(క్రాంతి, న్యూస్18, భద్రాద్రి కొత్తగూడెం)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhadrachalam) ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఇటీవల లడ్డూపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో బాధ్యులను చేస్తూ సహాయ కార్యనిర్వాహణ అధికారితో సహా ముగ్గురు ఉద్యోగులకు ఈవో శివాజీ మెమోలను జారీ చేశారు. ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను పురస్కరించుకొని తయారు చేసిన లడ్డూల్లో కొన్ని బూజుపట్టిన ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని దేవస్థానం అధికారులను దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఆదేశించారు. ఈ నేపధ్యంలో ఇందుకు బాధ్యులైన ముగ్గురిపై చర్యలు తీసుకుంటారని అంతా ఉహించన తరుణంలో.. మెమోలు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
Bhadradri Kothagudem: వీరి రాక కోసం ఎదురుచూసే రైతులు.. ఎందుకో తెలుసా?
దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కూరాకుల జ్యోతి, దేవాదాయ శాఖ ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ బాధ్యురాలు రమాదేవి, భద్రాచలం ఆర్డీవో రత్నకల్యాణి క్షేత్రస్థాయిలో జనవరి 11న పరిశీలించగా అదనపు కమిషనర్ జ్యోతి నివేదికను కమిషనర్‌కు అందజేశారు. బూజు పట్టిన లడ్డూల విషయంలో స్థానిక మ్యాజిస్ట్రేట్ సుమోటోగా కేసు స్వీకరించే వరకు చలనం లేని దేవస్థానం అధికారులు.. అనంతరం హడావుడిగా విచారణ కమిటీని నియమించి సంబంధిత ఉద్యోగులకు కేవలం చార్జీ మిమ్ములను జారీ చేయడం.. ప్రస్తుతం రామభక్తులకు తీవ్ర ఆగ్రవేశాలకు గురిచేస్తుంది. నిబద్ధతతో పని చేయాల్సిన అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లే ఇటువంటి చర్యలు పునరావృతం అవుతున్నానని సంబంధిత ఉద్యోగులను కఠినంగా శిక్షిస్తే భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు చోటుచేసుకునే అవకాశం ఉండదని రామభక్తులు డిమాండ్ చేస్తున్నారు.
ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన ప్రసాదాల కౌంటర్లు బూజు పట్టిన లడ్డూల అమ్ముతున్నారంటూ భక్తులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో స్థానిక మెజిస్ట్రేట్ సుమోటోగా కేసు స్వీకరించగా స్థానిక పోలీసులు లడ్డు కౌంటర్‌ను సీజ్ చేసేందుకు యత్నించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున దేవస్థానం ఉద్యోగులకు స్థానిక పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకోవడం.. అనంతరం దేవాదాయ శాఖ కమిషనర్ ఉన్నత స్థాయి కమిటీని విచారణతో విచారణ చేయించడం.. చక చకా జరిగిపోయాయి. ఇంతా జరిగిన విచారణ అనంతరం ఉద్యోగులకు మెమో జారీ చేయడం వెనుక పెద్ద ఎత్తున రాజకీయ నాయకుల లాబియింజ్ జరిగినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.