హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadrachalam: భద్రాచలంలో హై అలర్ట్​.. ముంపు ప్రాంతాల ప్రజలకు అధికారుల సూచనలు ఇవే..

Bhadrachalam: భద్రాచలంలో హై అలర్ట్​.. ముంపు ప్రాంతాల ప్రజలకు అధికారుల సూచనలు ఇవే..

bhadrachalam in high alert

bhadrachalam in high alert

వరద ముంపు బాధితులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  కలిసి ధైర్యం కల్పించారు.ఎగువ ప్రాంతాల్లో వచ్చే రెండు రోజుల్లో గోదావరి డిశ్చార్జి 21 లీ క్యూసెక్కులు, 64 అడుగులు దాటే అవకాశం ఉందన్న కలెక్టర్.

(Srinivasareddy , News 18, Khammam)

భద్రాచలంలోని సారపాక BPL పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలోని వరద ముంపు బాధితులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  కలిసి ధైర్యం కల్పించారు. అనంతరం బూర్గంపహాడ్ లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఎర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. ఆనంతరం బూర్గంపహాడ్ గ్రామంలో క్రమంగా వరద నీరు చేరడంతో నిర్వాసితులకు తక్షణమే ఖాళీ చేయాలని మంత్రి కోరారు. పునరావాస కేంద్రానికి వెళ్ళాలని, అక్కడ అన్ని వసతులు కల్పించమని పేర్కొన్నారు. తెలిసీ ప్రమాదాన్ని కొనితెచ్చుకోవొద్దు అని కోరారు. మీకు ఎలాంటి ఇబ్బంది లేదని రెండు రోజులు ఓపిక గా ఉండాలని సూచించారు. మంచి ఆహారం, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యాలు ఉన్నాయని వివరించారు. అక్కడే ఎర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అవసరమైన మందులు ఏమైనా కావాలంటే తక్షణమే జిల్లా వైద్యాధికారి సమాచారం ఇచ్చి వెంటనే తెప్పించుకోవాలని సూచించారు. వారి వెంట ప్రభుత్వ విప్ రేగ కాంతారావు, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మాజి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ , తెల్లం వెంకట్రావు తదితరులు ఉన్నారు .

డేంజర్ జోన్ లోకి భద్రాచలం...

భారీ వర్షాల కారణంగా కీలక ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ అనుదీప్. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలుకు మేడిగడ్డ, సమ్మక్క సాగర్ వరద నీటి ఉధృతి పెరిగింది.  ఎగువ ప్రాంతాల్లో వచ్చే రెండు రోజుల్లో గోదావరి డిశ్చార్జి 21 లీ క్యూసెక్కులు, 64 అడుగులు దాటే అవకాశం ఉందన్న కలెక్టర్. ప్రజలను ఫ్లడ్ క్యాంప్ లో చేర్చాలన్న కలెక్టర్. గోదావరి మట్టం కోసం సిద్ధం కావాలని కలెక్టర్ పిలుపు. చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, పినపాక, మణుగూరు, బూర్గంపాడు, భద్రాచలంలోని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను నేడే తరలించి, సహాయ శిబిరాలన్నీ ఏర్పాటు చేయాలన్న కలెక్టర్. దుమ్ముగూడెంలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని సిద్ధంగా ఉంచాలి,  దేశీ పడవలను, ఈతగాళ్లను, బృందాలను వెంటనే అప్రమత్తం చేయాలన్న కలెక్టర్.

First published:

Tags: Bhadrachalam, Floods, Khammam, Rainfall, Telangana

ఉత్తమ కథలు