హోమ్ /వార్తలు /తెలంగాణ /

Crime news : పరాకాష్టకు చేరిన లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు .. కస్టమర్లను అగ్లీగా చూపిస్తూ ప్రచారం

Crime news : పరాకాష్టకు చేరిన లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు .. కస్టమర్లను అగ్లీగా చూపిస్తూ ప్రచారం

LOAN APP HARASSMENTS

LOAN APP HARASSMENTS

Crime news: లోన్ యాప్ నిర్వాహకుల అరాచకం పరాకాష్టకు చేరింది. లోన్ రికవరీ పేరుతో ఇప్పటి వరకు బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌తో పాటు అసభ్య పదజాలంతో తిట్టిపోస్తూన్న కేటుగాళ్లు తాజాగా రూటు మార్చారు. తమలో దాగివున్న మరో రకమైన వికృత రూపాన్ని అమాయకులపై ప్రదర్శిస్తున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Khammam, India

  (G.SrinivasReddy,News18,Khammam)

  లోన్ యాప్ loan app నిర్వాహకుల అరాచకం పరాకాష్టకు చేరింది. లోన్ రికవరీ పేరుతో ఇప్పటి వరకు బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌(Blackmail)తో పాటు అసభ్య పదజాలంతో తిట్టిపోస్తూన్న కేటుగాళ్లు ఇప్పుడు రూటు మార్చారు. రుణాలు వసూలు చేసుకునే క్రమంలో అనేక రకాల వేధింపులకు పాల్పడుతున్న దేశముదుర్లు తమ వేధింపులు పాల్పడటంతో పెట్రోగిపోతున్నారు. తమలో దాగివున్న మరో రకమైన వికృత రూపాన్ని చూపిస్తున్నారు లోన్ యాప్ నిర్వహాకులు. మహిళలనైతే మరీ దారుణంగా చిత్రీకరిస్తున్నారు. ప్రాస్టిట్యూట్‌(Prostitute)లా చిత్రీకరిస్తూ, ఫొటో(Photo)ఫోన్ నెంబరు(Phone number)ను సైట్‌(Site)లో పోస్ట్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem)లో ఇదే తరహా వేధింపులు ఓ బాధితుడు ఎదుర్కొన్నాడు.

  Sad news: ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులు జలసమాధి ..ఎలా జరిగిందంటే..?

  లోన్‌ యాప్‌ నిర్వాహకుల దుర్మార్గాలు..

  లోన్‌ యాప్‌లో రుణాలు తీసుకున్న పాపానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  అశ్వారావుపేట, ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో కొందరు చేయని నేరానికి పరువు పోగొట్టుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. లోన్ యాప్ కేటుగాళ్లు రూట్ మార్చారు. ఇంతవరకు యాప్ ద్వారా లోన్ తీసుకొని చెల్లించలేక పోయిన వారిని వేధించేవాళ్లు. ఇప్పుడు అసలు లోను తీసుకోకపోయినా మొబైల్‌ను హ్యాక్ చేసి డబ్బులు వసూలు చేసేందుకు బరితెగించారు. సన్నిహితులు బంధువులకు అభ్యంతరకర మెసేజ్‌లు, ప్రైవేట్ కాల్స్‌తో బ్లాక్ మెయిల్ చేస్తూ.. డబ్బుల కోసం టార్చర్ పెడుతున్నారు.

  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆరాచకం..

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన ప్రముఖ వ్యాపారి శీమకుర్తి రవికుమార్ మొబైల్‌ను హ్యాక్ చేసిన దుండగులు లోన్ యాప్ పేరిట అభాసుపాలు చేస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు శీమకుర్తి రవికుమార్, వారం క్రితం ఓ లోన్ యాప్ ద్వారా రూ.1700 లోన్ తీసుకున్నట్లుగా.. ఏడు రోజుల కాలపరిమితి ముగిసినప్పటికీ డబ్బులు చెల్లించడంలేదంటూ అభ్యంతరమైన మెసేజ్‌లతో వేధించడం మొదలుపెట్టారు. అంతటితో ఆగకుండా అసలు 1700 వడ్డీ 1300 మొత్తం 3000 రూపాయలను శీమకుర్తి రవికుమార్ చెల్లించని పక్షంలో.. షూరిటీగా ఉన్నారని మీ నుంచి రికవరీ చేయాల్సి ఉంటుందని తెలిపారు.

  Telangana politics : జాతీయ రహదారి చుట్టూ రాజకీయాలు .. కాంగ్రెస్ ,TRSనేతల మధ్య మాటల యుద్ధం

  వ్యాపారికి నరకం చూపించారు..

  వ్యాపారి రవికుమార్‌ను చోర్, సెక్స్ వర్కర్‌గా చిత్రీకరిస్తూ.. అతని కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారికి వాట్సాప్ మెసేజ్‌లు, ప్రైవేట్ నెంబర్లతో ఫోన్లు చేస్తూ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. తీసుకొని లోన్‌కి డబ్బులు చెల్లించలేదంటూ చేస్తున్న ప్రచారానికి సదరు వ్యాపారి ఖంగుతున్నాడు. దుండగులు చేస్తున్న టార్చర్‌తో మానసిక వేదనకు గురయ్యాడు. సన్నిహితులు సలహా ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లోన్ యాప్ ఆగడాలకు చెక్ పెట్టేది ఎలా అని ప్రజల్లో సందేహాలు ఉన్నాయి. ఇప్పటికైనా సైబర్ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి.. కఠిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఆర్థిక నేరాలు మరింత పుంజుకునే అవకాశం ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Bhadradri kothagudem, Loan apps, Telangana News

  ఉత్తమ కథలు