హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri : భద్రాద్రిలో డంపింగ్ యార్డ్ తరలింపు ఆగినట్లేనా..?

Bhadradri : భద్రాద్రిలో డంపింగ్ యార్డ్ తరలింపు ఆగినట్లేనా..?

X
భద్రాద్రిలో

భద్రాద్రిలో డంపింగ్ యార్డ్ సమస్య

ఇలాంటి వ్యర్థాలు శుభ్రం చేసే ప్రక్రియ చేపడితే తమకు అనారోగ్య సమస్యలు వస్తాయని నిరసన వ్యక్తం చేసిన సంఘాలను కలిసి స్వయంగా వారిని తీసుకెళ్లి వివిధ యూనిట్లను చూపించి అనుమానాలను నివృత్తి చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Bhadrachalam, India

Kranthi Kumar, News 18, Bhadradri

రాష్ట్ర విభజనతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి కనీసం డంపింగ్ యార్డు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ప్రభుత్వ స్థలం లేకపోవడంతో కరకట్టపైనే చెత్తను డంపింగ్ చేస్తున్నారు. ఈ చెత్తను, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చడంతో వెలువడిన పొగతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పరిసర ప్రాంతాల కాలనీవాసులు వాపోతున్నారు. పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో సాంకేతిక పరిజ్ఞానంతో డంపింగ్ యార్డు నిర్మాణం చేపట్టాలని జిల్లా అధికారులు సుదీర్ఘ సమాలోచనలు చేశారు.

స్థానిక మనుబోతుల చెరువు పైభాగాన ఉన్న ఖాళీ స్థలాన్ని ఎంపిక చేసి జిల్లా కలెక్టర్ సూచనల మేరకు పనులు ప్రారంభిం చారు. కానీ నిర్మాణం పనులు చేపట్టిన కొద్ది రోజులకే అక్కడ సమీప కాలనీలో ఉన్న గిరిజనులు అడ్డుకోవడంతో నిర్మాణం పనులు నిలిపివేశారు. దీంతో మళ్లీ కరకట్టపైనే వ్యర్థాలు పోయాల్సిన దుస్థితి నెలకొంది. డంపింగ్ యార్డు నిర్మాణం పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో ప్రశ్నార్ధకంగా మారింది. తడి,పొడి చెత్త వేరు చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం చేపట్టిన పనులు ప్రారంభంలోనే నిలిచిపో యాయి.

Read This : Mulugu: ఈ సారైనా శస్త్ర చికిత్సలు జరిగేనా..? బాధితుల ఎదురుచూపులు

దాదాపు రూ.కోటిపైగా ఖర్చు చేసి సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక నిర్మాణం పూర్తి చేసి తడి, పొడి చెత్త వేరు చేయాలని అధికారులు భావించారు. ముందుగా దాదాపు రూ. 60 నుంచి రూ.70 లక్షల వరకు అంచనాతో పనులు ప్రారంభించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రతిరోజు సేకరించే చెత్త, చెదారాలు 16 నుంచి 20 టన్నుల వరకు పారబోస్తున్నారు. నిరుపయోగంగా పోస్తున్న చెత్త, వ్యర్థాలను వివిధ రకాలుగా ఉపయోగించుకునేలా తడి, పొడి చెత్త లను వేరు చేసి సేకరించాలని అధికారులు భావించారు.

రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులు ఖాళీ స్థలాన్ని ఎంపిక చేయగా ఈ ప్రక్రియ కోసం రూ.కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయించేందుకు జిల్లా కలెక్టర్ అనుదీప్ సుముఖత వ్యక్తం చేశారు. ఇక్కడ ఇలాంటి వ్యర్థాలు శుభ్రం చేసే ప్రక్రియ చేపడితే తమకు అనారోగ్య సమస్యలు వస్తాయని నిరసన వ్యక్తం చేసిన సంఘాలను కలిసి స్వయంగా వారిని తీసుకెళ్లి వివిధ యూనిట్లను చూపించి అనుమానాలను నివృత్తి చేశారు. ఈ ప్రక్రియ చేపడితే ఇక్కడ ఎలాంటి దుర్వాసన వెలువడే అవకాశం ఉండవని సమీప కాలనీ వాసులకు అనారోగ్య సమస్యలు ఉండవని అధికారులు భరోసా కల్పించి అక్కడ ఉన్న గిరిజన సంఘాలకు నచ్చచెప్పారు.

కానీ పనులు మాత్రం ఇంకా మొదలు పెట్టలేదు. ఇదే విషయమై న్యూస్ 18 భద్రాచల గ్రామపంచాయతీ అధికారులను సంప్రదించగా వారు మాట్లాడుతూ అక్కడ తొలుత పనులు చేపట్టినప్పుడు కాలనీ వాసులు అడ్డుకున్నారు. వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని జిల్లా అధికారుల ఆదేశాల మేరకు భరోసా కల్పించాం. ప్రస్తుతం వారి వల్ల ఇబ్బంది లేదు. కానీ అక్కడ నిర్మాణం పనులు చేపట్టే గుత్తేదారు పనులు సక్రమంగా చేయడం లేదు. పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని అతనికి రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. పని చేయకుంటే మళ్లీ వేరే వారికి అప్పగించి పూర్తి చేస్తాం.

First published:

Tags: Local News

ఉత్తమ కథలు