(Kranthi Kumar,News18,Bhadradri kothaguedem)
భద్రాచలం Bhadrachalamఏజెన్సీ ప్రజలను మరోమారు గోదావరిGodavari భయపెడుతుంది. జూలై, ఆగస్టు(July, August) నెలల్లో వచ్చిన వరదలతో గోదావరి పరివాహకం అతలాకుతలం కాగా సెప్టెంబర్(September)లోనూ గోదావరి నీటి మట్టం పెరగడం భయాందోళనకు గురిచేస్తోంది. సోమవారం నీటిమట్టం వేగంగా పెరగడంతో మధ్యాహ్నం 3 గంటలకే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఇది మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేయగా ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ అనుదీప్(Collector Anudeep)అప్రమత్తం చేశారు.
పెరుగుతున్న వరద ప్రవాహం..
గోదావరి ఎగువ ప్రాంతాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు ఉధృతంగా వచ్చి చేరుతోంది. ఆదివారం రాత్రి 36 అడుగులు ఉన్న ప్రవాహం వేగంగా పెరిగి.. సోమవారం ఉదయం 8 గంటలకు 39.50 అడుగులకు, మధ్యా హ్నం 1 గంటకు 42.20 అడుగులకు చేరింది. 3 గం.లకు 43 అడుగుల మేర రావడంతో భద్రాచలం సబ్ కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రం 6 గంటలకు 45.10 అడుగులుగా నమోదైన నీటిమట్టం.. రాత్రి 11 గంటలకు 47.60 అడుగులకు చేరుకుంది. ఇది కాస్త మంగళవారం ఉదయానికి 48 అడుగులకు చేరుకోవడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి వరద ఉధృతి మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
డేంజర్ జోన్‌లో భద్రాద్రి ప్రజలు..
గోదావరి వరద ధాటికి పర్ణశాలలో సీతమ్మ నారచీరల ప్రాంతం ముంపునకు గురైంది. గోదావరి వరద గతంలో ఎన్నడూ లేనంతగా భద్రాచలం ఏజెన్సీ ప్రజలకు, రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఏడాది జూలై 11 నుంచి క్రమంగా పెరిగిన నీటిమట్టం 16వ తేదీన గోదావరి చరిత్రలోనే రెండో అతి పెద్ద ప్రవాహమై 71.6 అడుగులుగా నమోదైంది. వరదల ధాటికి ఏజెన్సీలోని ఏడు మండలాల ప్రజలు సర్వం కోల్పోయారు. ఆగస్టులో మరోసారి మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించి పంటలను ముంచెత్తింది. సెప్టెంబర్‌లో గోదావరి వరద వచ్చే అవకాశం అతి తక్కువనే భావనతో రైతులు పంటలు సాగుచేశారు. ఈ క్రమంలో మళ్లీ నదీ ప్రవాహం పెరుగుతుండడంతో రైతుల్లో మరోమారు గుబులు రేపుతోంది.
అధికారయంత్రాంగం అలర్ట్ ..
కాగా, గోదావరి వరద పెరుగుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ జిల్లా యంత్రాంగానికి సూచించారు. సోమవారం ఆయన భద్రాచలంలో ముంపు మండలాల తహసీల్దార్లు, ప్రత్యేకాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా దుమ్ముగూడెం, చర్ల, అశ్వాపురం, భద్రాచలంలో ముంపు గ్రామాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కలెక్టరేట్ ఫోన్ 08744-241950, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం 08743-232444 నంబర్లలో అత్యవసర సేవల కొరకు ప్రజలు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని ఆయన సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Godavari river, Local News