(D. Kranthi Kumar, News18, Bhadradri Kothagudem)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఖమ్మం (Khammam) జిల్లాలో పామాయిల్ సాగు ఎక్కువగా సాగేది. దీంతో అశ్వరావుపేట (Aswaraopeta) కేంద్రంగా ఓ పామాయిల్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ (Telangana)రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పామాయిల్ సాగు విస్తీర్ణత క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, దమ్మపేట మండలంలో పామాయిల్ సాగు (Palm oil cultivation) ఎక్కువగా ఉండటంతో మరో పామాయిల్ ఫ్యాక్టరీని (Palm Oil Factory) నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పంట విస్తీర్ణంకు అనుగుణంగా రైతుల సౌకర్యార్థం భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా దమ్మపేట మండలంలోని అప్పారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం రూ.10 కోట్లు నిధులను కేటాయించింది.
రాష్ట్ర ప్రభుత్వ పూచికత్తుతో నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి రూ. 70 కోట్ల రుణాన్ని టీఎస్ ఆయిల్‌ఫెడ్‌కు మంజూరు చేయడంతో 2015లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని అప్పారావుపేటలో (AppaRao pet) నూతన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరిగింది. 2016లో పనులను ప్రారంభించి పూర్తి చేయగా, ఈ ఫ్యాక్టరీ నిర్మాణంలో మెకానికల్ పనులకు రూ. 52 కోట్లు, సివిల్ పనులకు రూ. 22 కోట్లు ఖర్చు చేయగా, మొత్తం 41 ఎకరాల భూమిని స్థానిక రైతుల నుంచి సేకరించి ఈ ఫ్యాక్టరీని నిర్మించారు.
గంటకు 30 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ప్రారంభమైన అప్పారావుపేట ఫ్యాక్టరీ 2020-21 సంవత్సరంలో 45 టన్నుల సామర్థ్యానికి పెంచారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పామాయిల్ సాగు విస్తీర్ణం పెరగడం, ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యానికి మించి గెలలు వస్తుండడంతో తెలంగాణ ఆయిల్‌ఫెడ్ (Telangana Oil Fed) యాజమాన్యం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని మరింత ఆధునీకరిస్తూ ఓఈఆర్ పెంచడంలో సఫలీకృతమవుతున్నది.
మలేషియా నుంచి దిగుమతి..
2021 సంవత్సరంలో రూ.1 కోటితో ఈఎఫ్‌బీ (ఎమ్టీ ప్రూట్ బంచ్) ఫైబర్ ప్రస్ అనే నూతన పరికరం ఏర్పాటు చేసింది. ఇది ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేట్ (ఓఈఆర్) పెంచడానికి దోహదపడడంతో మరో రెండు పరికరాలను మలేషియా నుంచి దిగుమతి చేసుకుంది యాజమాన్యం. వీటి అమరిక పూర్తి కావడంతో ఓఈఆర్ మరింత పెరిగింది. స్థానికంగా పామాయిల్ సాగు పెరిగి రైతుల నుంచి నేరుగా గెలలు వస్తుండడంతో రూ. 17.7 కోట్లతో గంటకు 60 మెట్రిక్ టన్నుల ఆయిల్ ఉత్పత్తి చేసేలా ఫ్యాక్టరీని మరింత ఆధునికీకరించారు. ఈ నేపథ్యంలో దేశంలోని పామాయిల్ పరిశ్రమలకే అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ గీటురాయిగా నిలుస్తుంది.
Thieves: దొంగల వింత డిమాండ్.. ఐదుగురం దొంగతనం చేశాం.. ఇద్దరినే పట్టుకుంటే ఎలా?
ఇదిలా ఉండగా ఉత్పత్తి ప్రారంభించిన నాటి నుంచి ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేట్ (ఓఈఆర్) సాధనలో వరుస రికార్డులు సృష్టించింది. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో వ్యాప్తంగా రైతులు పామాయిల్ గెలలను అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీకి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ ఓఈఆర్ కూడా పెరుగుతూ వచ్చింది. పామాయిల్ తయారీలో అప్పారావుపేట ఫ్యాక్టరీల్లోని ఓఈఆర్‌ను పరిశీలిస్తే 2016-17 ఆయిల్ ఇయర్ నుంచి అప్పారావుపేట ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభమైంది.
2016-17లో అప్పారావుపేటలో ఫ్యాక్టరీకి 18.65, 2017-18లో 18.94, 2018-19లో 18.45, 2019-20లో 18.68, 2020-21లో 19.22 ఓఈఆర్ వచ్చింది. ఆయిల్‌పాం గెలల ధర నిర్ణయం అప్పారావుపేట ఫ్యాక్టరీలోని ఓఈఆర్ ఆధారంగానే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతుండడం ఈ ఫ్యాక్టరీ ఘనతగానే చెప్పుకోవచ్చు. ఈ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఆయిల్‌పాం సాగు, కొత్త ఫ్యాక్టరీల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, BUSINESS NEWS, Farming, Local News