హోమ్ /వార్తలు /తెలంగాణ /

పొంగులేటి వేరుకుంపటి.. ఆత్మీయ సమావేశానికి జనసమీకరణ!..

పొంగులేటి వేరుకుంపటి.. ఆత్మీయ సమావేశానికి జనసమీకరణ!..

సీరియస్ అయిన బీఆర్ ఎస్ నేతలు..

సీరియస్ అయిన బీఆర్ ఎస్ నేతలు..

Telangana: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏర్పడుతున్న తాజా రాజకీయ పరిణామాలు, మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేరేకుంపటి తదితర అంశాలు అధికార బిఆర్ఎస్ పార్టీకి తలనొప్పులు తెచ్చి పెట్టేలా కనబడుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏర్పడుతున్న తాజా రాజకీయ పరిణామాలు, మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేరేకుంపటి తదితర అంశాలు అధికార బిఆర్ఎస్ పార్టీకి తలనొప్పులు తెచ్చి పెట్టేలా కనబడుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీను చీల్చే విధంగా చేస్తున్న పొంగులేటి పర్యటనలు.. ప్రధానంగా ఏజన్సీపై ఆ ప్రభావాన్ని తీవ్రతరం చేస్తున్నట్లు కనబడుతోంది.

ఇందుకు గానూ నేడు భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే పొంగులేటి ఆత్మీయ సమ్మేళనానికి చేస్తున్న జన సమీకరణలో ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీలోనే ఉంటున్న ప్రజా ప్రతినిధులను, నాయకులను కూడ గలుపుకునే దిశగా పొంగులేటి వర్గం విశ్వ ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. బిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులుగా ఉన్న ప్రజా ప్రతినిధులు, నాయకులను సమాయత్తం చేసి ఈ ఆత్మీయ సమ్మేళనానికి తీసుకెళ్ళేందుకు పొంగులేటి వర్గీయులు శుక్రవారం దుమ్ముగూడెం మండలంలో విస్తృతంగా పర్యటించినట్లు కనబడుతోంది.

తొలుత భద్రాచలంలో పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ డా. తెల్లం వెంకట్రావు నేతృత్వంలో ఆత్మీయ సమ్మేళనానికి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన బిఆర్ఎస్ అసమ్మతి నేతలు అనంతరం అక్కడికి చేరుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిను కలిసి దుమ్ముగూడెం మండల పరిస్థితులను తెలియజేసినట్లు తెలుస్తోంది.

పొంగులేటి ఇచ్చిన సూచనలతో పాటు ఆత్మీయ సమ్మేళనానికి జరగాల్సిన కార్యాచరణలో భాగంగా పొంగులేటి సానుభూతిపరులందరినీ కూడగలుపుకునేందుకు ఇప్పటికే అనుకూలంగా ఉన్న వారితో కలిపి విస్తృతంగా పర్యటించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగాఆత్మీయ సమ్మేళన ఏర్పాట్లను పరిశీలించేందుకు భద్రాచలం రానున్నపొంగులేటి.. నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రధాన నాయకులు, ప్రజా ప్రతినిధులకు స్వయంగా ఫోన్ చేసి సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

పొంగులేటి ఫోన్ లోకొద్దో గొప్పో అటు, ఇటుగా ఉన్న ప్రజా ప్రతినిధులు నాయకులు కూడా తప్పక సమావేశానికి హామీ ఇచ్చినట్లు సమాచారం. పొంగులేటి వర్గంగా సమావేశానికి హాజరై ఇకపై పొంగులేటితోనే పయనం చేసే దిశగా కొందరు నాయకులు, ప్రజా ప్రతినిధులు తీర్మానించుకున్నట్లుగా కూడా తాజా పరిస్థితులు కనబడుతున్నాయి.

ఇదిలా ఉండగాప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న పొంగులేటి, తెల్లం వెంకట్రావుల ఆధ్వర్యంలో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనానికి బిఆర్ఎస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, ఒకవేళ ఎవరైనా పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఆ సమావేశానికి వెళ్తే వేటు తప్పదని ఇప్పటికేసోషల్ మీడియాలో పోస్టింగ్ ల ద్వారా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశానికి వెళ్ళోద్దు అంటూ పార్టీ ఖరాఖండిగా చెబుతోంది.

ఇప్పటికే జరిగే వలసలను నిలువరించేందుకు బీఆర్ఎస్ విస్తృతంగా ప్రయత్నం చేస్తుండగా నయానో, భయానో ఆ సమావేశానికి వెళ్ళకుండా ఆపేందుకు చర్చలు జరుపుతోంది. కాగా నేడు జరిగే ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యే మండల నాయకులు, ప్రజా ప్రతినిధులపై పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టిపెట్టినట్లు కనబడుతోంది. ఇక ఏం జరుగుతుందో వేచి చూద్దాం.

First published:

Tags: Bhadradri kothagudem, Local News, Telangana

ఉత్తమ కథలు