హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri: ఏజెన్సీ ఏరియాలో కూచిపూడి నృత్యానికి కేర్ ఆఫ్ అడ్రెస్ ఈ మాస్టారు

Bhadradri: ఏజెన్సీ ఏరియాలో కూచిపూడి నృత్యానికి కేర్ ఆఫ్ అడ్రెస్ ఈ మాస్టారు

భద్రాచలం

భద్రాచలం ఏజెన్సీలో కూచిపూడి నాట్యం నేర్పిస్తున్న కొండలరావు

నాట్యాన్ని వృత్తిగా మార్చుకొని ఎంతోమంది పిల్లలకు నాట్యంలో శిక్షణ ఇస్తూ, నృత్య ప్రదర్శనలు చేసేందుకు వారిని ప్రోత్సహిస్తూ భావితరాలకు కూచిపూడి నృత్యం (Kuchipudi Dance) ప్రాముఖ్యతను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ మాస్టరు.

  • News18 Telugu
  • Last Updated :
  • Bhadrachalam, India

    Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

    నాట్యాన్ని వృత్తిగా మార్చుకొని ఎంతోమంది పిల్లలకు నాట్యంలో శిక్షణ ఇస్తూ, నృత్య ప్రదర్శనలు చేసేందుకు వారిని ప్రోత్సహిస్తూ భావితరాలకు కూచిపూడి నృత్యం (Kuchipudi Dance) ప్రాముఖ్యతను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ మాస్టరు. ఏ మాత్రం స్వలాభం లేకుండా ఏజెన్సీ ఏరియాలోనూ బాలబాలికలకు కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇస్తూ జీవంపోస్తూ కూచిపూడి కళకు కొండంత అండగా నిలుస్తున్నాడు భద్రాచలం (Bhadrachalam) పట్టణానికి చెందిన చల్లా కొండలరావు మాస్టారు. కూచిపూడి నృత్యంలో ఎం.ఏ పూర్తి చేసిన ఈయన అభినయ కూచిపూడి నాట్యాలయం పేరుతో భద్రాచలం ఏజెన్సీ వ్యాప్తంగా కూచిపూడి కళ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నాడు. భద్రాచలం పట్టణానికి చెందిన చల్లా అంజయ్య- లక్ష్మమ్మల కుమారుడైన కొండలరావు భద్రాచలంలోనే పుట్టిపెరిగి తన నాలుగో ఏట నుంచే కూచిపూడి నృత్యం చేయడం ప్రారంభించాడు.

    అప్పట్లో భద్రాచలం పట్టణంలో కూచిపూడి నృత్యం నేర్పుతున్న రఘునాధ వద్ద శిక్షణ తీసుకున్న కొండలరావు చిన్ననాటి నుంచి ప్రదర్శనలు ఇచ్చేవాడు. కూచిపూడి నృత్య కళాకారుడుగా మొదలైన ఈయన జీవిత ప్రస్థానం భద్రాచలం ఏజెన్సీలోనే కూచిపూడి నృత్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. 2000వ సంవత్సరంలో కూచిపూడి శిక్షకుడిగా మారిన కొండలరావు మాస్టారు 22 ఏళ్లుగా నిర్విరామంగా కూచిపూడి కళాకారులను తయారు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీలో భద్రాచలం, సారపాక, మణుగూరు, చర్ల, వెంకటాపురం తదితర ప్రాంతాల్లో 200 మందికి పైగా బాలబాలికలు, యువతీయువకులు కొండలరావు ద్వారా కూచిపూడి నృత్యాన్ని అభ్యసిస్తూ, శిక్షణ పొందుతున్నారు. కొండలరావు తన శిష్యులతో జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చారు.

    ఇది చదవండి: రైతు బజార్లో కూరగాయలు అమ్ముతున్న విద్యార్థులు.., ఎందుకో తెలుసా..?

    కళాతపస్వి కె.విశ్వనాధ్ లాంటి ప్రముఖులు అభినందనల అందుకున్నారు కొండలరావు. కూచిపూడి కళ అభివృద్ధికి కొండలరావు చేస్తున్న కృషిని గుర్తించిన కుందా సత్యనారాయణ కళాక్షేత్రం యాజమాన్యం 'నాట్య కళా నిధి' పురస్కారంతో అభినందించింది. చెన్నైకి చెందిన ఓ యూనివర్సిటీ బెస్ట్ ఫెర్ఫార్మర్ అవార్డుతో సత్కరించింది. రోటరీక్లబ్ ఆఫ్ ఇన్ భద్రా వారు 'కళా ప్రవీణ' అవార్డుతో సన్మానించారు.

    అంతేకాకుండా సిలికానాంధ్ర ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జయహో కూచిపూడి శిష్యులతో పాల్గొని నిర్వాహకులు కుందుపట్ల ఆనంద్ ప్రసంశలందుకున్నారు. సిలికానాంధ్ర నిర్వహించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూచిపూడి నృత్య ప్రదర్శనలో సైతం పాల్గొన్నారు. తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ప్రముఖ దేవాలయాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన బ్రహ్మోత్సవాలలో సైతం కొండలరావు విద్యార్థులు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు.

    ఇది చదవండి: కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్ము చెదల పాలు.., వృద్ధ దంపతులకు తీరని కష్టం

    తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో సైతం కొండలరావు తన శిష్య బృందంతో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. కొండలరావు మాస్టారి శిష్యురాలు సాయి స్నేహిత 2015 డిసెంబర్ 5న నిర్విరామంగా నాలుగున్నర గంటల పాటు ఉకూచిపూడి నృత్యం చేసి ప్రపంచ రికార్డు సాధించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కేంద్రంగా అభినయ కూచిపూడి నాట్యాలయం పేరుతో కూచిపూడి నృత్య కళలో శిక్షణ ఇస్తున్నారు కొండలరావు. కూచిపూడిలో శిక్షణ తీసుకోవాలనుకునే ఆసక్తికలవారు 9959652886 నంబర్ నందు సంప్రదించవచ్చు.

    Published by:Purna Chandra
    First published:

    Tags: Bhadradri kothagudem, Local News, Telangana

    ఉత్తమ కథలు