Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) భద్రాచలం (Bhadrachalam) లోని ఆసుపత్రులు మెడికల్ మాఫి యాగా మారాయని, అక్కడి వైద్యులు రోగుల ప్రాణాలతో, ఆడుకుంటూ డబ్బులు పోగేసుకుంటున్నారని, వైద్యులు పద్ధతి మార్చుకోకపోతే తగిన మూల్యం తప్పదని భద్రాద్రి కొత్తగూడెం , తూర్పు గోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ హెచ్చరించారు. భద్రాద్రి జిల్లా చర్ల విలేకరులకు సోమవారం ఆయన పేరిట లేఖను విడుదల చేశారు. మూడు రాష్ట్రాల సరిహ దులో ఉన్న భద్రాచలంలో మెడికల్ మాఫియా నడుస్తోందన్నారు. ఏజెన్సీ లోని గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఆసుపత్రులు పని చే స్తున్నాయన్నారు. ఛత్తీస్ గఢ్, ఒడిశా , ఆంధ్ర, తెలంగాణ ప్రజలను వైద్యం పేరుతో రోజుల తరబడి ఉంచుతూ, అవసరం లేకున్నాం రక్త పరీక్షలు చేసి, వైద్యులు, ల్యాబులు డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల నమ్మకాన్ని తూట్లు పొడుస్తూ కొంత మంది వైద్యులు రాక్షసుల్లా తయార య్యారని ఆరోపించారు.
పేదోళ్లు, పెద్దోళ్లు అనే తేడా లేకుండా రోగుల రక్తాన్ని జలగల్లా పీల్చుతున్నాని ఆరోపించారు. ప్రైవేట్ ఆసుపత్రులు మొదలు కొని, ప్రభుత్వ ఆసుపత్రి వరకు కాసుల కక్కుర్తి మరిగిన వైద్యులు జనా లను పీడించుకుతింటున్నారని ఆరోపించారు. ముఖ్యంగా భద్రాచలం ప్రభుత్వ వైద్యశాల్లో పని చేసే వైద్యులు తమ సొంత వైద్యశాలలకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారని ఆరోపించారు. రోగికి అందించాల్సిన వై ద్యాన్ని నిర్లక్ష్యం చేయడమే కాకుండా, వారికి లేనిపోని అబద్దాలు చెప్పి వారిని సొంత వైద్యశాలలకు తరలిస్తున్నారని ఆరోపించారు.
మందులను కూడా బ్రాండ్ల పేరుతో ఎక్కవ ధరకు అమ్ముతున్నారని ఆరోపించారు. ఇప్ప టికైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసే వైద్యులు, ప్రైవేట్ వైద్యశాలలు నడుపుతున్న వారు పద్ధతి మార్చుకోవాలని లేకపోతే వారికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని ఆజాద్ లేఖలో హెచ్చరించారు. మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన భద్రాచలం ఇప్పుడు మెడికల్ మాఫీయాకు కాసులు కురిపిస్తుంది. పూర్తి ఏజెన్సీ ప్రాంతం కావడంతో గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని సంపాదనే ధ్యేయంగా ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని బూచిగా చూపి వారిని భయభ్రాంతులకు గురిచేసి రోగుల రక్తం పిండుకుంటున్నారు.
ఛ గఢ్, ఒడిస్సా, ఆంధ్ర ప్రాంత గిరిజనులు, గిరిజనేతరులతో పాటు స్థానిక తెలంగాణ ప్రాంత ప్రజలను వైద్యం పేరుతో రోజుల తరబడి ఆసుపత్రుల్లో ఉంచి అవసరం లేకున్నా రకరకాల పరీక్షలు చేస్తూ ల్యాబులు, ఆసుపత్రులు, వైద్యులు ప్రజలను డబ్బుల కోసం హింసిస్తున్నారు. ప్రజల ప్రాణాలు ఇప్పడు ఆసుపత్రులకు డబ్బులు కురిపించే అవకాశాలుగా మారాయి. ప్రజల నమ్మకానికి తూట్లు పొడుస్తూ కొందరు వైద్యులు రాక్షసుల్లా తయారయ్యారు. పేదోళ్లు.. పేదోళ్ళనే తేడాలు లేకుండా రోగుల రక్తం జలగల్లా పీల్చుతున్నారు. ఆరోగ్య సమస్యలను అలుసుగా చేసుకుని.. మనిషిలో రకరకాల పరీక్షల పేర్లతో భయాన్ని సృష్టిస్తూ ఆసుపత్రి గల్లలను కొల్లలుగా నింపుకుంటున్నారు.
ప్రైవేటు ఆసుపత్రి మొదలుకొని ప్రభుత్వ ఆసుపత్రి వరకు కాసుల కక్కుర్తి మరిగిన వైద్యులు జనాలను పీడించుకుతింటున్నారు. ముఖ్యంగా భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలలో పని చేసే వైద్యులు సైతం తమ సొంత క్లీనిక్లకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తు ప్రభుత్వ సమయానికి రోగికి అందించాల్సిన వైద్యాన్ని నిర్లక్ష్యం చేయడమే పనివేళలను విస్మరిస్తున్నారు. కాకుండా, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల్లో లేనిపోని అబద్దపు అపోహలతో భయాన్ని పెంచి తమ సొంత క్లీనిక్స్ ని తరలించుకుంటున్నారు.
ప్రధానంగా మెడికల్ మాఫియాగా మారిన వైద్య వృత్తి ఫార్మ కంపెనీలతో జతకడుతూ తక్కువ ధరకు అమ్మాల్సిన మందులను బ్రాండుల పేర్లతో ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. ఇక్కడి వైద్యులు మనుషులకి కరెన్సీ నోట్లు ముద్ర వేసే యంత్రాల్లా భావిస్తూ నోటికి వచ్చిన టెస్టుల పేర్లు చెప్తూ.. చేతికి వచ్చిన ఖరీదైన మందుల పేర్లు రాస్తూ పేద ప్రజలను రాబందుల్లా పీక్కు తింటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Maoists, Telangana