హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri Kothagudem: కోలాహలంగా రాజా తూము లక్ష్మీ నరసింహ దాసు జయంతి

Bhadradri Kothagudem: కోలాహలంగా రాజా తూము లక్ష్మీ నరసింహ దాసు జయంతి

X
bhadradri

bhadradri

దశవిధ ఉత్సవాల్లో అత్యంత కీలకమైంది దర్బారు సేవ. మరో రామదాసుగా ప్రసిద్ధిగాంచిన రాజా తూము లక్ష్మీ నర్సింహదాసు ఇచ్చిన స్పూర్తితోనే 1998లో భద్రాద్రి రామయ్యకు 108 బంగారు పుష్పాలను చినజీయర్ స్వా మీ రామయ్య సేవకు సమర్పించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Kothagudem, India

Kranthi Kumar, News 18, Bhadradri

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం అధ్వర్యంలో రాజా తూము లక్ష్మీనరసింహదాసు 232వ జయంతిని ఘనంగా నిర్వహించారు. తొలుత తూము లక్ష్మీనరసింహదాసు చిత్రపటంతో మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఈ క్రమంలో విస్తా కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న లక్ష్మీనరసింహదాసు విగ్రహం వద్ద, భక్త రామదాసు విగ్రహం వద్ద పూజలు చేశారు. తరువాత తూము లక్ష్మీనరసింహదాసు పేరిట భద్రాద్రి రామయ్యకు అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదట ప్రధాన ఆలయంలోని బేడా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం రాజా తూము లక్ష్మీనరసింహదాసు చిత్రపటంతో దేవస్థానం పురవీధుల్లో నగర సంకీర్తనను నిర్వహించారు.

Read Also : Mulugu: 18 ఏళ్లు నిండాయా..? ఈ వార్త మీకోసమే

విస్తా కాంప్లెక్స్ ఆవరణలోని రాజా తూము లక్ష్మీ నరసింహ దాసు విగ్రహం వద్ద ప్రత్యేక అలంకరణతో పూజలు నిర్వహించి హారతి తీర్థప్రసాదాలు అందించారు. హరిదాసులు చేసిన నగర సంకీర్తన పలువురిని ఆకట్టుకుంది.భద్రాద్రి రామయ్యకు సుప్రభాత సేవ నుంచి పవళింపు సేవ వరకు దశవిధ ఉత్సవాల రూపకర్త. అందుకు అనుగుణంగా కీర్తనలను రచించి వాటిని గానానికి శ్రీకారం చుట్టిన మహనీయుడు భక్తరామదాసు. ఆ తరువాత రామయ్యను అత్యంత భక్తితో కొలిచిన అపర భక్తరామదాసు రాజా తూము లక్ష్మీ నరసింహదాసు. భద్రాద్రి రాముని సేవ కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదిలేసి రామ భక్తిలో తరిస్తూ తీర యాత్రలను చేస్తూ భద్రాచలంకు వచ్చి తన స్నేహితుడైన వరద రామదాసు సాయంతో ఆలయాభివృద్ధికి నడుం బిగించారు.

ఇంత గొప్ప మహనీయుడి జయంతి ఉత్సవాలను చిత్రకొండ మండలం ఘనంగా నిర్వహించడంతో భక్తుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. కార్యక్రమంలో దేవస్థానం ఏఈవో శ్రావణ కుమార్, పర్యవేక్షకులు లింగాల సాయిబాబా, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, పరిపాలన, వైదిక సిబ్బంది పాల్గొన్నారు.

దశవిధ ఉత్సవాల్లో అత్యంత కీలకమైంది దర్బారు సేవ. మరో రామదాసుగా ప్రసిద్ధిగాంచిన రాజా తూము లక్ష్మీ నర్సింహదాసు ఇచ్చిన స్పూర్తితోనే 1998లో భద్రాద్రి రామయ్యకు 108 బంగారు పుష్పాలను చినజీయర్ స్వా మీ రామయ్య సేవకు సమర్పించారు. కాగా తూము నర్సింహదాసు చెక్కించిన శిలాశాసనసాలు, రామస్తంభం నేటికి భద్రాద్రి ఆలయంలో భక్తులకు దర్శనమిస్తాయి.

First published:

Tags: Bhadradri kothagudem, Local News, Telangana

ఉత్తమ కథలు