Home /News /telangana /

BHADRADRI KOTHAGUDEM OWN PARTY DISTRICT LEADERS HARASSING KOTTAGUDEM MUNICIPAL CHAIRPERSON SNR

Kottagudem: చైర్‌పర్సన్‌ చీర లాగుతారా..అసలు వాళ్లేం మనుషులు

(దుశ్సాసనపర్వం )

(దుశ్సాసనపర్వం )

Kottagudem: అధికార పార్టీకి చెందిన ఓ మహిళ నాయకురాలికి అవమానం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్‌ని టీఆర్‌ఎస్‌ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లే ఆమె చీర జారిపోయే విధంగా వెనుక నుంచి బైక్‌లోతో టీఆర్‌ఎస్ నేతలు ఇబ్బందులకు గురి చేశారని మహిళ కన్నీటిపర్యంతమైంది.

ఇంకా చదవండి ...
    (G.Srinivasreddy,News18,Khammam)

    సినిమాలో చూపించినట్లుగా రాజకీయాలు అత్యంత హేయంగా మారుతున్నాయి. ఈర్శ్య, అసూయలతో పాటు అవమానం చేయాలన్న సంకుచిత్వపు ఆలోచనతో ఓ మహిళ నాయకురాలి పరువును నడి బజారుపై తీశారు. చిన్న,చితక నాయకురాలు కాదు మున్సిపల్‌ చైర్ పర్సన్ అంటే ప్రోటోకాల్ ప్రకారం చూసుకుంటే ఆమె పట్టణ ప్రధమ పౌరురాలు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు, తోటి నాయకుల ప్రోద్భలంతో నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లేతే సొంత పార్టీ నేతలే దుర్మార్గంగా ప్రవర్తించారు. క్రమశిక్షణ తప్పి, మహిళ అనే గౌరవం కూడా లేకుండా నీచానికి ఒడిగట్టారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం (Kottagudem)మున్సిపల్ చైర్‌ పర్సన్‌(Municipal Chairperson)కాపు సీతామహాలక్ష్మి(Kapu Sitamahalakshmi)కి జరిగిన అవమానం ఇది. పార్టీ అధిష్టానం పిలుపు రాష్ట్ర వ్యాప్త నిరసనల్లో భాగంగా సీతామహాలక్ష్మి కొత్తగూడెంలో టీఆర్‌ఎస్‌ (TRS)శ్రేణులు నిర్వహించిన బైక్ ర్యాలీ(Bike rally)లో పాల్గొన్నారు. కార్యక్రమం పార్టీ నిర్వహించినదే అయినప్పటికి పార్టీలో సొంత నాయకులే దుశ్సాసపర్వానికి తెర తీశారు. తన కుమారుడు బైక్‌పై వెనక కూర్చున్న సీతామహాలక్ష్మిని ఫాలో అయ్యారు మిగిలిన మహిళా కౌన్సిలర్ల భర్తలు. వాళ్లు కూడా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వాళ్లే కావడంతో ఆమె ఏమి చేయలేని పరిస్థితి తలెత్తింది. చైర్‌ పర్సన్‌ చీరకు తాగిస్తూ బైక్‌లు నడుపుతూ ఆమె కిందపడే విధంగా కవ్వించారు. ఓ మహిళా ప్రజాప్రతినిధిని వదిలేయండి అంటూ బ్రతిమిలాడుతున్నా వినిపించుకోకుండా ఆమెను తీవ్రంగా అవమానించారు. చివరకు కన్నీరు పెట్టించారు.

    చైర్‌ పర్సన్‌ చీరనే లాగేస్తారా..
    స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మద్దతుతో సీతామహాలక్ష్మి చైర్‌ పర్సన్‌గా ఎన్నికయ్యారు. పార్టీలో చురుకైన నాయకురాలిగా పనిచేస్తూ అందర్ని కలుపుకుపోయే మహిళా నాయకురాలు కావడంతో ఆమెకు పార్టీలో, జిల్లా నాయకులల్లో మంచి పేరుంది. అలాంటి నాయకురాలు కుమారుడి బైక్‌పై కూర్చొని పార్టీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమంలో పాల్గొంటే తన తోటి నేతలు, తోటి కౌన్సిలర్ల భర్తలు ఇంత దారుణంగా ప్రవర్తించడంపై ఆమె తీవ్ర వేదనకు గురయ్యారు. పార్టీ నాయకుల ముందు తన గోడు వెళ్లబోసుకొని కన్నీరు పెట్టుకున్నారు.

    ఆడమనిషిని అవమానిస్తారా..
    స్త్రీని గౌరవించమనే సంప్రదాయం ఉన్న దేశంలో అది కూడా తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెంలో ఓ మహిళా ప్రజాప్రతినిదికి ఇంతటి అవమానం జరగడం సరైంది కాదు. ఇలాంటి సంస్కృతి నీచమైనదిగానే రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. సొంత పార్టీ నాయకురాలిని అదే పార్టీ కార్యకర్తలు, శ్రేణులు అవమానానికి గురి చేయడం చూస్తుంటే టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లోనే కొందరు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇదంతా గ్రూప్‌ రాజకీయాలుగానే కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొత్తగూడెం టీఆర్‌ఎస్‌లో ఒకే పార్టీ వర్గాలుగా మారిపోవడంతో అగమ్యగోచరంగా తయారైంది. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం అయితే పార్టీ ప్రతిష్ట గంగపాలైనట్లేనని సొంత పార్టీ నేతలే అంటున్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Badradri, Politics, VIRAL NEWS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు