హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadadri: నెహ్రూ కప్ క్రికెట్ పోటీలు.. 27 సంవత్సరాల చరిత్రగల టోర్నమెంట్

Bhadadri: నెహ్రూ కప్ క్రికెట్ పోటీలు.. 27 సంవత్సరాల చరిత్రగల టోర్నమెంట్

ఫెమస్ క్రికెట్ టోర్నమెంట్

ఫెమస్ క్రికెట్ టోర్నమెంట్

Telangana: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాభద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ప్రతి ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక నెహ్రూ కప్ జాతీయ స్థాయి క్రికెట్ పోటీలు డిసెంబర్ 4 నుంచి 18 వరకు నిర్వహిస్తున్నట్లు నెహ్రు కప్ నిర్వాహకులు వెల్లడించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Kranthi Kumar, News 18, Bhadradri

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాభద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ప్రతి ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక నెహ్రూ కప్ జాతీయ స్థాయి క్రికెట్ పోటీలు డిసెంబర్ 4 నుంచి 18 వరకు నిర్వహిస్తున్నట్లు నెహ్రు కప్ నిర్వాహకులు వెల్లడించారు.27వ సారి కూడా నెహ్రూ కప్ జాతీయ స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించటం భద్రాచలం ఏజెన్సీకే తలమానికమని తెలిపారు.

ఈ టోర్నమెంట్లో విజేత నిలిచిన టీమ్ కు రూ.35,000, రన్నర్ గానిలిచిన టిమ్ కు రూ.25,000లతో పాటు ట్రోపీలు, వ్యక్తిగత అవార్డులు ఇవ్వటం జరుగుతుందని పేర్కొన్నారు. టోర్నమెంట్ లో ఆడేందుకు ఆసక్తిగల పేరుందిన క్రికెట్ క్లబ్బులు నవంబర్ 30లోగా కన్వినర్ నెహ్రూ క్రికెట్ టోర్నమెంట్ 9440101108 తమ ఎంట్రీలను పంపాలని సూచించారు. టోర్నమెంటు విజయవంతం చేసేందుకు పట్టణ ప్రజలు, ప్రముఖులు ఎప్పటిలాగే తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు.

ఏజెన్సీలోనే ప్రతిష్టాత్మకగా నిలిచే నెహ్రూ కప్

డిసెంబర్ వచ్చేసిందంటే చాలు ఏజెన్సీలో నెహ్రూ కప్ సందడి మొదలవుతుంది. క్రికెట్ క్రీడాకారుల పండుగ ప్రారంభమవుతుంది. భద్రాచలం ఏజెన్సీలో నెహ్రూ కప్ క్రికెట్ పోటీలు గత 27 సంవత్సరాలుగా నిర్వహించడం గమనార్హం. వాతాడి దుర్గా అశోక్ 1994లో నెహ్రూ కప్ క్రికెట్ పోటీలను ప్రారంభించగానాటి నుంచి నేటి వరకు నెహ్రూ కప్ క్రికెట్ పోటీలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని జూనియర్ మైదానం వేదికగా జరిగే ఈ నెహ్రూ కప్ క్రికెట్ పోటీలు గడిచిన 27 ఏళ్లలో కేవలం రెండుసార్లు మాత్రమే అనివార్య కారణాలతో టోర్నమెంటు జరగలేదు. పట్టణంలోని ప్రముఖులు, పలు స్వచ్ఛంద సంస్థల ఉమ్మడి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ టోర్నమెంట్లోపాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పేరందున్న క్రికెట్ క్లబ్బులు పోటీ పడుతుంటాయి.

రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల సైతం ఈ టోర్నమెంట్లో పాల్గొనడం విశేషం. ఎందరో క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఈ నెహ్రూ కప్ క్రికెట్ టోర్నమెంట్. 1994 నుంచి కొనసాగుతుండటంతో క్రీడాకారులు ఈ టోర్నమెంట్ లో పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ టోర్నమెంట్ లో ఆడిన క్రీడాకారులు ఎందరో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. నెహ్రూ కప్ లో ఆడటమే ఓ మహాభాగ్యంగా క్రీడాకారులు పరితపిస్తుంటారు. ప్రధానంగా యువత నెహ్రూ కప్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఏజెన్సీలో నెహ్రూ కప్ ఓ సుందర స్వప్నంగా క్రీడాకారులు భావిస్తారు.

First published:

Tags: Bhadradri kothagudem, Local News, Telangana

ఉత్తమ కథలు