Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
లోక కళ్యాణార్ధం దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి శ్రీ సీతా రాముల కళ్యాణోత్సవానికి (Bhadrachalam Sri Sitharama Kalyanam) ముహూర్తం కుదిరింది. ఈ మేరకు వైదిక కమిటీ తేదీలను ఖరారు చేసింది. ప్రతీ ఏటా జరిగే సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఈ సారి కూడా అంగరంగ వైభ వంగా నిర్వహించనున్నారు. మార్చి 30వ తేదిన శ్రీరామ నవమి, మార్చి 31వ తేదిన పుష్కర మహాపట్టాభిషేకం నిర్వహిస్తారు. ఈ ఏడాది నిర్వ హించే పట్టాభిషేకానికి ప్రత్యేక ఉంది. 12 ఏళ్లకు ఒకసారి జరిపే పట్టా భిషేకాన్ని పుష్కర పట్టాభిషేకం అంటారు. ఇందుకోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాజాధిరాజ వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు. అదే విధంగా మార్చి 22వ తేది మొదలుకుని ఏప్రిల్ 5వ తేది వరకు వసంత ప్రయుక్త శ్రీరామ నవమి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు జరుపనున్నారు. అందులో భాగంగా మార్చి 22 నుంచి 31 వరకు పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక ప్రయుక్త శ్రీ రామాయణ మహాక్రతువు నిర్వహించనున్నారు. మార్చి 22న శోభకృత్ నామ సంవత్సర ఉగా దీని పురస్కరించుకొని పంచాంగ శ్రవణం, తిరువీధిసేవలు ప్రారంభమవుతాయి.
అదేరోజు శ్రీ రామాయణ మహాక్రతువుకు అంకురార్పణ చేస్తారు. మార్చి 26న బ్రహ్మోత్సవాలకు అంకురా రోపణం చేయనున్నారు. 27న ధ్వజపట భద్రక మండల లేఖనం, గరుడ దివాసం, 28న అగ్ని ప్రతిష్ఠ ధ్వజారోహణం, చతుస్తానార్చనం, బేరిపూజ, దేవత ఆహ్వానం, బలిహరణం నిర్వహిం చనున్నారు. 29 ఎదుర్కోలు సేవ, 30న శ్రీరామనవమి సందర్భంగా మిథిలా స్టేడియంలో సీతారామచంద్రస్వామి కల్యాణం నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం శ్రీరామ పున ర్వసు దీక్ష ప్రారంభంకానుంది.
31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం నిర్వహించ నున్నారు. ఏప్రిల్ ఒకటిన సదస్యం, రెండున తెప్పోత్సవం, చోరోత్సవం మూడున ఊంజల్ సేవ, నాలుగున వసంతోత్సవం, ఐదున చక్రతీర్థం, పూర్ణాహుతి, సార్వభౌమసేవ, ధ్వజావరో హణం, ద్వాదశ ప్రదక్షిణలు, ఆరాధనలు, శ్రీ పుష్పయాగం నిర్వహించనున్నారు.
నవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి 22 నుంచి ఏప్రిల్ 5 వరకు నిత్యకల్యాణాలకు విరామం ఇవ్వనున్నారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 11వరకు పవళింపు సేవలు నిర్వహించరు. ఏప్రిల్ 12న నూతనపర్యం కోత్సవం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 27న శ్రీరామ పునర్వసు దీక్ష విర మణ, 28న పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా 2020, 2021వ సం.లో కోడ్ ఆంక్షలతో రాముల వారి పెళ్లి తంతు అంతరాలయంలో అతి కొద్దిమంది పెద్దల సమక్ష్యంలో జరిపించారు.
2022లో కోవిడ్ ఇబ్బందులు తగ్గుముఖం పట్టడంతో రామదాసు శాసనం ప్రకారం ఆరుబయట ఉన్న మిథిలా స్టేడియంలో కళ్యాణమహోత్సవాన్ని తిరిగి ప్రారంభించారు. ఈ సారి కూడా ఇబ్బందు లేవీ లేకపోవడంతో ఖర్చుకు వెనుకాడకుండా సీతారాములు కళ్యాణోత్స వాన్ని అత్యంత ఘనంగా జరిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తు న్నారు. గత ఏడాది నవమి సందర్భంగా 170 క్వింటాళ్ల తలంబ్రాలు సిద్ధం చేశారు. 3 లక్షల లడ్డూ ప్రసాదాలు సిద్ధం చేశారు.
వీటి కోసం 30 లడ్డూ కౌంటర్లు, 50 తలంబ్రాల కౌంటర్లన భక్తులకు అందుబాటు లోనికి తెచ్చారు. ఈ సారి భక్తులు సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో అందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నారు. ఈ ఏడాది నవమికి సుమారు రూ.2 కోట్ల వరకు వెచ్చించి స్వామివారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవోపేతంగా జరిపించాలని, భక్తులకు సకల సౌకర్యాలతో పాటు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని భావిస్తున్నట్ల తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana