుకుని తనలో ఉన్న భక్తితో పునీతులైందని రామాయణంలో చెప్పబడింది. శ్రీరామగిరి (ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా) ప్రాంతంలో మాతంగ మహర్షి ఆశ్రమంలో నివసించే శబరి పరిచారికగా మహర్షులకు సేవ చేస్తూ రామచంద్రుని రాక కోసం వేసి చూసింది. రామచంద్రుని రాక కోసం 13 ఏళ్ల పాటు ఎదురుచూసింది. ఈ సమయంలో తన దగ్గరకు వచ్చిన రామలక్ష్మణులను చూసి ఒక్కసారిగా పొంగిపోయింది. రుచికరమైన పండ్లను తీసుకొచ్చి వాటిని తానే స్వయంగా రుచి చూసి ఆ ఎంగిలి పండ్లను స్వామివారికి సమర్పించి తన భక్తిని చాటుకుంది. దీంతో రాముని అనుగ్రహంతో ఆ భక్తురాలు ముక్తిని పొందింది.

  ఆమె అమాయక భక్తికి ముగ్ధుడైన శ్రీరామచంద్రుడు అనుగ్రహించి ముక్తిని ప్రసాదించాడు. వాల్మీకి రామాయణంలో చెప్పబడిన శబరి పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ భక్త శబరికి ఉన్న ప్రాధాన్యం విశేషమైనది. అందుకే ఈమెను వాల్మీకి 'ధర్మ నిపుణ' అని ప్రస్తావించారు. ఇలాంటి పరమ భక్తురాలి పేరిట అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించిన భద్రాద్రి ఆలయ అధికారులు 2013లో 'శబరి స్మృతి యాత్ర'కు శ్రీకారం చుట్టారు. ప్రతి ఏటా ఆశ్వీజ పౌర్ణమికి శబరి స్మృతి యాత్ర ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా ప్రస్తుతం శబరి మాత ఉత్సవంపై ఆశించిన స్థాయిలో ప్రచారం నిర్వహించకపోవడం భక్తులను ఆవేదనకు గురిచేస్తున్న విషయం.

  ఇది చదవండి: ఆ జిల్లాపై పగబట్టిన వరణుడు.., వణికిపోతున్న జనం.. మునిగిన పంటలు

  ప్రతిఏటా స్మృతి యాత్రకు ముందు రోజు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాల నుంచి గిరిజనులను దేవస్థానానికి తీసుకువచ్చి వీరికి ఉచిత వసతి, భోజనం, ప్రసాదలను అందిస్తారు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సరైన ప్రచారం నిర్వహించకపోవడం గమనార్హం. శబరి స్మృతి యాత్ర నిర్వహించే అక్టోబర్ 9నే వాల్మీకి జయంతి. రామాయణ మహాకావ్యాన్ని రచించిన ఈ మహా ఋషికి ఉత్సవం చేస్తున్నా అందుకు సంబంధించి భక్తులను ఆహ్వానించేలా సరైన ప్రచారం లేదని రామ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జరగబోయే శబరి స్మృతి యాత్ర, వాల్మీకి జయంతి కార్యక్రమాల్లో భక్తుల సౌకర్యార్థం ఏ మేరకు ఏర్పాట్లు జరగనున్నాయో వేచి చూడాల్సిందే.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Bhadrachalam, Local News, Telangana

  ఉత్తమ కథలు