(Kranthi Kumar, News18, Bhadradri Kothagudem)
భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో (Government Medical College) సీట్ల భర్తీపై గత కొంతకాలంగా కొనసాగుతున్న సందిగ్ధకు తెరపడింది. ఇక్కడి కళాశాలలో 150 సీట్ల (Seats) భర్తీకి అనుమతులు ఇస్తూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసి) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభం అవుతున్నాయి. విద్యార్థులకు వైద్య విద్య భారం కాకూడదనే ఆలోచనతో దేశ వ్యాప్తంగా అవసరమైన చోట మెడికల్ కళాశాలలు నిర్మించ తలపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాకి మెడికల్ కళాశాల (Medical college) మంజూరు అయింది.
కొత్తగూడెం, పాల్వంచ మధ్యనున్న కేఎస్ఎం (కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్) సమీపంలోని 30 ఎకరాల స్థలంలో యుద్ధ ప్రాతిపదికన భవన నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఇటీవల ఆసుపత్రిని (Hospital) సందర్శించిన ఎన్ఎంసీ (MNC)బృందం ఇక్కడి మెడికల్ కళాశాలకు అనుమతులు (Permissions) మంజూరు చేసింది. 150 ఎంబీబీఎస్ సీట్లు (MBBS Seats) భర్తీ చేయాలని ఉత్వర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో వైద్యవిద్య అభ్యసించాలని నగరాలు, ఇతర రాష్ట్రాలు, విదేశాలకు వెళ్లే జిల్లా వాసులకు వైద్య విద్య చేరువైంది.
భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంగారెడ్డి, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, మంచిర్యాల, రామగుండంలో మెడికల్ కాలేజీ ఏర్పాట్లకు అనుమతులు వచ్చాయి. ఇదిలా ఉండగా నూతనంగా అనుమతులు లభించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరంలో అనాటమీ (Anatomy), ఫిజియోథెరపీ (Physiotherapy), బయో కెమిస్ట్రీ (Biochemistry) విభాగాలలో విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వనట్లు తెలుస్తుంది.
ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్లు (MBBS Seats) మంజూరు కాగా ఇందులో విద్యార్థులకు బోధించేందుకుగానూ అసోసియేట్ ప్రొఫెసర్లు – 4, ప్రొఫెసర్లు – 11, అసిస్టెంట్ ప్రొఫెసర్లు – 10, సీనియర్ రెసిడెంట్ వైద్యులు – 37, మందిని ప్రభుత్వం నియమించినట్లు తెలుస్తుంది. దీంతో జిల్లా ఆస్పత్రిలో వైద్యుల సంఖ్య కూడా పెరిగినట్లైంది. అంతేకాక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుతో జిల్లా ఆసుపత్రితో పాటు రామవరం మాతాశిశు సంరక్షణ కేంద్రంలో 330 పడకలు అందుబాటులోకి రానున్నాయి. రూ.130 కోట్ల నిధులతో మాతాశిశు కేంద్రం, నర్సింగ్ కళాశాల, మెడికల్ కాలేజీ భవన సముదాయం రూపుదిద్దుకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.