ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srnivas Reddy) వ్యవహారం కొంత కాలంగా హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ (BRS) హైకమాండ్ ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం.. ఆయన కూడా పార్టీని పట్టించుకోకపోవడం..బాహాటంగానే విమర్శలు చేయడం... వంటి పరిణామాలు చర్చనీయంశమయ్యాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి.. బీజేపీ (BJP) లో చేరుతారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఆయన అడుగులు పడుతున్నాయి. జనవరి 18న ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరుకాలేదు. ఖమ్మం సభతో గులాబీ దళం జోష్‌లో ఉంటే... ఆయన మాత్రం ఢిల్లీకి వెళ్లారు. అక్కడ బీజేపీ అగ్రనేత, హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. భేటీ అనంతరం ఆయన కాషాయ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది. కానీ పలు కారణాలతో బీజేపీలో ఆయన చేరిక వాయిదా పడినట్లు తెలుస్తోంది.
Khammam Politics: కేసీఆర్ సభకు దూరంగా పొంగులేటి వర్గం..పార్టీ వీడనున్నారా?
కాస్త ఆలస్యమైనా..పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం పక్కాగా బీజేపీలో చేరుతారని ఆయన అనుచర వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల పొంగులేటికి రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీని తగ్గించడం.. ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో... బీఆర్ఎస్ హైకమాండ్ తీరుపై ఆయన తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. అందువల్ల ఆయన ఖచ్చితంగా బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో పొంగులేటి మాత్రమే కాదు.. ఆయన ఫ్లెక్సీలు కూడా కనిపించలేదు. పొంగులేటి వర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలెవరూ సభకు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఆయన్ను వదులకునేందుకు పార్టీ సిద్ధమైందని.. బీఆర్ఎస్‌ను వీడేందుకు ఆయన కూడా అంతా సిద్ధం చేసుకున్నారని స్పష్టమైంది. ఐతే బీఆర్ఎస్ ఖమ్మం సభ రోజునే.. ఆయన కాషాయం తీర్థం పుచ్చుకోవాలని అనుకున్నా.. కొన్ని కారణాలతో వాయిదా పడింది.
Revanth Reddy: రేవంత్ రెడ్డి పాదయాత్ర.. మూడు రోజుల్లో తేలిపోతుందా ?
ఫిబ్రవరి రెండో వారంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి.. ఆయన బీజేపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఏ ఖమ్మం వేదికగా సీఎం కేసీఆర్ (CM KCR) బీజేపీపై సమర శంఖం పూరించారో.. అదే ఖమ్మం వేదికగా బీజేపీలో చేరాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం. కేసీఆర్ సభను తలన్నేలా.. భారీగా జన సమీకరణ చేసి.. తన బలాన్ని నిరూపించుకోవాలని భావిస్తున్నారట. ఆ సభ ద్వారా కేసీఆర్‌కు సవాల్ విసరడంతో పాటు.. ఖమ్మంపై తనకున్న పట్టును బీజేపీకి చూపించాలని.. పొంగులేటి యోచిస్తున్నారట. కాస్త ఆలస్యమైనా సరే.. ఊహించని స్థాయిలో సభను నిర్వహించి.. సీఎం కేసీఆర్‌కు షాక్ ఇవ్వాలని వ్యూహాలు రచిస్తున్నారట.
ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభకు భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య హాజరుకాలేదు. ఆయన్ను బీఆర్ఎస్ పెద్దలు ఆహ్వానించలేదు. కోనం కనకయ్య.. పొంగులేటి వర్గానికి చెందిన వారన్న కారణంతోనే ఆయన్ను సమావేశానికి పిలవలేదని సమాచారం. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు కోరం కనకయ్య కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Khammam, Local News, Ponguleti srinivas reddy, Telangana