Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. కట్టుదిట్టమైన భద్రత చర్యల నడుమ రాష్ట్రపతి పర్యటన ముగియడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శీతాకాల విడిది కోసం తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. డిసెంబర్ 28 ఉదయం సుమారు 11 గంటల సమయంలో జిల్లాకు చేరుకున్న రాష్ట్రపతి రోడ్డు మార్గానదేశంలోనే రెండవ అయోధ్యగా కీర్తింపబడుతున్నభద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి చేరుకునున్నారు. దేవాలయ అర్చక బృందం పూర్ణకుంభంతో రాష్ట్రపతికి స్వాగతం పలకగా ప్రధాన ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు అనంతరం ఆలయ ఆవరణలోని లక్ష్మీ తాయారు అమ్మ వారి గుడిలో రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, అజయ్ కుమార్ రాష్ట్రపతికి శాలువాతో సత్కరించగా.. వైదిక బృందం వేద ఆశీర్వచనాన్ని పఠించింది.
అనంతరం దేవస్థాన ప్రసాదాన్ని, మూలమూర్తుల చిత్రపటాన్ని రాష్ట్రపతికి అందజేశారు.మొదటగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముఉదయం రాజమండ్రి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామపంచాయతీ పరిధిలోని ఐటీసీలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ కు చేరుకున్నారు. అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమహెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం రామాలయ ప్రాంగణానికి చేరుకున్నారు.
అనంతరం ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల దర్శనాన్ని పూర్తిచేసుకుని ఆలయ ప్రాంగణంలోని కేంద్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న 'ప్రసాద్' పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఆలయం నుంచి బయలుదేరి 2 కి.మీ. దూరంలో భద్రాచల పట్టణంలోనిశాంతినగర్ లో గల వీరభద్ర ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు. అనంతరం వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన సమ్మక్క - సారలమ్మ వనాజాతి పూజారి సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సమ్మేళనంలో ప్రసంగించిన అనంతరం ఇక్కడ నుంచే తెలంగాణ రాష్ట్రంలోని కుమురం భీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో నిర్మించిన ఏకలవ్య గురుకుల పాఠశాలను వర్చువల్గా ప్రారంభించారు.
సమావేశాన్ని పూర్తిచేసుకుని పట్టణంలోని వీరభద్ర ఫంక్షన్ హాల్ నుంచి బయలుదేరి ఐటీసీ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక శాఖాహార భోజనాన్ని అధికారులు రాష్ట్రపతి కోసం సిద్ధం చేశారు.భోజనాన్ని ముగించిన రాష్ట్రపతి కాసేపు రెస్ట్ తీసుకొని, మధ్యాహ్నం సుమారు రెండు గంటల ప్రాంతంలో గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి హెలిప్యాడ్ కు చేరుకున్నారు.
హెలికాప్టర్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 160 కి.మీ. దూరంలో ఉన్న ములుగు జిల్లా రామప్పకు బయలుదేరారు. అధ్యంతం అత్యంత కట్టుదిట్టమైన భద్రతను నడుమ జరిగిన రాష్ట్రపతి పర్యటనలో రాష్ట్ర గవర్నర్ తమిలిసై సౌందరాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్,మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు మాలోత్ కవిత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పి చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, భద్రాచలం శాసనసభ్యులు పోదెం వీరయ్య, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఐజీ నాగిరెడ్డి,జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ డా వినీత్, పర్యాటక శాఖ ఎండి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Draupadi Murmu, Local News, Telangana