Kranthi Kumar, News 18, Bhadradri
Good News to RTC Employees: తెలంగాణ (Telangana) రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) గ్రాండ్ హెల్త్ చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kotthagudem District) పరిధిలోని ఆర్టీసీ డిపోలైన కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోల్లోని డ్రైవర్లు, కండక్టర్లు, అద్దె బస్సుల డ్రైవర్లు, కార్యాలయ సిబ్బందికి వివిధ రకాల వైద్య పరీక్షలు (Medical Tests) నిర్వహించారు. మణుగూరులో నవంబర్ 18 నుంచి 23 వరకూ భద్రాచలం డిపో (Badrachalam Depo) లో నవంబర్ 24 నుంచి 27 వరకూ, కొత్తగూడెం డిపోలో నవంబర్ 28 డిసెంబర్ 2 వరకూ ఈ పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా భద్రాచలం డిపోలో మొత్తం 422 మందికి, మణుగూరు డిపోలో 337 మందికి, కొత్తగూడెం డిపోలో 304 మందికి ఆర్టీసీ వైద్యులు వివిధ వైద్య రకాల పరీక్షలు నిర్వహించారు.
వీరిలో భద్రాచలం డిపోలో నలుగురు, మణుగూరు డిపోలో ముగ్గురు మాత్రమే స్వల్పకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వారిని వెంటనే హైదరాబాద్ కు రిఫర్ చేశారు. వారు అక్కడ వైద్య సేవలు పొంది తిరిగి వచ్చి కోలుకుంటున్నారు.
ఈ టీఎస్ ఆర్టీసీ గ్రాండ్ హెల్త్ చాలెంజ్ లో ఆర్టీసీ సిబ్బంది, అద్దె బస్సుల డ్రైవర్లకు కలిపి మొత్తం 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రధానంగా కిడ్నీ, గుండె జబ్బులు, థైరాయిడ్, షుగర్, బీపీ, రక్త పరీక్షలు, కంటి పరీక్షలు, ఈసీజీ, మోకాళ్ల నొప్పుల పరీక్షలు సహా ఇతరత్రా పరీక్షలన్నీ చేశారు. వైద్య సహాయానికి సంబంధించిన మరికొన్ని సూచనలు చేశారు. ప్రత్యేకంగా గుండె జబ్బులపై అవగాహన కల్పించారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన ఆహారం గురించి, నిద్రలేమిని, ఒత్తిడిని అధిగమించేందుకు పాటించాల్సిన నియమాల గురించి, ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు.
ఇదీ చదవండి : మండూస్ పై సీఎం జగన్ అలర్ట్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
ఇదిలా ఉండగాఆర్టీసీ బస్సులో ప్రయాణం సుఖవంతం, సురక్షితం', 'మీ భద్రత-మా బాధ్యత' అనే నినాదాలకు పూర్తి భరోసానిస్తోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే ప్రయాణికుల భద్రత పరిపూర్ణ అనే పదానికి అర్థం చేకూరుతుందని విశ్వసించింది. తమ సేవలు నమ్మి తమ సంస్థ బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలంటే ముందుగా తన ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండాలని సంకల్పించింది.
ఇదీ చదవండి : ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలిసుండాలి.. రాష్ట్ర విభజనను వెనక్కు తిప్పాలన్న సజ్జల
ఇందుకోసం గ్రాండ్ హెల్త్ చాలెంజ్ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ముఖ్యంగా బస్సు నడిపే డ్రైవర్ ఆరోగ్యంగా ఫిట్ గా ఉండాలని తలచి వారికి సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. డ్రైవర్ తో పాటు ఇతర ఉద్యోగుల హెల్త్ ప్రొఫైల్స్ ను రూపొందించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం డివిజన్ లోని ఆర్టీసీ ఉద్యోగులంతా ఆరోగ్యంగా ఉన్నట్లు ఈ ప్రొఫైల్ చెబుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Badradri, Kothagudem, Local News, Telangana, Tsrtc