భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాకు చెందిన ఓ యువకుడికి ప్రధాని మోదీ (PM Narendra Modi)తో మాట్లాడే అరుదైన అవకాశం లభించింది. రోజ్‌గార్ మేళా-2023 (Rozgar Mela 2023) కార్యక్రమంలో ప్రధాని మోదీ 71వేల మంది జాబ్ లెటర్స్ అందజేశారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న యువ ఉద్యోగులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువకుడికి కూడా ఇందులో పాల్గొనే అవకాశం దక్కింది. అతడి పేరు కన్నమల్ల వంశీకృష్ణ.. స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం నిమ్మలగూడెం. ఈ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో వంశీకృష్ణ మాట్లాడారు.
Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారు.. ఎప్పుడొస్తున్నారంటే..
వంశీకృష్ణ బీ.టెక్ చదువుకున్నాడు. ప్రస్తుతం మహారాష్ట్రలోని బల్లార్‌పూర్ కాలరీస్, ‘34 పిట్స్ మైన్’ జీఎం కార్యాలయంలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా పనిచేస్తున్నారు. రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ .. వంశీకృష్ణతో మాట్లాడుతూ... మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు ఎలా భావిస్తున్నారు?’ అని ప్రశ్నించారు. వంశీకృష్ణ సమాధానమిస్తూ.. అమ్మానాన్నలు కూలీ పనులకు వెళ్లి తనను చదివించారని చెప్పారు.
ఆ జిల్లాలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఫ్రీ కోచింగ్ ఛాన్స్! వివరాలివే..!
'' హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో చదివాను. ఎంతో కష్టపడి బీటెక్ సీటు సాధించాను. 2021లో బీటెక్ పూర్తయింది, గత ఏడాది జూన్‌లో ప్రముఖ బొగ్గు కంపెనీలో ఉద్యోగం దక్కింది. కర్మయోగి ప్లాట్ ఫామ్‌ను సద్వినియోగం చేసుకుని మీతో మాట్లాడే అదృష్టం దక్కినందుకు సంతోషంగా ఉంది.'' అని మోదీతో చెప్పాడు వంశీకృష్ణ. కష్టపడి మంచి ఉద్యోగం సాధించినందుకు అతడిని ప్రధాని మోదీ అభినందించారు.
కాగా, గత ఏడాది ధన్‌తేరస్ సందర్భంగా ప్రధాని మోదీ రోజ్‌గార్ మేళా (Rozgar Mela) పథకాన్ని తీసుకొచ్చారు. 10 లక్షలప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించడమే దీని లక్ష్యమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రోజ్‌గార్ మేళా మొదటి విడతలో 75 వేల మందికి ఉద్యోగాలు లభించాయి. ప్రస్తుతం ఈ పథకం కింద ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉపాధి కోసం దాదాపు 71,000 అపాయింట్‌మెంట్ లెటర్‌లను శుక్రవారం మోదీ వర్చువల్‌గా అందజేశారు. కొత్తగా రిక్రూట్ అయిన సభ్యులు జూనియర్ ఇంజనీర్లు, లోకోమోటివ్ డ్రైవర్లు, టెక్నీషియన్‌లు, పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, సబ్-ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుల్స్, స్టెనోగ్రాఫర్లు, ఆదాయ పన్ను శాఖలో, వివిధ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విద్య , ఆరోగ్య సంబంధిత విభాగాలలో సేవలు అందిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrari kothagudem, Local News, Narendra modi, Telangana