హోమ్ /వార్తలు /తెలంగాణ /

పర్ణశాలపై ఇంత నిర్లక్ష్యమా..? పవిత్ర ప్రదేశాన్ని పట్టించుకోరా..?

పర్ణశాలపై ఇంత నిర్లక్ష్యమా..? పవిత్ర ప్రదేశాన్ని పట్టించుకోరా..?

X
పర్ణశాల

పర్ణశాల అభివృద్ధిని పట్టించుకోని అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల రామాలయం భక్తులను ఆకట్టుకుంటోంది. భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానానికి (Bhadrachalam Temple) అనుబంధంగా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Bhadrachalam | Telangana

Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల రామాలయం భక్తులను ఆకట్టుకుంటోంది. భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానానికి (Bhadrachalam Temple) అనుబంధంగా ఉన్నాయి. ఆలయాన్ని యాత్రికులు, భక్తులు మెచ్చే రీతిలో దేవస్థానం అధికారులు మాత్రం ఇక్కడ సదుపాయాలను, వసతులను కల్పించలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం పర్ణశాల రామాలయా నికి మరిన్ని హంగులు కల్పించి పర్యాటక కేంద్రంగా రూపుదిద్దాలనే ఉద్దేశంతో ప్రసాద్(తీర్థయా త్రల పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి) పథకం అమ లుకు శ్రీకారం చుట్టింది. గత శ్రీరామనవమి నాటికే అధికా రులు సర్వే పనులు పూర్తి చేశారు. చివరకు ఎప్పుడు మంజూరవుతాయో, పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియని దుస్థితి.

పర్ణశాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం కింద నిధులు మంజూరు చేయాలని నిర్ణయించింది. అధికారులు సుమారు రూ.16.63 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి పంపారు. రెండేళ్లయినా ఇంతవరకు నయా పైసా మంజూరు కాలేదు. ఇక్కడ ఇద్దరే అర్చకులు, ఓ వంట అర్చకులు ఉన్నారు. ఒక్కోసారి వంట అర్చకులు సెలవు పెడితే భక్తులకు పులిహోర ప్రసాదం అందడం లేదు.

ఇది చదవండి: కోలాహలంగా రాజా తూము లక్ష్మీ నరసింహ దాసు జయంతి

ఇటీవల సిబ్బంది ప్రతీరోజు భద్రాచలం దేవస్థానం నుంచి 60 పులిహోర ప్యాకెట్లు తీసుకువచ్చి చాలీచాలని ప్రసాదం భక్తులకు అందించేవారు. సుదూర ప్రాంతాల నుంచి శ్రీస్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఓ రోజు బస చేయడానికి సత్రాలు లేకపోవడంతో ఆరుబయట నిద్రిస్తున్నారు. పర్ణశాల నుంచి సీతవాగు వైపు సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.

ఇది చదవండి: కేటీఆర్ మెచ్చిన స్కూల్ ఇదే..! అంతలా ఏముంది అక్కడ..?

పర్ణశాల నుంచి సీతవాగు మీదుగా సీతానగరం వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసంఐటీడీఏ ఆధ్వర్యంలో రూ.1.10 కోట్లు ప్రతి పాదనలు చేశారు. ఆలయంలో సీసీ కెమెరాల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఉచిత దర్శనాలకు, టిక్కెట్ దర్శనాలకు ఒకే క్యూలైన్ ఉండడంతో భక్తులకు స్వామివారి దర్శనం సమయంలో ఇబ్బంది. తప్పడం లేదు. వృద్ధులకు, వికలాంగులకు వీల్చైర్ లేకపోవడంతో దర్శనాల సమయంలో వారికి ఇబ్బంది కలుగుతుంది.

ఇది చదవండి: ఈ స్కూల్‌కి మంత్రివర్గం.. పిల్లలే మంత్రులు..! ఎక్కడుందంటే..!

పంచవటి కుటీరం ఓ పక్కకు ఒరిగిపో యింది. వేద పఠనం జరగడం లేదు. ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, ముఖ్య అర్చకులు శ్రీరామనవమి, ముక్కోటి సమయాల్లోనే వస్తున్నారు. తప్పితే మిగిలిన రోజుల్లో రావడంలేదు. మేళం, తాళం, శ్రుతి, మంగళ వాయిద్యాలు, డప్పు, సన్నాయి బృందాలు శ్రీరామనవమి, ముక్కోటి, పునర్వసు కల్యాణం సమయంలోనే వస్తున్నారు. పర్ణశాల రామాలయంలో ఈ బృందాలు నిత్యం ఉండేలా ఏర్పాటు చేయాలి. శ్రీస్వామి వారి దర్బారు సేవ, పవళింపు సేవలు చేయడంలేదు.

భక్తులకు స్వామివారిపై విశ్వాసం పెంచేందుకు ప్రచారం కోసం కనీసం రామరధం కూడా పర్ణశాల రామా లయం వైపు వచ్చిన దాఖలాలు లేవు. పర్యాటక తీర్చిదిద్దేందుకు.. భక్తుల కోసం సత్రాలు నిర్మించాలి. రామాలయం ఆవరణలో చుట్టూ టైల్స్ ఫ్లోరింగ్ ఏర్పాటు, ఆదాయ వనరుల నిమిత్తం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, భక్తుల, యాత్రికుల నీడ కోసం షెడ్ల ఏర్పాటు, గోదావరి నదిలో బోటింగ్ షికారు వంటివి ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం.

First published:

Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana