హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఇల్లందు మున్సిపాలిటీలో ముదిరిన వార్.. రోడ్డెక్కిన బీఆర్ఎస్ నేతలు

ఇల్లందు మున్సిపాలిటీలో ముదిరిన వార్.. రోడ్డెక్కిన బీఆర్ఎస్ నేతలు

ఇల్లందు బీఆర్ఎస్ లో ముదిరిన విభేదాలు

ఇల్లందు బీఆర్ఎస్ లో ముదిరిన విభేదాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం నోటీసు అందజేసి, వైజాగ్ క్యాంపునకు తరలివెళ్లిన 12 మంది కౌన్సిలర్లకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Bhadrachalam | Kothagudem | Telangana

Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం నోటీసు అందజేసి, వైజాగ్ క్యాంపునకు తరలివెళ్లిన 12 మంది కౌన్సిలర్లకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. అలాగే, కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేశారంటూ. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు కౌన్సిలర్ల ఇంటి ఎదుట 'సేవ్ ఇల్లెందు.. బట్ నాట్ సేల్ ఇల్లెందు' పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఇల్లందు పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మనోహర్ తివారీ, పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రూ.10 లక్షలకు కొందరు కౌన్సిలర్లు అమ్ముడుపోయి అవిశ్వాసానికి సిద్ధమయ్యారని ఆరోపించారు.

కన్న తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసిన వారికి ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు. విలువ లేని రాజకీయాలు చేస్తున్న కౌన్సిలర్లు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు (డీవీ)కి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టిన కౌన్సిలర్లు బుధవారం వీడియోలు రిలీజ్ చేశారు. తాము రూ.10 లక్షలకు అమ్ముడుపోయామంటూ తమ ఇళ్ల ముందు ధర్నాలు చేయించడం ఏంటంటూ వీడియో మెసేజ్ లో ప్రశ్నించారు.

ఇది చదవండి: రోడ్డుపక్కనే ట్రైన్.. అక్కడికి వెళ్తే అన్నీ ఘుమఘుమలే..!

అవినీతికి నువ్వు పాల్పడి, అది ప్రశ్నించినందుకు మేం ఆమ్ము డుపోయాం' అంటూ నిందలు వేయడం ఏంటని నిలదీశారు. బినామీ కాంట్రాక్టర్లతో పనులన్నీ మున్సిపల్ చైర్మన్డీవీనే చేపడుతున్నాడని ఆరోపించారు. ఇదేం పద్ధతని ప్రశ్నించినందుకు తమ వార్డుల్లో కనీస స్థాయిలో కూడా పనులు చేపట్టడం లేదన్నారు. కేసీఆర్ , కేటీఆర్ , హరిప్రియ నాయకత్వంలో పని చేసేందుకు రెడీ గా ఉన్నామని చెప్పారు. ప్రస్తుత మున్సిపల్ చైర్మన్డీవీకి దమ్ముంటే అవిశ్వాసాన్ని ఎదుర్కొని తన బలాన్ని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.

ఇది చదవండి: భద్రాద్రి రామయ్య కల్యాణానికి కుదిరిన ముహూర్తం.. బ్రహ్మోత్సవాలు ఎప్పుడంటే..!

వీడియో రిలీజ్ చేసిన వాళ్లలో కొక్కు నాగేశ్వరరావు, సందబిందు, సిలివేరు అనిత, పాబోలు స్వాతి, చీమల సుజాత, వాంకుడోతు తార, తోట లలిత శారద, పత్తి స్వప్న ఉన్నారు. అసమ్మతి వర్గం కౌన్సిలర్లు ప్రస్తుతం యానాంలోని క్యాంపులో ఉన్నట్టు సమాచారం. వారంతా నేడు ఇల్లెందు వస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా మున్సిపల్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కొక్కు నాగేశ్వరరావు, 16వ వార్డు కౌన్సిలర్ గిన్నారపు రజిత, ఆమె భర్త రవిని కిడ్నాప్ చేశారని వారి బంధువులు బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇల్లెందుకు చెందిన కొండపల్లి గణేష్, సిలివేరు సత్యనారాయణలను బాధ్యులుగా పేర్కొనడంతో కేసు నమోదు. చేసినట్లు సీఐ రాజు తెలిపారు. కాగా, నాగేశ్వరరావు, రజిత, ఆమె భర్త యానాం క్యాంపులో ఉండగా, వారి బంధువులు మాత్రం కిడ్నాప్ అయినట్లు ఫిర్యాదు చేయడం గమనార్హం.

First published:

Tags: Bhadradri kothagudem, BRS, Local News, Telangana