Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రామ భక్తులకు భద్రాచలం చరిత్రను పూర్తిగా తెలియజేయాలని సంకల్పించాడు ఓ రామ భక్తుడు. అనుకున్నదే తడవుగా తన ఇంటినే రామాయణ ఘట్టాలతో అలంకరించి సచిత్ర శ్రీ భద్రాచల రామాయణ క్షేత్ర దర్శనిగా తీర్చిదిద్దాడు. సుదూర ప్రాంతాలనుండి వస్తున్న రామభక్తులకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రామాయణం సులువుగా అర్థం అయ్యేలా ఏర్పాట్లు చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem DIstrict) భద్రాచలం (Bhadrachalam) పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి కూతవేటు దూరంలో నివాసముంటున్న తోకల నాగేశ్వరరావు చిన్ననాటి నుంచే స్వామి వారి సేవలో పాల్గొనేవారు. తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) మాదిరిగా భద్రాచలం రాముల వారి దేవస్థానం విశిష్టతను ఎక్కువ మంది తెలియజేసేందుకు రామ్ దర్శినిపేరుతో ఓ మాస పత్రికను ప్రారంభించారు.
అంతేకాకుండా వీటితోపాటు తన ఇంట్లో పర్ణశాల కుటీరాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించిన సన్నివేశాన్ని కళ్ళకు కట్టే విధంగా తన ఇంట్లో ఏర్పాటు చేశారు తోకల నాగేశ్వరరావు. రామాయణ చాట్లతోపాటు పర్ణశాల కుటీరాన్ని ఏర్పాటు చేయడంతో నిత్యం ఆధ్యాత్మిక శోభన సంతరించుకుంటున్న తోకల నాగేశ్వరరావు ఇంటికి భక్తులు రావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. లక్ష్మణ సమేత సీతారామచంద్ర స్వామి వారు అయోధ్య నుంచి వనవాసానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రశాంతమైన దుమ్ముగూడెం మండలం పర్ణశాలకు వచ్చారని చరిత్ర పురాణాలు చెబుతున్నాయి.
అనంతరం ఓ రోజు స్వామివారు అమ్మవారితో కలిసి వనవిహారానికిప్రస్తుతం భద్రాద్రి క్షేత్రంగా విరాజుల్లుతున్న ప్రాంతానికి వచ్చి.. ఇక్కడ భద్రగిరిపై సేద తీరిన అనంతరం తాము సేద తీరడానికి సహకరించిన భద్రగిరి అనే పర్వతానికి మరుజన్మలో నా భక్తుడివై పుట్టి మోక్షాన్ని పొందుదువు గాక అని స్వామి వారు వరమిచ్చారని.. స్వామివారి అనుగ్రహానికి నిదర్శనంగా మరుజన్మలో భద్రుడిగా పుట్టిన భద్రగిరి పర్వతం స్వామివారిని తిరిగి భూమిపై దర్శించుకునేందుకు కఠోర తపస్సు చేసిందని.. బద్రుడి తపస్సుకు మెచ్చిన స్వామివారు వైకుంఠం నుంచి సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపంలో ప్రత్యక్షమవగా విష్ణుమూర్తి అవతారంలో ఉన్న రాములు వారిని చూసి పులకించిపోయిన బద్రుడు స్వామివారిని భూమిపైనే ఉండిపోవాలని ప్రార్థించడంతో బద్రుడిని తిరిగి భద్రగిరిగా మార్చి.. స్వామి వారు భూమిపై అవతరించారన్నట్లు భద్రాచలం ఆలయ చరిత్ర పురాణాలు చెబుతున్నాయి.
అచ్చం ఇవన్నీ నేటి తరానికి సులువుగా అర్థమయ్యే రీతిలో తోకల నాగేశ్వరరావు సుమారు 60 వరకు చాట్ల రూపంలో తన ఇంట్లో ఏర్పాటు చేశాడు. దేశ నలుమూలల నుంచి వస్తున్న భక్తులకు హిందీ, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో దీన్ని ఏర్పాటు చేయడంతో భక్తులు ఈ సచిత్ర భద్రాచల రామాయణ ధీమ్ చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana