హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri: ఎక్కడిక్కడే నిలిచిపోయిన మన ఊరు - మన బడి పనులు.. ఏజెన్సీ పాఠశాలలంటే చులకనా? 

Bhadradri: ఎక్కడిక్కడే నిలిచిపోయిన మన ఊరు - మన బడి పనులు.. ఏజెన్సీ పాఠశాలలంటే చులకనా? 

మన

మన ఊరు మన బడి

పాఠశాలల్లో విద్యుత్, బిల్డింగ్ మరమ్మతులు, తాగునీటి సదుపాయం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఫ్లోరింగ్, విద్యుత్ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులన్నీ విద్యాసంవత్సరం ప్రారంభం నాటికే పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ నిర్లక్ష్యం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Khammam, India

  (Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem)రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మన ఊరు -మన బడి (Mana vooru- Mana badi)' కార్యక్రమం నీరుగారిపోతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో (Government Schools) విద్యార్థుల సంఖ్య పెంచుకోవడానికి, మౌలిక సదుపాయాలను కల్పించి నూతన హంగులతో తీర్చిదిద్దాలని లక్ష్యంతో ప్రారంభమైంది మన ఊరు - మన బడి కార్యక్రమం. ఇందులో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా భద్రాచలం ఏజెన్సీ దుమ్ముగూడెం మండలంలోని 27 పాఠశాలలకు (Agency Schools) మరమ్మతులు, మౌలిక సదుపాయాలను కల్పించాలని స్థానిక అధికారులు గుర్తించారు. ఒక్కో పాఠశాలకు ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసిన అధికారులు ఆ మేరకు అనుమతుల కోరుతూ కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపారు. దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే సంబంధిత పాఠశాలలకు మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు.
  ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా అసంపూర్తిగా, నత్త నడకన పనులు సాగుతున్నాయి. పాఠశాలల్లో విద్యుత్, బిల్డింగ్ మరమ్మతులు (Repairs), తాగునీటి సదుపాయం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఫ్లోరింగ్, విద్యుత్ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులన్నీ విద్యాసంవత్సరం ప్రారంభం నాటికే పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ.. నేటికీ చాలాచోట్ల పనులన్నీ నత్తనడకనే సాగుతున్నాయి. ముఖ్యంగా పాఠశాలలకు పిల్లలు వచ్చే సమయంలో ఈ పనులు జరుగుతుండడంతో పాఠశాలల్లో చిందరవందర వాతావరణం తయారైంది.


  ఇదిలా ఉండగా మండలంలో మొదటి విడతలో ఎంపిక చేసిన 27 పాఠశాలల్లో 8 పాఠశాలలకు రూ .10 లక్షలకు పైగా నిధులు అవసరం కాగా, మరో 18 పాఠశాలలకు రూ. 10 లక్షల లోపు నిధులు, దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలకు రూ. 38 లక్షలకు పైగా నిధులు అవసరం కావడంతో అందుకు సంబంధించి టెండర్లు పిలుస్తున్నారు.
  మరోవైపు పాఠశాలలో ఎలక్ట్రికల్ మరమ్మతులలో భాగంగా ప్రస్తుతం ఉన్న ఫ్యాన్లు, లైట్లు, స్విచ్ బోర్డులను తొలగించి నూతన పనులను (Works) చేపట్టారు. అయితే ఇప్పటి వరకు విద్యుత్ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది.మరోవైపు పాఠశాల మరమ్మతులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు నయా పైసా కూడా చెల్లింపులు జరగలేదని తలల బాదుకుంటున్నారు. సంబంధిత హెచ్ఎం, ఎస్ఎంసీ చైర్మన్ ఖాతాలో ప్రభుత్వం నగదు జమ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇంత వరకు చేసిన పనులకు డబ్బులు పడకపోవడంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు సైతం అనాసక్తి చూపుతున్నారు.
  Business Idea: ఈ మహిళల ఐడియా అదరహో: మిల్లెట్స్ బిస్కెట్స్ తయారీలో ఉపాధి పొందుతున్న మహిళలు
  దీంతో దాదాపు అన్ని పాఠశాలల్లో పనులను మధ్యలోనే నిలిచిపోయాయి. పాఠశాలల రూపురేఖలు మారుతాయని విద్యార్థులతో పాటు తమ కష్టాలు తీరుతాయని భావించిన ఉపాధ్యాయులకు మరిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. విద్యుత్ వైరింగ్ తొలగించడం, ఫ్లోరింగ్ బద్దలు కొట్టడంతో ఆ తరగతులలో విద్యార్థులను కూర్చుబెట్టలేక, తరగతులు నిర్వహించలేక నానాయాతన పడుతున్నారు ఉపాధ్యాయులు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి పనులు త్వరగా పూర్తిచేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Bhadradri kothagudem, Local News, Telangana schools

  ఉత్తమ కథలు