హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri: నోరూరించే చికెన్ సాంబర్ తినాలంటే ఇక్కడికి వెళ్లాల్సిందే.., వెరైటీ రుచులతో ఆకర్షిస్తున్న హోటల్

Bhadradri: నోరూరించే చికెన్ సాంబర్ తినాలంటే ఇక్కడికి వెళ్లాల్సిందే.., వెరైటీ రుచులతో ఆకర్షిస్తున్న హోటల్

భద్రాచలంలో

భద్రాచలంలో ఆకట్టుకుంటున్న చికెన్ సాంబార్

కరోనా లాక్ డౌన్ (Corona Lockdown) దొరికిన ఖాళీ సమయాన్ని కొందరు ఎంతో చక్కగా వినియోగించుకున్నారు. తమ క్రియేటివిటీకి పదును పెడుతూ సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి సక్సెస్ అవుతున్నారు. వినూత్న ఆలోచనలు, కొత్త తరహా ప్రయోగాలు జనాన్ని కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Bhadrachalam, India

  Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

  కరోనా లాక్ డౌన్ (Corona lockdown) ‌లో దొరికిన ఖాళీ సమయాన్ని కొందరు ఎంతో చక్కగా వినియోగించుకున్నారు. తమ క్రియేటివిటీకి పదును పెడుతూ సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి సక్సెస్ అవుతున్నారు. వినూత్న ఆలోచనలు, కొత్త తరహా ప్రయోగాలు జనాన్ని కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు మార్కెట్లో సక్సెస్ కావాలనుకుంటే రొటీన్‌కి భిన్నంగా ఆలోచించాల్సిందే. అందులోనూ హోటల్స్, రెస్టారెంట్ వంటి ఫుడ్ బిజినెస్‌లో ఆ క్రియేటివిటీ ఒక అడుగు ముందుండాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) భద్రాచలం (Bhadrachalam) పట్టణానికి చెందిన పలువురు యువకులు హోటల్ వ్యాపారాన్ని ప్రారంభించి రొటీన్‌కి భిన్నమైన మెనూని కస్టమర్లకు అందజేస్తూ సక్సెస్ అవుతున్నారు. ఒకవైపు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారాన్ని కస్టమర్లకు అందిస్తూ మరోవైపు మెట్రో సిటీలకు పరిమితమైన పలు వంటకాలను గ్రామీణ ప్రజలకు సైతం చేరువ చేస్తున్నారు.

  భద్రాచలం పట్టణంలోని ఐటిడిఏ ప్రధాన రహదారికి పక్కనే 'మిస్టర్ పులావ్ (Mr.Pulav) పేరుతో నూతన హోటల్ ‌ను ప్రారంభించారు కొందరు యువకులు. హోటల్ ప్రారంభించి ఏడాది గడవక ముందే చుట్టుపక్కల గ్రామాల నుంచి సైతం భోజన ప్రియుల్ని ఆకర్షిస్తూ ముందుకు పోతున్నారు. సాధారణంగా హోటల్లో లభించే వంటకాలకు భిన్నంగా.. వెరైటీ వంటకాలు వడ్డిస్తూ కస్టమర్లను ఆకర్శించడంతో పాటు మంచి వ్యాపారాభివృద్ధి సాధిస్తున్నారు. అయితే ఎంత నాణ్యమైన వంటకమైనా ఏదో ఒక వెరైటీ లేకపోతే కొన్ని రోజులకే బోర్ కొడుతోంది.

  ఇది చదవండి: ప్రకృతి వ్యవసాయంతో రెండు చేతులా సంపాదిస్తున్న రైతు.. ఆ సీక్రెట్ ఏంటో మీరే చూడండి..

  దీంతో మిస్టర్ పులావ్ నిర్వాహకులు తక్కువ ధరలో నాణ్యమైన చికెన్ సాంబార్ అనే వంటకాన్ని తయారు చేస్తూ లాభాలను గడిస్తున్నారు. కేవలం రూ. 130ల ధరతో వేడి వేడి చికెన్ సాంబార్ వంటకాన్ని కస్టమర్లకు అందిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ వంటకం ఎంతో రుచిగా ఉండడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ చికెన్ సాంబార్ తినేందుకు మిస్టర్ పలావ్ హోటల్ ‌కు క్యూ కడుతున్నారు. రుచికి రుచి, నాణ్యతకు నాణ్యతగా, తక్కువ బడ్జెట్‌లో టేస్టీ ఫుడ్ దొరుకుతుండడంతో మధ్యతరగతి కుటుంబాలు, భోజన ప్రియులు వీకెండ్ ‌లో ఇక్కడికి వచ్చి ఫుడ్ ‌ని ఆస్వాదిస్తున్నారు.

  ఈ మిస్టర్ పులావ్ హోటల్లో సాంబార్ చికెన్ కాకుండా చికెన్ పలావ్, చికెన్ మంచూరియా, మటన్ పలావ్, ఫ్రాన్స్ పలావ్, ఫిష్ పలావ్ తదితర వంటకాలు కూడా అందుబాటు ధరలో సర్వ్ చేస్తున్నారు. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే చుట్టుపక్కల గ్రామాల్లో గుర్తింపు తెచ్చుకున్న మిస్టర్ పలావ్ హోటల్‌కు ప్రతిరోజు జొమాటో ద్వారా కూడా కస్టమర్లు ఆర్డర్లు ఇస్తుండడం గమనార్హం. ఇంకా ఇతర ఫంక్షన్లకు సైతం ఆర్డర్లపై సరఫరా చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో గొల్లగట్ట రోడ్డులోని ప్రధాన రహదారి పక్కనే ఉంది ఈ మిస్టర్ పలావ్ హోటల్. ఆర్డర్ చేసేందుకు, పూర్తి వివరాలకు 7989106103 సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Bhadradri kothagudem, Chicken, Local News, Telangana

  ఉత్తమ కథలు