హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఫారెస్ట్ రేంజర్ హత్య.. ఎవరు చంపారో తెలుసా..? పోలీసులేమంటున్నారు..?

ఫారెస్ట్ రేంజర్ హత్య.. ఎవరు చంపారో తెలుసా..? పోలీసులేమంటున్నారు..?

forest

forest ranger srinivasa rao

పచ్చని అడివి నెత్తురోడింది. పోడు భూముల సాగు విషయంలో ఇప్పటికే రావణ కాష్టంలా రగులుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) లో ఓ ఫారెస్ట్ రేంజర్ పై అత్యంత కిరాతకంగా దాడి చేసి హతమార్చిన సంఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Bhadrachalam | Telangana

  Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

  పచ్చని అడివి నెత్తురోడింది. పోడు భూముల సాగు విషయంలో ఇప్పటికే రావణ కాష్టంలా రగులుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) లో ఓ ఫారెస్ట్ రేంజర్ పై అత్యంత కిరాతకంగా దాడి చేసి హతమార్చిన సంఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విధుల్లో అత్యంత నిబద్ధతతో పనిచేసే ఉద్యోగా పేరొందిన సదరు రేంజర్ ఇలా ఆదివాసీల చేతిలో హత్యకు గురి కావడంతో అటవీశాఖ వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ప్లాంటేషన్ భూమిలో మేస్తున్న పశువులను పక్కకు తోలాలి అనే విషయంలో మొదలైన గొడవ రేంజర్ ప్రాణం మీదికి తీసుకువచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫారెస్ట్ రేంజర్ హత్య కేసులో వివరాలు ఇలా ఉన్నాయి.

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ ఫారెస్ట్ రేంజర్ చలమల శ్రీనివాసరావు సెక్షన్ ఆఫీసర్ రామారావుతో కలిసి ఉదయం 10గంటల సమయంలో చండ్రుగొండ మండలం పోకలగూడెం అటవీ ప్రాంతంలో జరుగుతున్న ప్లాంటేషన్ పనులు పరిశీలించేందుకు వెళ్లారు. పరిశీలన అనంతరం తిరిగి వస్తున్న క్రమంలో ఫారెస్ట్ వాచర్ రాములు బండెలపాడు అడవి ప్రాంతంలో పలువురు ఆదివాసులు ప్లాంటేషన్ వేసిన భూముల్లో పశువులు మేపుతున్నారని సమాచారం ఇచ్చాడు.

  ఇది చదవండి: ఎన్నాళ్లో వేచిన ఉదయం..! తీరిన జిల్లా వాసుల కల

  వాచర్ రాములు సమాచారం అందుకున్న రేంజర్ చరమల శ్రీనివాసరావు హుటాహుటిన సెక్షన్ ఆఫీసర్ రామారావుతో కలిసి ప్లాంటేషన్ ప్రాంతానికి చేరుకున్నారు. పశువులు మేపుతున్న ఆదివాసులను అక్కడ నుంచి వెళ్లిపోవాలని సూచించిన నేపథ్యంలో ఆదివాసులకు రేంజర్ శ్రీనివాసరావుకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది ఈ క్రమంలో ఆదివాసీలైన మడకం తూలాతో పాటు మరో వ్యక్తి రేంజర్ శ్రీనివాసరావు పై కత్తితో దాడి చేశారు.

  ఇది చదవండి: పనికి రాని ప్లాస్టిక్ బాటిల్స్ తో లాభాలు.. నలుగురు ఉపాధి కల్పిస్తున్న వ్యక్తి

  ఈ క్రమంలో గొంతు భాగంలో బలంగా కత్తి గాయం అవ్వడంతో శ్రీనివాసరావు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇదే సమయంలో సెక్షన్ ఆఫీసర్ రామారావు, వాచర్ రాములు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆదివాసి తులా, మరో వ్యక్తి సదరు సిబ్బందిపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అప్పటికే తీవ్ర రక్తస్రావంలో ఉన్న శ్రీనివాసరావును చూసి ఆదివాసులు పరారయ్యారు. అనంతరం సదరు సిబ్బంది రామారావు, రాములు శ్రీనివాసరావును చండ్రుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స చేసి ఖమ్మంలోని ఆసుపత్రికి వైద్యులు రిఫర్ చేశారు.

  సదరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రేంజర్ శ్రీనివాసరావు మృతి చెందాడు. రేంజర్ శ్రీనివాసరావు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి నిందితులను కఠినంగా శిక్షించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా శ్రీనివాసరావు కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా తో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వవలసిందిగా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసరావు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి , అజయ్ కుమార్ అంత్యక్రియలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: AP Telangana border, Bhadradri kothagudem, Local News

  ఉత్తమ కథలు