హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri: 0.8 సెంటీమీటర్ల సూక్ష్మగణపతి.. మట్టితో అతిచిన్న వినాయకుడి విగ్రహం చేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్..

Bhadradri: 0.8 సెంటీమీటర్ల సూక్ష్మగణపతి.. మట్టితో అతిచిన్న వినాయకుడి విగ్రహం చేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్..

గణేష్

గణేష్ విగ్రహాలు చేస్తున్న ముక్తీశ్వర్

Bhadradri: వినాయక చవితి వచ్చిందంటే చిన్నాపెద్దా అంతా కలిసి ఆనందోత్సాహాల నడుమ పండుగ జరుపుకుంటుంటాము. ఇక పల్లెటూరిలో అయితే.. చిన్నారులు ఉదయాన్నే లేచి, స్నానం చేసి, పుట్టమన్ను తెచ్చి వినాయకుడి ప్రతిమ తయారు చేస్తారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Bhadrachalam, India

  Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem


  "ప్రకృతిలో లభించే గడ్డి పరకైనా సమర్పిచు, మట్టి కణంలో నన్ను చూసుకుంటూ భక్తితో కొలిస్తే చాలు" అంటూ లంబోదరుడు తన భక్తులకు చెప్పినట్లు పురాణ కథల్లో విన్నాం. వినాయక చవితి వచ్చిందంటే చిన్నాపెద్దా అంతా కలిసి ఆనందోత్సాహాల నడుమ పండుగ జరుపుకుంటుంటాము. ఇక పల్లెటూరిలో అయితే.. చిన్నారులు ఉదయాన్నే లేచి, స్నానం చేసి, పుట్టమన్ను తెచ్చి వినాయకుడి ప్రతిమ తయారు చేస్తారు. అనంతరం ప్రకృతిలో లభించే పూలు, పండ్లు, ఆకులు వినాయకుడికి సమర్పించి తమ భక్తిని చాటుతారు. ప్రస్తుతం వినాయక చవితి అంటే ముందుగా గుర్తొచ్చేది వినాయకుడి విగ్రహం. వాడవాడన వినాయక విగ్రహాలు పెట్టి గణపతి దేవుడిపై తమ భక్తిని చాటుతారు ప్రజలు. ఏ రూపంలో ఉన్నా, భక్తి పారవశ్యంతో తనను కొలిచే భక్తులను అనుగ్రహించే వినాయకుడి విగ్రహాలు సూక్ష్మం నుంచి అతి పెద్ద విగ్రహాలుగా మనం చూస్తూనే ఉన్నాం.


  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ యువకుడు వినాయకుడి అతి సూక్ష్మ ప్రతిమని తయారు చేసి తన భక్తిని చాటుకున్నాడు. 0.8 సెంటీమీటర్ల బుజ్జి వినాయకుడి విగ్రహం తాయారుచేసి పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణానికి చెందిన దారా ముక్తీశ్వర్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు.


  ఇది చదవండి: విధికి ఎదురీదుతున్న యువతి.. ఆమె పట్టుదలకు మనో ధైర్యానికి విధి కూడా సలాం కొట్టాల్సిందే..


  చిన్నతనం నుంచే చదువుతో పాటు చిత్రలేఖనం, బొమ్మల తాయారిపై ఆసక్తి పెంచుకున్న ముక్తీశ్వర్ ఎవరి వద్ద శిక్షణ తీసుకోకుండానే స్వయంగా పేపర్లోని చిత్రాలను గీస్తూ, మట్టితో బోమ్మలు చేస్తూ పలువురి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ప్రతి వినాయక చవితికి తమ ఇంట్లో పూజ నిమిత్తం తానే స్వయంగా వినకుడి విగ్రహం తయారు చేసుకునే ముక్తీశ్వర్, మట్టితో వివిధ రూపాల్లో గణపతి విగ్రహాలు తయారు చేయడం ప్రారంభించాడు.


  ఇది చదవండి: రాజన్న ధర్మగుండానికి మోక్షం ఎప్పుడు?: సహనం కోల్పోతున్న భక్తులు


  తనకున్న అభిరుచి మేరకు అతి సూక్ష్మ కళాఖండాలను తయారు చేసే ముక్తీశ్వర్, కేవలం 0.8 సెంటీమీటర్ల పొడవుతో అతి చిన్న వినాయక విగ్రహం తయారు చేసి అబ్బురపరుస్తున్నాడు. తనతో పాటు ఆసక్తి ఉన్నవారికీ సూక్ష్మ కళాఖండాల తయారీలో శిక్షణ కూడా ఇస్తున్నాడు ముక్తీశ్వర్. ఏదో చిన్న అభిరుచిగా ప్రారంభమైన తన కళా నైపుణ్యాన్ని అందరు ప్రశంసించే స్థాయికి వెళ్తుందని ఊహించలేదని ముక్తీశ్వర్ అంటున్నాడు.  ఓవైపు ముక్తీశ్వర్ లాంటి వాళ్లు సూక్ష్మ విగ్రహాలు రూపొందించి పూజిస్తుంటే.. తెలుగు రాష్ట్రాల్లో భారీ గణనాథులు పూజకు సిద్ధమయ్యారు. విశాఖలోని గాజువాకలో 80 అడుగులు, కర్నూలులో 55 అడుగుల మట్టిగణనాథులు సిద్ధమవగా.. ప్రఖ్యాత ఖైరతాబాద్ మహాగణపతి 50 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకున్నాడు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Bhadradri kothagudem, Local News, Telangana, Vinayaka Chavithi

  ఉత్తమ కథలు